Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Okaya Motofaast: అదిరిపోయే స్పీడ్‌తో మరో కొత్త స్కూటర్‌ రిలీజ్‌ చేసిన ఒకాయ.. బుకింగ్స్‌ ఓపెన్‌

మొదట్లో పట్టణ ప్రాంతాలకే పరిమితమైనా క్రమేపి గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయి. ఈవీ వాహనాలు ఇచ్చే మైలేజ్‌, స్పీడ్‌ విషయంలో కొంత మంది వీటి కొనుగోలుకు వెనుకడగు వేస్తున్నారు. అయితే కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు టెక్నాలజీను అప్‌డేట్‌ చేస్తూ మైలేజ్‌ స్పీడ్‌ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. అందువల్ల కంపెనీలు కూడా వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్తకొత్త మోడల్స్‌ను రిలీజ్‌ చేస్తున్నాయి. తాజాగా ఒకాయ కంపెనీ మోటో ఫాస్ట్‌ పేరిట మరో కొత్త మోడల్‌ను రిలీజ్‌ చేసింది.

Okaya Motofaast: అదిరిపోయే స్పీడ్‌తో మరో కొత్త స్కూటర్‌ రిలీజ్‌ చేసిన ఒకాయ.. బుకింగ్స్‌ ఓపెన్‌
Okaya Moto Faast
Follow us
Srinu

| Edited By: Ravi Kiran

Updated on: Oct 09, 2023 | 8:30 AM

ప్రస్తుత రోజుల్లో ఆటోమొబైల్‌ రంగంలో ఈవీ వాహనాల హవా నడుస్తుంది. పెరుగుతున్న పెట్రోల్‌ ధరల నుంచి రక్షణకు ప్రజలు ఈవీ వాహనాలను ఇష్టపడుతున్నారు. ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న కాలుష్యం బారి నుంచి బయటపడడానికి ఈవీ స్కూటర్లపై ప్రత్యేక సబ్సిడీలను ఇస్తూ వీటి కొనుగోలును ప్రోత్సహిస్తుంది. అయితే ఈవీ వాహనాలు మొదట్లో పట్టణ ప్రాంతాలకే పరిమితమైనా క్రమేపి గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయి. ఈవీ వాహనాలు ఇచ్చే మైలేజ్‌, స్పీడ్‌ విషయంలో కొంత మంది వీటి కొనుగోలుకు వెనుకడగు వేస్తున్నారు. అయితే కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు టెక్నాలజీను అప్‌డేట్‌ చేస్తూ మైలేజ్‌ స్పీడ్‌ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. అందువల్ల కంపెనీలు కూడా వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్తకొత్త మోడల్స్‌ను రిలీజ్‌ చేస్తున్నాయి. తాజాగా ఒకాయ కంపెనీ మోటో ఫాస్ట్‌ పేరిట మరో కొత్త మోడల్‌ను రిలీజ్‌ చేసింది. ముఖ్యంగా మైలేజ్‌తో పాటు స్పీడ్‌ విషయాలను పరిగణలోకి తీసుకుని ఈ తాజా మోడల్‌ను రిలీజ్‌ చేసిందని నిపుణులు చెబుతున్నారు. మోటోఫాస్ట్‌కు సంబంధించి మరిన్ని వివరాలను ఓ సారి తెలుసుకుందాం.

ఒకాయ మోటో ఫాస్ట్‌ గరిష్ట వేగం గంటకు 75 కిలోమీటర్లుగా ఉంది. ముఖ్యంగా నగర ప్రాంత ప్రజల ట్రాఫిక్‌ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ స్కూటర్‌ను రూపొందించారు. అలాగే ఈ స్కూటర్‌ గరిష్ట మైలేజ్‌ 120 కిలోమీటర్లు ఇస్తుంది. రోజువారీ ప్రయాణాలకు ఈ స్కూటర్‌ అనువుగా ఉంటుంది. ఈ స్కూటర్‌ ఐదు రంగు ఎంపికల్లో అందుబాటులో ఉంటుంది. సియాన్‌, నలుపు, ఆకుపచ్చ, ఎరుపు, బూడిద రంగుల్లో ఈ స్కూటర్‌ కొనుగోలుకు సిద్ధంగా ఉంటుంది. అయితే ప్రస్తుతానికి ఒకాయ మోటో ఫాస్ట్‌ స్కూటర్‌కు సంబంధించిన మోటర్‌ గరిష్ట అవుట్‌ పుట్‌ వివరాలను కంపెనీ వెల్లడించలేదు. అయితే ఎలక్ట్రిక్‌ మోటర్‌ విషయానికి వస్తే ఈ స్కూటర్‌కు హబ్‌ మౌంటెడ్‌ యూనిట్‌గా వస్తుంది. ఒకాయ మోటో ఫాస్ట్‌ స్కూటర్‌ అల్లాయ్‌ వీల్స్‌తో ట్యూబ్‌లెస్‌ టైర్లతో ఆకర్షణీయంగా ఉంటుంది. 

ఒకాయ మోటో ఫాస్ట్‌ 7 అంగుళాల టచ్‌ స్క్రీన్‌తో ద్వారా పని చేస్తుంది. ఈ స్కూటర్‌ వేగం, ఓడో మీటర్‌, రైడింగ్‌ మోడ్‌, సమయం, బ్యాటరీ శాతాన్ని ఈ స్క్రీన్‌లో మనం చూడవచ్చు. హెడ్‌ ల్యాంప్‌, టర్న్‌ ఇండికేటర్‌ ఎల్‌ఈడీ లైట్లతో వస్తుంది. ఈ స్కూటర్‌ ముందు, వెనుక వైపున డిస్క్‌ బ్రేక్స్‌తో వస్తుంది. అలాగే ముందు వైపున టెలిస్కోపిక్‌ ఫోర్కులు, వెనుక వైపు షాక్‌ అబ్జార్బర్‌లతో వస్తాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి