RBI: మార్కెట్లో రూ.2000 నోట్లు ఔట్.. మీ వద్ద ఇంకా ఉన్నాయా? అయినా మార్చుకోవచ్చు.. ఎలాగంటే..
సెప్టెంబర్ 30 వరకు నోట్ల ను బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయడానికి లేదా ఇతర నోట్లతో మార్చుకోవడానికి అనుమతి ఇచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ). అనంతరం గడువును అక్టోబర్ 7వ తేదీ వరకు పొడిగించారు. ఏదైనా బ్యాంకు కార్యాలయానికి వెళ్లి నోట్లు మార్చుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు పొడిగించిన అక్టోబర్ 7వ తేదీ వరకు గడువు కూడా ముగిసింది. అయితే..
ఇక రూ. 2000 నోట్ల కథ ముగిసినట్లే. గత నాలుగు నెలల కిందట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించి ఆ రెండు వేల రూపాయల నోట్లను వెనక్కి తీసుకోవాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఇక రూ.2000 నోట్ల చలామణికి అక్టోబర్ 7వ తేదీ వరకు గడువు ముగిసింది. అయినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలు) కొన్ని కార్యాలయాలలో ఇప్పటికీ నోట్ల మార్పిడికి అనుమతి ఉంది . ఈ అవకాశం ఎంతకాలం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్బీఐ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ అవకాశం ఉంటుంది. గత వారం ఆర్బీఐ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఆర్బీఐ 19 ఇష్యూ కార్యాలయాలలో 2,000 రూపాయల నోట్ల మార్పిడికి అనుమతి ఉంది.
మే 19, 2023న, రూ. 2,000 డినామినేషన్ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. బ్యాంకింగ్ ప్రక్రియలో భాగంగా, ఈ నోట్ల చెల్లుబాటు వ్యవధి ముగియడంతో నోట్లను చలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్‌బిఐ తెలిపింది.
అయితే సెప్టెంబర్ 30 వరకు నోట్ల ను బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయడానికి లేదా ఇతర నోట్లతో మార్చుకోవడానికి అనుమతి ఇచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ). అనంతరం గడువును అక్టోబర్ 7వ తేదీ వరకు పొడిగించారు. ఏదైనా బ్యాంకు కార్యాలయానికి వెళ్లి నోట్లు మార్చుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు పొడిగించిన అక్టోబర్ 7వ తేదీ వరకు గడువు కూడా ముగిసింది. అయితే రూ.2000 నోటు చెల్లదు. ఇప్పుడు కూడా ఈ నోట్లను మార్చుకోవచ్చు. అయితే, ఇది కొన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కార్యాలయాల్లో మాత్రమే అనుమతించబడుతుంది.
రూ. 2,000 నోట్ల మార్పిడి కోసం 19 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ కార్యాలయాలు ఉన్న నగరాలు
1. అహ్మదాబాద్
2. బెంగళూరు
3. భువనేశ్వర్
4. ముంబై
5. నవీ ముంబై
6. భోపాల్
7. లక్నో
8. చండీగఢ్
9. చెన్నై
10. గౌహతి
11. హైదరాబాద్
12. జమ్మూ
13. జైపూర్
14. కాన్పూర్
15. కోల్‌కతా
16. నాగ్‌పూర్
17. న్యూఢిల్లీ
18. పాట్నా
19. తిరువనంతపురం
ఇక్కడ మీరు పైన జాబితా చేయబడిన నగరాల్లోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కార్యాలయా ల ఇష్యూ విభాగానికి వెళ్లి, మీ బ్యాంక్ ఖాతాలో రూ. 2,000 నోట్లను డిపాజిట్ చేయవచ్చు లేదా నోట్లను మార్చుకోవచ్చు. మీరు నోట్లను మార్చుకోవాలనుకుంటే సరైన ID రుజువును అందించాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి