Cancer: కారు వాడుతున్న వారికి క్యాన్సర్ ముప్పు! ఎన్‌జీటీ కీలక ఉత్తర్వులు..

ఓ షాకింగ్ న్యూస్ ఇటీవల వెలుగులోకి వచ్చింది. కార్ల ఇంటీరియర్స్ అంటే లోపలి భాగాల్లో సీట్లు, ఇతర వస్తువుల కోసం వినియోగించే కెమికల్స్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని పలు అంతర్జాతీయ సంస్థలు నివేదికలు ఇచ్చాయి. దీనిపై మన దేశంలో కూడా తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్జీటీ) కీలకమైన ఆదేశాలచ్చింది. కార్ల ఇంటీరియర్లలో వినియోగించే హానికరమైన కెమికల్స్ గురించి విచారణ చేయాలని, అవి ఎంత వరకూ భద్రమో తెలిపాలని ప్రభుత్వాన్ని కోరింది.

Cancer: కారు వాడుతున్న వారికి క్యాన్సర్ ముప్పు! ఎన్‌జీటీ కీలక ఉత్తర్వులు..
Car Interior
Follow us
Madhu

|

Updated on: Sep 20, 2024 | 5:54 PM

ఇటీవల కాలంలో కారు వినియోగం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా కరోనా అనంతర పరిణామాల్లో కాస్త స్థితిమంతులందరూ సొంత కార్లను కొనుగోలు చేస్తున్నారు. వాటిని విరివిగా వినియోగిస్తున్నారు. అయితే కార్లను ఎక్కువగా వినియోగిస్తున్న వారికి ఓ షాకింగ్ న్యూస్ ఇటీవల వెలుగులోకి వచ్చింది. కార్ల ఇంటీరియర్స్ అంటే లోపలి భాగాల్లో సీట్లు, ఇతర వస్తువుల కోసం వినియోగించే కెమికల్స్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని పలు అంతర్జాతీయ సంస్థలు నివేదికలు ఇచ్చాయి. దీనిపై మన దేశంలో కూడా తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్జీటీ) కీలకమైన ఆదేశాలచ్చింది. కార్ల ఇంటీరియర్లలో వినియోగించే హానికరమైన కెమికల్స్ గురించి విచారణ చేయాలని, అవి ఎంత వరకూ భద్రమో తెలిపాలని ప్రభుత్వాన్ని కోరింది. లీగర్ ఎంక్వైరీ చేయాలని ఆదశాలిచ్చింది. వాహనాల్లో అగ్ని నిరోధకాలుగా వినియోగించే టీడీసీఐపీపీ, టీసీఈపీలపై అనుమానం వ్యక్తం చేసింది. వీటితో క్యాన్సర్ ప్రమాదం కూడా ఉందని తెలిపింది. దీంతో రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) సహా పలు కీలక నియంత్రణ సంస్థల నుంచి దీనిపై నివేదికలు ఇవ్వాలని ఎన్జీటీ కోరింది.

పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కు ఆ సామర్థ్యం లేదు..

కార్ ఇంటీరియర్లలో వాడే రసాయనాల వల్ల క్యాన్సర్ ప్రమాదం ఉందన్న ఆందోళన నేపథ్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్జీటీ) చైర్‌పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ, జస్టిస్‌లు సుధీర్ అగర్వాల్, ఎ సెంథిల్ వేల్ తో కూడిన ట్రిబ్యూనల్ కీలక కామెంట్లు చేసింది. కార్లలో వాడే ఆ రసాయనాలు క్యాన్సర్ కారకమా కాదా అని పరీక్షించే సామర్థ్యం ప్రస్తుతం సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ)కి లేదని చెప్పింది. మరోవైపు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సెప్టెంబర్ 10న దీనిపై ఓ నివేదిక ను సమర్పించింది. దానిలో ఈ రసాయనాలతో సంబంధం ఉన్న క్యాన్సర్ ప్రమాదాలపై స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ), నేషనల్ ఆటోమోటివ్ టెస్టింగ్, ఆర్ అండ్ డీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లు ( ఎన్ఏటీఆర్ఐపీ) సహా ఇతర ఏజెన్సీలను తమ ప్రతిస్పందనలను సమర్పించాల్సిందిగా ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ సంస్థలకు తమ స్టేట్‌మెంట్‌లను అందించడానికి ఎనిమిది వారాల సమయం ఇచ్చింది. ఈ విషయాన్ని 2025, జనవరి 3న మళ్లీ సమీక్షిస్తామని ట్రిబ్యూనల్ వివరించింది.

పెరుగుతున్న ఆందోళన..

ఈ విషయంపై ఎటువంటి స్పష్టత రాకపోవడంతో కారు వినియోగదారుల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. కారు ఇంటీరియర్లో ముఖ్యంగా సీట్ల విషయంలో ఈ అస్పష్ట సమాచారంతో ఆరోగ్యానికి సంబంధించి కంగారు పడుతున్నారు. మరో వైపు ఈ రసాయనాలు కారు వినియోగదారులకు కలిగించే సంభావ్య ప్రమాదాలను పరిశోధించడానికి, స్పష్టం చేయడానికి నియంత్రణ సంస్థలు ఇప్పుడు తీవ్ర ఒత్తిడి మధ్య పనిచేస్తున్నాయి. వీలైనంత త్వరగా దీనిపై స్పష్టత తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!