AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2024: బడ్జెట్‌పై పెరుగుతున్న అంచనాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెబుతారా..?

భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధిచి మరకొన్ని రోజుల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీంతో వివిధ రంగాలకు చెందిన వాటాదారులు ప్రభుత్వం ఆర్థిక విధానాల్లో ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా పన్ను విధానాల్లో మార్పులతో పాటు అనే ఉపశమనాలను అందించే అవకాశం ఉందని నిపుణులు చెబుతుండడంతో ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఆసక్తిగా ఉన్నారు.

Budget 2024: బడ్జెట్‌పై పెరుగుతున్న అంచనాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెబుతారా..?
Budget 2024
Nikhil
|

Updated on: Jun 25, 2024 | 7:45 PM

Share

భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధిచి మరకొన్ని రోజుల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీంతో వివిధ రంగాలకు చెందిన వాటాదారులు ప్రభుత్వం ఆర్థిక విధానాల్లో ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా పన్ను విధానాల్లో మార్పులతో పాటు అనే ఉపశమనాలను అందించే అవకాశం ఉందని నిపుణులు చెబుతుండడంతో ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 2024 బడ్జెట్ గురించి అంచనాలు ఎలా ఉన్నాయో? ఓసారి తెలుసుకుందాం.  బడ్జెట్ 2024లో పాత ఆదాయపు పన్ను స్లాబ్‌లకు సర్దుబాట్లు ఉండవచ్చు లేదా కొత్త విధానం కోసం పన్ను మినహాయింపు పరిమితిలో పెరుగుదల ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది వివిధ ఆదాయ వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. కొత్త పన్ను విధానంలో అధిక వ్యయంతో కూడిన నిర్దిష్ట సమూహాలకు పన్ను ఉపశమనం అందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టవచ్చు. 2024-25 పూర్తి బడ్జెట్‌ను వచ్చే నెల జులై 23 లేదా 24న పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.

8వ వేతన సంఘం, ఓపీఎస్

8వ వేతన సంఘం రాజ్యాంగం, జీతభత్యాల వర్గానికి పన్ను రాయితీ పెంపుదల, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం వంటివి సీతారామన్ ముందస్తు బడ్జెట్ సమావేశంలో కార్మిక సంఘాల నేతలు డిమాండ్లు చేశారు. ముఖ్యంగా పీఎస్‌యూల ప్రైవేటీకరణ చర్యను నిలిపివేయాలని, కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని (ఓపిఎస్) పునరుద్ధరించాలని కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ శాఖలు, పీఎస్‌యూల్లో ప్రస్తుతం ఉన్న ఖాళీలన్నింటినీ వెంటనే భర్తీ చేయాలని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానాన్ని నిలిపివేయాలని కోరారు. నిత్యావసర ఆహార పదార్థాలు, మందులపై జీఎస్టీతో సామాన్య ప్రజానీకానికి భారం కాకుండా కార్పొరేట్ పన్ను, సంపద పన్నును పెంచడంతోపాటు వారసత్వ పన్నును ప్రవేశపెట్టడం ద్వారా వనరుల సమీకరణ జరగాలని వారు పేర్కొన్నారు.

ముఖ్యంగా ప్రతి కుటుంబానికి 200 రోజుల పని హామీతో ఉపాది హామీ పరిధిని విస్తృతం చేయాలని కోరారు. అంతేకాకుండా వ్యవసాయం, అనుబంధ రంగ పనులను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి అనుసంధానం చేయాలని కోరారు. అలాగే 60 ఏళ్లు పైబడిన వారందరికీ ఆరోగ్య ప్రయోజనాలను అందించాలని డిమాండ్ చేసింది. ఇది నెలకు రూ. 100 టోకెన్ మొత్తంతో, సంవత్సరానికి రూ. 5 లక్షల కవరేజీతో కంట్రిబ్యూటరీగా చేయవచ్చు. ఈ నేపథ్యంలో ఆయా డిమాండ్ల ప్రభుత్వ స్పందన అనేది బడ్జెట్ ప్రకటన తేలుతుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి