2024 Tata Punch: పది వేరియంట్లతో టాటా పంచ్.. మార్కెట్లో సెన్సేషన్..!

2024 టాటా పంచ్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది రూ. 6.13లక్షల(ఎక్స్ షోరూం) ధరతో ప్రారంభమవుతుంది. టాటా పంచ్ పలు వేరియంట్లను కూడా కలిగి ఉంది. 2024 టాటా పంచ్ క్రియేటివ్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్ ఎస్ఆర్, ప్యూర్ రిథమ్ వాటి పేర్లు. వీటితో పాటు మరో మూడు కొత్త వేరియంట్లను కూడా జోడించింది.

2024 Tata Punch: పది వేరియంట్లతో టాటా పంచ్.. మార్కెట్లో సెన్సేషన్..!
2024 Tata Punch
Follow us
Madhu

| Edited By: Srinu

Updated on: Sep 20, 2024 | 5:34 PM

ఇటీవల కాలంలో టాటా కార్లకు డిమాండ్ పెరుగుతోంది. వాటి నాణ్యత, ఆధునిక ఫీచర్ల, తక్కువ ధర కారణంగా వినియోగదారులు వాటి వైపు మొగ్గుచూపేలా చేస్తున్నాయి. కాగా మార్కెట్లో టాటా నుంచి అత్యంత ఎక్కువ అమ్ముడయ్యే కారు టాటా పంచ్. దీనికున్న డిమాండ్ ఆధారంగా టాటా కంపెనీ దీనిని అప్ గ్రేడ్ చేసి రీలాంచ్ చేసింది. 2024 టాటా పంచ్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది రూ. 6.13లక్షల(ఎక్స్ షోరూం) ధరతో ప్రారంభమవుతుంది. ఈ 2024 టాటా పంచ్ పలు వేరియంట్లను కూడా కలిగి ఉంది. 2024 టాటా పంచ్ క్రియేటివ్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్ ఎస్ఆర్, ప్యూర్ రిథమ్ వాటి పేర్లు. వీటితో పాటు మరో మూడు కొత్త వేరియంట్లను కూడా జోడించింది. అవి అడ్వెంచర్ ఎస్, అడ్వెంచర్ + ఎస్, ప్యూర్ (O). వీటితో కలిపి ఇప్పుడు టాటా పంచ్ ఏకంగా 10 వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. ప్యూర్, ప్యూర్ (0), అడ్వెంచర్, అడ్వెంచర్ రిథమ్, అడ్వెంచర్ సన్రూఫ్, అడ్వెంచర్ + సన్రూఫ్, అకాంప్లిష్డ్ +, అకాంప్లిష్డ్ + సన్రూఫ్, క్రియేటివ్ +, క్రియేటివ్ + సన్రూఫ్. ఈ వేరియంట్ల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

2024 టాటా పంచ్..

కొత్త టాటా పంచ్ 1.2-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో జత చేసి ఉంటుంది. లేదా 84 బీహెచ్పీ, 113 ఎన్ఎం టార్క్ అవుట్ పుట్ తో కూడిన ఏఎంటీతో జత చేసి ఉంటుంది. ఇదే ఇంజిన్ కాన్ఫిగరేషన్ సీఎన్జీ ఆప్షన్ కూడా ఉంది. సీఎన్జీ పవర్ అవుట్ పుట్ 72 బీహెచ్పీ, 103ఎన్ఎం టార్క్ ఉంటుంది. ఇప్పుడు వేరియంట్ల గురించి చూద్దాం..

2024 టాటా పంచ్ ప్యూర్..

ఎంట్రీ లెవల్ వేరియంట్ అయిన టాటా పంచ్ ప్యూర్ ధర రూ.6.13 లక్షలు(ఎక్స్ షోరూం). అనేక భద్రత, సౌకర్యవంతమైన ఫీచర్లను కలిగి ఉంది. వీటిలో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్పీ), వెనుక పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. అదనపు సౌలభ్యం కోసం, పంచ్ ప్యూర్ ఇంటెలిజెంట్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీని అందిస్తోంది. 90-డిగ్రీల డోర్ ఓపెనింగ్, టిల్ట్- అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ ను కలిగి ఉంటుంది.

2024 టాటా పంచ్ ప్యూర్ (O)..

టాటా పంచ్ ప్యూర్ (O) ధర రూ. 6.70 లక్షలు(ఎక్స్ షోరూం). స్టాండర్డ్ ప్యూర్ వేరియంట్ కంటే దీనిలో అదనపు ఫీచర్లు ఉంటాయి. వీల్ కవర్లు, ఎలక్ట్రికల్గా సర్దుబాటు చేయగల ఓఆర్వీఎంలు, ఫ్లిప్ కీతో సెంట్రల్ రిమోట్ లాకింగ్, పవర్ విండోస్ ఉన్నాయి.

2024 టాటా పంచ్ అడ్వెంచర్..

టాటా పంచ్ అడ్వెంచర్ రూ.7 లక్షల(ఎక్స్ షోరూం) ధరతో, ప్యూర్ (O) వేరియంట్ లోని ఫీచర్ల జాబితాను మరింత మెరుగుపరుస్తుంది. ఇది స్టోరేజ్ కోసం పార్సెల్ ట్రే, నాలుగు-స్పీకర్ల ఆడియో సిస్టమ్, 3.5-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, బాడీ-కలర్ ఓఆర్వీఎంలు, యాంటీ-బ్లేర్ ఐఆర్వీఎం ఉంటుంది. ఫాలో- మీ- హెూమ్ హెడ్ల్యాంప్ లు, యూఎస్బీ చార్జింగ్ పోర్ట్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ వంటి అదనపు ఫీచర్లను పొందుతుంది.

2024 టాటా పంచ్ అడ్వెంచర్ రిథమ్..

టాటా పంచ్ అడ్వెంచర్ రిథమ్ రూ. 7.35 లక్షల(ఎక్స్ షోరూం) ధరతో, మెరుగైన సౌండ్ క్లారిటీ కోసం రెండు ట్వీటర్ జోడింపుతో ప్రీమియం ఆడియో అనుభూతిని అందిస్తుంది. ఇందులో రివర్స్ పార్కింగ్ కెమెరా, వైర్డు యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన పెద్ద 7 అంగుళాల ఇన్ఫో టైన్మెంట్ స్క్రీన్ ఉన్నాయి.

2024 టాటా పంచ్ అడ్వెంచర్ ఎస్..

టాటా పంచ్ అడ్వెంచర్ ఎస్ ధర రూ. 7.60 లక్షలు(ఎక్స్ షోరూం). ఈ వేరియంట్ రిథమ్ వేరియంట్ పై కంఫర్ట్, కన్వీనియన్స్ ఫీచర్ల శ్రేణిని అందిస్తుంది. వీటిలో ఎత్తు- సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, ఎలక్ట్రిక్ సన్రూఫ్, రెయిన్- సెన్సింగ్ వైపర్లు, మెరుగైన సిగ్నల్ రిసెప్షన్ కోసం షార్క్ ఫిన్ యాంటెన్నా, వెనుక ఏసీ వెంట్లు ఉన్నాయి. సన్రూఫ్ తో కూడిన టాటా పంచ్ అడ్వెంచర్ వెనుక యూఎస్బీ ఛార్జర్, ఆటోమేటిక్ హెడ్యాంప్ లు, రూఫ్ రెయిల్స్, ఫ్రంట్ ఆర్మ్రెస్ట్ కూడా ఉన్నాయి.

2024 టాటా పంచ్ అడ్వెంచర్ + ఎస్..

దీని ధర రూ. 8.10 లక్షల(ఎక్స్ షోరూం) ధరతో, అడ్వెంచర్ విత్ సన్రూఫ్ వేరియంట్ కంటే అధునాతన ఫీచర్ల శ్రేణిని అందిస్తుంది. వీటిలో రివర్స్ పార్కింగ్ కెమెరా, టైప్-సి ఫాస్ట్ ఛార్జర్, రెండు ట్వీటర్లు, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, పెద్ద 7-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్,వెనుక వైపర్, వాషర్ ఉన్నాయి.

2024 టాటా పంచ్ అకాంప్లిష్డ్ +

టాటా పంచ్ అకాంప్లిష్డ్ + ధర రూ. 8.30 లక్షలు(ఎక్స్ షోరూం). ఇది అధునాతన ఫీచర్ల ల శ్రేణిని అందిస్తుంది. వీటిలో క్రూయిజ్ కంట్రోల్, షార్క్ ఫిన్ యాంటెన్నా, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇది వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆటో క్లైమేట్ కంట్రోల్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్లు, 15-అంగుళాల స్టీల్ వీల్స్, ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, వెనుక యూఎస్బీ ఛార్జర్తో కూడిన పెద్ద 10.25- అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ను పొందుతుంది. వేరియంట్ సులభంగా యాక్సెస్ కోసం ఒక-టచ్ డౌన్ డ్రైవర్ విండోతో పాటు వెనుక డీఫాగర్, ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్ లైట్ కూడా పొందుతుంది.

2024 టాటా పంచ్ అకాంప్లిష్డ్ + ఎస్..

ఈ వేరియంట్ ధర రూ.8.80 లక్షల(ఎక్స్ షోరూం). అకాంప్లిష్డ్ + వేరియంట్పై అదనపు ఫీచర్ల శ్రేణిని అందిస్తుంది. వీటిలో పైకప్పు పట్టాలు, ఆటోమేటిక్ హెడ్ల్యాంప్లు, ఎలక్ట్రిక్ సన్రూఫ్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు ఉన్నాయి.

2024 టాటా పంచ్ క్రియేటివ్ +

టాటా పంచ్ క్రియేటివ్ + రూ. 9 లక్షల(ఎక్స్ షోరూం) ధర ఉంటుంది. అకాంప్లిష్డ్ + వేరియంట్ కంటే ప్రీమియం ఫీచర్ల శ్రేణిని అందిస్తుంది. వీటిలో వెనుక ఆర్మ్ రెస్ట్, లెదర్ గేర్ నాబ్, 16-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్, సౌకర్యవంతమైన ఛార్జింగ్ కోసం వైర్ లెస్ ఛార్జర్ ఉన్నాయి. ఇది రెయిన్-సెన్సింగ్ వైపర్లు, యాంటీ-పింప్తో కూడిన వన్-టచ్ డ్రైవర్ విండో, ట్రైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్), లెదర్ స్టీరింగ్ వీల్, ఆటో-ఫోల్డింగ్ ఓఆర్వీఎంలు, పుడిల్ ల్యాంప్లను పొందుతుంది.

2024 టాటా పంచ్ క్రియేటివ్ + ఎస్

ఈ లైనప్ లో టాప్ వేరియంట్ ఇదే . దీని ధర రూ. 9.50 లక్షలు(ఎక్స్ షోరూం). క్రియేటివ్ + వేరియంట్ కన్నా మెరుగైన ఫీచర్లను అందిస్తుంది. ఇది ఎలక్ట్రిక్ సన్రూఫప్ ను అందిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..