Royal Enfield Classic 350: సెకండ్ హ్యాండ్‌లో బైక్ కొనే ప్లాన్ ఉందా? కేవలం రూ. 50 వేలకే రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్.. అదిరిపోయే ఆఫర్ మీకోసమే!
మీరు కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. ఈ వార్త మీకోసమే.. ఈ రోజు మీరు ఎంచుకోగల కొన్ని ఎంపికల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

టూ వీలర్ సెగ్మెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ అనేక క్రూయిజర్ బైక్‌లతో అందుబాటులో ఉంది. కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 మార్కెట్‌లో విభిన్నమైన గుర్తింపును దక్కించుకుంది. దాని స్టైలిష్ లుక్ కారణంగా, ఇది చాలా కాలంగా దేశంలోని ప్రతి వ్యక్తి ఎంపిక. ఒక కస్టమర్ ఈ బైక్‌ను కొనుగోలు చేయాలనుకుంటే.. దాని కోసం ఎక్స్-షోరూమ్ ధర రూ.1.51 లక్షల నుంచి రూ.1.66 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే మీ దగ్గర అంత బడ్జెట్ లేకపోయినా ఇంకా ఈ బైక్ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇంత సులభమైన పద్ధతిని అవలంబించడం ద్వారా రూ. 50 నుంచి రూ. 70 వేలల్లో కూడా ఈ బైక్ ను మీ సొంతం చేసుకోవచ్చు.
దేశంలో చాలా ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు ఉన్నాయి. ఇక్కడ చాలా సెకండ్ హ్యాండ్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. అనేక ఇతర కంపెనీల బైక్‌లు కూడా ఈ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్నాయి. అయితే, ఆన్‌లైన్‌లో ఏదైనా సెకండ్ హ్యాండ్ బైక్‌ను కొనుగోలు చేసే ముందు.. మీరు దాని కండిషన్, పేపర్‌ను క్షుణ్ణంగా చెక్ చేయాలి.. లేకుంటే మీరు మోసపోవచ్చు.
సెకండ్ హ్యాండ్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350..
OLXలో లభించే సెకండ్ హ్యాండ్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 మొదటి డీల్ గురించి ఇవాళ మేము మీకు చెప్పబోతున్నాం. ఈ బుల్లెట్ 350 ధర.. రూ. 50 వేల అడిగారు. ఇది 2010 మోడల్ బైక్. దీని నంబర్ ఢిల్లీలో నమోదైంది. విక్రేత ఈ బైక్‌తో మరే ఇతర ఆఫర్‌ను ఇవ్వడం లేదు.
2011 రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350
ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 బైక్ 2011 మోడల్. ఈ బైక్ నంబర్ ప్లేట్ ఢిల్లీలో రిజిస్టర్ చేయబడింది. బైక్ ధర రూ.60,000, విక్రేత దానితో పాటు అదనపు స్పోక్ వీల్స్‌ను కూడా అందిస్తోంది. ఈ బైక్ QUIKR వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.
2012 రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350
ఈ సెకండ్ హ్యాండ్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 డీల్ BIKES4SALE వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఈ 2012 మోడల్ బైక్ ధర రూ. 65 వేల అమ్మకానికి పెట్టారు. ఇది ఢిల్లీ నంబర్ బైక్, ఫైనాన్స్ కూడా అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం కొనేద్దాం..
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం