AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Royal Enfield Bullet 350: సరికొత్తగా బుల్లెట్టు బండి.. బ్లాక్ కలర్లో మైండ్ బ్లాంక్ చేస్తోందిగా..

ఇప్పుడు కొత్త మోడల్ ఎన్ ఫీల్డ్ బైక్ ను కాస్త పాత మోడల్ కు దగ్గరగా తీసుకొస్తూ.. కొత్తగా లాంచ్ చేసింది. రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ 350 ఇది వాస్తవానికి రెట్రో మోటార్ సైకిల్. అయితే దీనికి పాత రూపాన్ని ఇస్తూ.. కొత్త కలర్ ఆప్షన్లో మార్కెట్లోప్రవేశపెట్టింది. అదే బెటాలియన్ బ్లాక్ పెయింట్ స్కీమ్.  రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ 350 బెటాలియన్ బ్లాక్ కలర్ బైక్ ధర రూ. 1.75 లక్షలు (ఎక్స్-షోరూమ్, చెన్నై).

Royal Enfield Bullet 350: సరికొత్తగా బుల్లెట్టు బండి.. బ్లాక్ కలర్లో మైండ్ బ్లాంక్ చేస్తోందిగా..
Royal Enfield Bullet 350
Madhu
|

Updated on: Sep 20, 2024 | 4:28 PM

Share

రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఈ బ్రాండ్ అంటేనే యూత్ కు యమ క్రేజ్.. దుగ్గు దుగ్గు సౌండ్ తో అది చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఈ బ్రాండ్ నుంచి ఏ బైక్ వచ్చినా దానిపై ఆసక్తి ఉంటుంది. వాస్తవానికి పాత కాలం నాటి మోడల్ కు కాస్త కొత్త హంగులు అద్దుతూ.. దాని సౌండ్ ను కూడా కాస్త తగ్గించింది ఆ కంపెనీ. అయితే ఇప్పుడు కొత్త మోడల్ ఎన్ ఫీల్డ్ బైక్ ను కాస్త పాత మోడల్ కు దగ్గరగా తీసుకొస్తూ.. కొత్తగా లాంచ్ చేసింది. రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ 350 ఇది వాస్తవానికి రెట్రో మోటార్ సైకిల్. అయితే దీనికి పాత రూపానికి దగ్గరగా తీసుకొస్తూ కొత్త కలర్ ఆప్షన్లో మార్కెట్లోప్రవేశపెట్టింది. అదే బెటాలియన్ బ్లాక్ పెయింట్ స్కీమ్.  రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ 350 బెటాలియన్ బ్లాక్ కలర్ బైక్ ధర రూ. 1.75 లక్షలు (ఎక్స్-షోరూమ్, చెన్నై).

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 బెటాలియన్ బ్లాక్..

కొత్త బెటాలియన్ బ్లాక్ షేడ్ సింగిల్-ఛానల్ ఏబీఎస్ వేరియంట్లో ముందు డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్ సెటప్ ఇచ్చారు. ఫ్యూయల్ ట్యాంక్ పై బ్లాక్ పెయింట్ స్కీమ్, సైడ్ ప్యానెల్ పై బంగారు, ఎరుపు రంగు బ్యాడ్జింగ్ తో వచ్చింది. స్వూపింగ్ సింగిల్ సీటు అనేది ఒక ప్రధానమైన బుల్లెట్ ఫీచర్.

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 స్పెసిఫికేషన్స్..

కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 అదే జే-సిరీస్ ప్లాట్ఫారమ్ ఆధారంగానే రూపొందించారు. ఇది క్లాసిక్ 350, హంటర్ 350, మెటోర్ 350లలోనూ ఉంటుంది. దీనిలో సుపరిచితమైన 349సీసీ ఎయిర్-కూల్డ్, సింగిల్- సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. మోటార్ 6,100 ఆర్పీఎం వద్ద 20 బీహెచ్పీ, 4,000 ఆర్పీఎం వద్ద 27 ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5- స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తుంది. బైక్ ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక వైపున డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి. బైక్ ముందు భాగంలో 19-అంగుళాలు 18 అంగుళాల వెనుక చక్రాల పై నడుస్తుంది. తాజా బెటాలియన్ బ్లాక్ కలర్ ఆప్షన్ బుల్లెట్ 350లోని మొత్తం నలుపు రంగుల సంఖ్యను ఆరుకు పెంచింది. శ్రేణి మిలిటరీ బ్లాక్ షేడ్ తోనే మొదలవుతుంది. ఆ తర్వాత కొత్త బెటాలియన్ బ్లాక్, తదుపరిది మిలిటరీ సిల్వర్ బ్లాక్, ఫ్యూయల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్స్ పై వెండి అక్షరాలు ఉన్నాయి. ఖరీదైన డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ వెర్షన్లు ప్రత్యేకంగా స్టాండర్డ్ బ్లాక్, టాప్- స్పెక్ బ్లాక్ గోల్డ్ కలర్లో వస్తోంది. ఈ శ్రేణి రూ. 2.16 లక్షలు (ఎక్స్- షోరూమ్, చెన్నై) నుంచి ప్రారంభమవుతుంది.

మార్కెట్లో వీటితో పోటీ..

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 సంప్రదాయ రూపంలో వచ్చింది. ఆధునిక సాంకేతిక విజార్డ్ లేకపోవడం రైడింగ్ అనుభవాన్ని వీలైనంత ప్రామాణికంగా ఉంచడంలో సహాయపడుతుంది. బుల్లెట్ 350, జావా 350, బెనెల్లీ ఇంపీరియాల్ 400, హెూండా సీబీ350 వాటి వాటితో ఇది మార్కెట్లో పోటీ పడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..