AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Robert Kiyosaki: స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలినా.. మిమ్మల్ని సేఫ్‌గా ఉంచే 4 పెట్టుబడులు ఇవే!

ప్రస్తుత ఆర్థిక అస్థిరతలు, స్టాక్ మార్కెట్ నష్టాల నేపథ్యంలో, రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకీ కీలక సూచనలు చేశారు. ప్రపంచ ఆర్థిక పతనం ప్రారంభ దశలో ఉందని హెచ్చరిస్తూ, ప్రభుత్వాల ఫియట్ కరెన్సీలను "నకిలీ"గా అభివర్ణించారు. సంపదను కాపాడుకోవడానికి బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఇథిరియం వంటి "నిజమైన ఆస్తుల"లో పెట్టుబడి పెట్టాలని ఆయన సలహా ఇచ్చారు.

Robert Kiyosaki: స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలినా.. మిమ్మల్ని సేఫ్‌గా ఉంచే 4 పెట్టుబడులు ఇవే!
Robert Kiyosaki
SN Pasha
|

Updated on: Nov 16, 2025 | 7:13 PM

Share

చాలా మంది స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతుంటారు. వారిలో ఎక్కువ మంది నష్టపోతుంటారు. స్టాక్‌ మార్కెట్‌ అనేది నిత్యం ఒడిదుడుగులకు లోనౌతూ ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్ల పరిస్థితి అలాగే ఉంది. ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితులు, వాణిజ్య సమస్యలు, మార్కెట్ల ప్రకంపనలు ఇన్వెస్టర్ల సంపదను పెద్ద రిస్క్ లో పెడుతున్నాయి. అయితే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా పెట్టుబడిదారులను సేఫ్‌గా ఉండే ఓ నాలుగు పెట్టుబడి మార్గాల గురించి రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ రియోసాకీ వెల్లడించారు.

ప్రస్తుతం కొనసాగుతున్న ప్రపంచ ఆర్థిక అస్థిరతలు ఊహించని ఆర్థిక పతనానికి దారితీయవచ్చని ఆయన హెచ్చరించారు. ఈ పరిస్థితి ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉందని కచ్చితంగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వాలు ముద్రించే ఫియెట్ కరెన్సీలు ఎల్లప్పిటికీ ఫేక్ అని.. పేదలను అవి ఇంకా పేదలుగా మారుస్తుంటాయని కియోసాకి అభిప్రాయపడ్డారు. అందుకే ప్రజలు తమ డబ్బును బిట్ కాయిన్, సిల్వర్, గోల్డ్, ఇథిరియం వంటి నిజమైన ఆస్తుల్లో పెట్టాలన్నారు. బిట్ కాయిన్ పరిమిత స్థాయిలో మైనింగ్ చేయటానికి వీలు ఉన్నందున డబ్బును అతి భయపెడుతుందని చెప్పారు. అందుకే దానిని కొనొచ్చని చెప్పారు.

అలాగే ప్రభుత్వాలు విక్రయించే బాండ్స్ అలాగే బ్యాంకింగ్ వ్యవస్థ కూడా పెద్ద అబద్ధంగా కియోసాకీ చెప్పారు. తక్కువ రిస్క్ తీసుకోవాలనుకునే ప్రజలు బ్యాంకుల్లో డిపాజిట్లు చేయటం నుంచి బాండ్స్ కొనటం వరకు వివిధ మార్గాలను ఎంచుకుంటుంటారని, కానీ ఇవి సేఫ్ అనుకోవటం భ్రమగా పేర్కొన్నారు కియోసాకీ.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us