AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CIBIL: సిబిల్​ స్కోర్​ 700 పైనే ఉన్నా లోన్​ రిజెక్ట్​.. కారణమేంటో తెలుసా?

రుణ ఆమోదం కోసం సిబిల్ స్కోర్ ప్రధాన ప్రమాణం. సాధారణంగా 750కి పైగా సిబిల్​ స్కోర్ ఉంటే మంచి స్థాయిగా భావిస్తారు. అయినా 700+ స్కోర్ ఉన్నవారికి కూడా లోన్ రిజక్ట్​ అవుతుంది. ఎందుకంటే, లోన్​ రిజెక్ట్​ అవడానికి సిబిల్ స్కోర్ ఒక్కటే కాదు..

CIBIL: సిబిల్​ స్కోర్​ 700 పైనే ఉన్నా లోన్​ రిజెక్ట్​.. కారణమేంటో తెలుసా?
Cibil
Nikhil
|

Updated on: Nov 17, 2025 | 11:42 AM

Share

ఈరోజుల్లో బ్యాంకు రుణాలు సర్వసాధారణ అంశంగా మారిపోయాయి. వ్యాపారం, ఉద్యోగం, చదువు, వ్యక్తిగత అవసరాలకు కూడా బ్యాంకు రుణాలు తీసుకుంటున్నారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు, అవసరాల నిమిత్తం అప్పులు కూడా జీవితంలో భాగమయ్యాయి. భారత్‌లో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం సాధారణం.

రుణ ఆమోదం కోసం సిబిల్ స్కోర్ ప్రధాన ప్రమాణం. సాధారణంగా 750కి పైగా సిబిల్​ స్కోర్ ఉంటే మంచి స్థాయిగా భావిస్తారు. అయినా 700+ స్కోర్ ఉన్నవారికి కూడా లోన్ రిజక్ట్​ అవుతుంది. ఎందుకంటే, లోన్​ రిజెక్ట్​ అవడానికి సిబిల్ స్కోర్ ఒక్కటే కాదు, మరెన్నో కారణాలు ఉంటాయి.

అసలు.. సిబిల్ అంటే ఏమిటి?

సిబిల్ పూర్తి పేరు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్. ఇది భారత్‌లో అతి పెద్ద క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సంస్థ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రుణాలు తీసుకునేందుకు సిబిల్​ స్కోర్​ని తప్పనిసరి చేసింది. బ్యాంక్​ అకౌంట్లలోని లావాదేవీల ఆధారంగా 300-900 మధ్య స్కోర్ ఇస్తుంది. సిబిల్‌తో పాటు ఎక్స్‌పీరియన్, ఈక్విఫాక్స్, హైమార్క్ వంటి సంస్థలు కూడా ఉన్నాయి. కానీ భారత్‌లో సిబిల్​కు అత్యధిక ప్రాధాన్యం ఉంది.

డెబ్ట్-టు-ఇన్‌కమ్ రేషియో (DTI) – కీలక అంశం

బ్యాంక్​లో లోన్​ తీసుకునేందుకు సిబిల్ స్కోర్‌తో సమానంగా DTI రేషియో ముఖ్యం. ఇది మొత్తం ఆదాయంలో ఎంత శాతం అప్పు చెల్లింపులకు వెళ్తుంది అనేది చూపిస్తుంది. ఒక వ్యక్తి నెల జీతం యాభై వేలు, అప్పు EMIలు 20 వేలు, అంటే.. DTI = (20,000 / 50,000) × 100 = 40%. బ్యాంకులు సాధారణంగా DTI 35% కంటే తక్కువ ఉన్నవారికే రుణాలు ఇస్తాయి. కానీ 45% దాటితే రిజెక్ట్ అవకాశం ఎక్కువ.

స్థిర ఆదాయం & ఉద్యోగం

రుణం తీసుకోవాలనుకునే వ్యక్తికి కనీస ఆదాయం ఉండాలి. ఒకే కంపెనీలో కనీసం 1-2 సంవత్సరాలు పనిచేసి ఉండాలి. మొత్తం పనిచేసిన అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. గతంలో EMIలు ఆలస్యం, డిఫాల్ట్ ఉంటే ప్రతికూల అంశాలు. సంబంధిత బ్యాంకులో ఖాతా, డిపాజిట్లు ఉంటే రుణం తీసుకోవడం సులువవుతుంది.

అంతేకాదు, కొన్ని NBFCలు డిగ్రీ/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కూడా చూస్తాయి. మంచి సిబిల్ స్కోర్ మాత్రమే చాలదు, DTI తక్కువగా, స్థిర ఆదాయం, మంచి క్రెడిట్ హిస్టరీ ఉండాలి. రుణం తీసుకునే ముందు పై అంశాలు సరిచూసుకోవాలి. అవసరమైతే DTI తగ్గించడానికి పాత అప్పులు ముందుగా క్లియర్ చేయాలి. ఆయా అంశాల్లో జాగ్రత్తలు తీసుకుంటే బ్యాంకుల నుంచి రుణం పొందే అవకాశాలు మెరుగవుతాయి.