Aadhaar Helpline: ఆధార్‌ కార్డు విషయంలో మీకు ఏవైనా సందేహాలున్నాయా..? ఈ టోల్‌ ప్రీ నెంబర్‌కు ఫోన్‌ చేయండి

Aadhaar Helpline: ఆధార్‌ కార్డు ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యమైనది. ప్రభుత్వ, ప్రైవేటు పథకాలతో పాటు ఇతర చిన్నపాటి అవసరాలకు కూడా ఆధార్‌ ముఖ్యమైన డాక్యుమెంట్‌గా..

Aadhaar Helpline: ఆధార్‌ కార్డు విషయంలో మీకు ఏవైనా సందేహాలున్నాయా..? ఈ టోల్‌ ప్రీ నెంబర్‌కు ఫోన్‌ చేయండి
Follow us
Subhash Goud

|

Updated on: Jun 16, 2022 | 5:31 PM

Aadhaar Helpline: ఆధార్‌ కార్డు ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యమైనది. ప్రభుత్వ, ప్రైవేటు పథకాలతో పాటు ఇతర చిన్నపాటి అవసరాలకు కూడా ఆధార్‌ ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారిపోయింది. అయితే ఆధార్‌కు సంబంధించి చాలా మంది అనేక సమస్యలుంటాయి. ఆధార్‌ సమస్యలపై చాలా మందికి అనేక ప్రశ్నలు తలెత్తుతుంటాయి. ఇలాంటి వారికి హైదరాబాద్‌ యుఐడిఎఐ ప్రాంతీయ కార్యాలయం ఓ ట్వీట్‌ చేసింది. ఆధార్‌కు సంబంధించిన ఏవైనా ప్రశ్నలుంటే టోల్‌ప్రీ నెంబర్‌ను సంప్రదించి పరిష్కరించుకోవచ్చని తెలిపింది. ఏవైనా ప్రశ్నలుంటే టోల్‌ ప్రీ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 1947కు సంప్రదించాలని తెలిపింది.

ఇవి కూడా చదవండి

ప్రతి రోజు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, అలాగే ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ టోల్‌ ప్రీ నెంబర్‌ను సంప్రదించి ప్రశ్నలకు సమాధానం అందుకోవాలని ట్వీట్‌లో తెలిపింది. IVRS మోడ్‌లో ఆధార్ హెల్ప్‌లైన్ నంబర్ 24X7, 365 రోజులు కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి