Maruti WagonR Waltz Edition: వావ్ అనేలా వ్యాగన్ఆర్ కొత్త ఎడిషన్.. అంతలా ఆ కారులో ఏముందంటే..

చిన్న పరిమాణంలో ఉండటం, అనువైన బడ్జెట్లో కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో మన మార్కెట్లో ఈ కారుకు అధిక డిమాండ్ ఉంటోంది. ఇప్పుడు దీనికి అప్ గ్రేడెడ్ వెర్షన్ ను లిమిటెడ్ ఎడిషన్ గా మారుతీ సుజుకీ లాంచ్ చేసింది. కొత్త వ్యాగన్ ఆర్ పేరు వాల్ట్జ్ లిమిటెడ్ ఎడిషన్. ఫెస్టివల్ సీజన్లో పరిమిత సంఖ్యలోనే ఈ కారు అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది.

Maruti WagonR Waltz Edition: వావ్ అనేలా వ్యాగన్ఆర్ కొత్త ఎడిషన్.. అంతలా ఆ కారులో ఏముందంటే..
Maruti Suzuki Wagnor Waltz Edition
Follow us
Madhu

|

Updated on: Sep 20, 2024 | 4:56 PM

మన దేశంలో అత్యధిక అమ్ముడవుతున్న కార్లలో మారుతి సుజుకీ వ్యాగన్ ఆర్ ఒకటి. చిన్న పరిమాణంలో ఉండటం, అనువైన బడ్జెట్లో కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో మన మార్కెట్లో ఈ కారుకు అధిక డిమాండ్ ఉంటోంది. ఇప్పుడు దీనికి అప్ గ్రేడెడ్ వెర్షన్ ను లిమిటెడ్ ఎడిషన్ గా మారుతీ సుజుకీ లాంచ్ చేసింది. కొత్త వ్యాగన్ ఆర్ పేరు వాల్ట్జ్ లిమిటెడ్ ఎడిషన్. ఫెస్టివల్ సీజన్లో పరిమిత సంఖ్యలోనే ఈ కారు అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఈ కారు వ్యాగన్ ఆర్ లోనే అన్ని ట్రిమ్స్ అంటే ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ లలో అందుబాటులో ఉంటుంది. వీటి ధరలు రూ. 5.64లక్షలు(ఎక్స్ షోరూం) నుంచి ప్రారంభమవుతున్నాయి. ఆసక్తి ఉన్న వినియోగదారులు దగ్గరలోని డీలర్ వద్ద అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకోవాలని కంపెనీ కోరింది. డెలివరీలు త్వరలో మొదలవుతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ వాల్ట్జ్ లిమిటెడ్ ఎడిషన్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ వాల్ట్జ్ లిమిటెడ్ ఎడిషన్..

ఈ కొత్త ఎడిషన్ కారు చూడటానికి స్టాండర్డ్ మోడల్ వ్యాగన్ఆర్ మాదిరిగానే ఉంటుంది. అయితే దీనిలో కొత్తగా ఫాగ్ ల్యాంప్, ఫాగ్ ల్యాంప్ గార్నిష్, ముందు వైపు క్రోమ్ గ్రిల్, విండో వైజర్, ఇంకా కొన్ని అదనపు ఆకర్షణ తెచ్చే మార్పులను కంపెనీ చేసింది.

ఎక్స్‌టీరియర్ ఇలా..

ఈ కారు ఎక్స్‌టీరియర్ గురించి మాట్లాడితే 14 అంగుళాల స్టీల్ చక్రాలు, రిఫ్లెక్టివ్ హాలోజెన్ హెడ్ లైట్లు, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్స్, ఫాక్స్ సిల్వర్ స్కిడ్ ప్లేట్ వంటివి ఉంటాయి.

ఇంటీరియర్ ఇలా..

కారు లోపల విషయానికి వస్తే లే అవుట్ మొత్తం స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే డిజైనర్ సీట్ కవర్, 6.2 అంగుళాల పయోనీర్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, బ్లూ టూత్ కనెక్టివిటీ, రివర్స్ కెమెరా, ఆడియో కంట్రోల్ తో కూడిన 3 స్పోక్ స్టీరింగ్ వీల్, సెమీ డిజిటల్ క్లస్టర్, నాలుగు పవర్ విండోలు, 14 ప్లస్ అదనపు యాక్సెసరీలు ఉంటాయి. భద్రత విషయానికి వస్తే ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్, ఈబీడీ, ఈఎస్సీ, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఈ కారులో ఇచ్చారు.

ఇంజిన్ సామర్థ్యం..

ఈ కొత్త వ్యాగన్ ఆర్ లిమిటెడ్ ఎడిషన్లో రెండు ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది. ఒకటి 1.0 లీటర్, 3 సిలిండర్, ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్ వస్తుంది. 67 హెచ్పీ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. రెండోది 1.2 లీటర్, 4 సిలిండర్, ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్ 90హెచ్పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. రెండింటీకీ 5 స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ ఆప్షన్లు ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..