Stock Market Fall: ఐదు రోజుల్లో 15.74 కోట్ల సంపద ఆవిరి.. మార్కెట్‌ను వెంటాడుతున్న భయాలు..
ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. భారత స్టాక్ మార్కెట్‌లో ఈరోజు వరుసగా ఐదో రోజు కూడా క్షీణత కనిపించింది. ఐదు రోజుల్లో 15.74 లక్షల కోట్ల పెట్టుబడిదారుల సంపద ఆవిరయింది...
ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. భారత స్టాక్ మార్కెట్‌లో ఈరోజు వరుసగా ఐదో రోజు కూడా క్షీణత కనిపించింది. ఐదు రోజుల్లో 15.74 లక్షల కోట్ల పెట్టుబడిదారుల సంపద ఆవిరయింది. విదేశీ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, విదేశీ పెట్టుబడిదారుల (ఎఫ్‌ఐఐలు) పెట్టుబడుల ఉపసంహరణ కనిపించింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్ర బ్యాంకులు తీసుకుంటున్న కఠిన చర్యలు ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు ఉన్నాయి. అదే సమయంలో వివిధ కారణాల వల్ల, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల వృద్ధి అంచనాలు కోత విధిస్తూనే ఉన్నాయి. కఠిన చర్యల వల్ల సెంటిమెంట్లు, దిగజారవచ్చని మార్కెట్ భయపడుతోంది. గత 5 సెషన్లలో బీఎస్‌ఈలో లిస్టయిన అన్ని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.15.74 లక్షల కోట్లు తగ్గింది.
ఇందులో గురువారం నాటి సెషన్‌లోనే రూ.5 లక్షల కోట్లకు పైగా పతనం కనిపించింది. గురువారం నిఫ్టీ ఏడాది కనిష్ట స్థాయికి చేరుకుంది. మరోవైపు సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా పతనాన్ని నమోదు చేసింది. గత 5 సెషన్లలో సెన్సెక్స్ 3824 పాయింట్లు నష్టపోయింది. BSEలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 5 రోజుల్లో రూ.15,74,931.56 కోట్లు తగ్గి రూ.2,39,20,631.65 కోట్లకు చేరుకుంది. సెంట్రల్ బ్యాంకుల కఠినమైన వైఖరి మధ్య ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు వృద్ధి రేటును ఎలా నిలబెట్టుకుంటాయోనని మార్కెట్ ఆందోళన చెందుతోందని రెలిగేర్ బ్రోకింగ్ VP రీసెర్చ్ అజిత్ మిశ్రా అన్నారు. మెహతా ఈక్విటీ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే ప్రకారం గురువారం పదునైన పతనం తర్వాత, ఫెడ్, రిజర్వ్ బ్యాంక్ యొక్క మొండితనం, చమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం గురించి ఆందోళనల కారణంగా మార్కెట్ తిరిగి బలపాడాలంటే కష్టమన్నారు.