LIC Policy: మీకు ఎల్‌ఐసీ పాలసీ ఉండి దానిని మధ్యలోనే వదిలిస్తే కంపెనీ మీకు సువర్ణవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ఎల్‌ఐసీ స్పెషల్ రివైవల్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. అంతేకాదు జరిమానాపై కూడా డిస్కౌంట్ ప్రకటించింది. ఆగస్టు 23 నుంచి ఈ క్యాంపెయిన్ నడుస్తోంది. అక్టోబర్ 22 వరకు కొనసాగుతుంది. ప్రీమియం చెల్లింపు కాలవ్యవధిలో ఉన్న పాలసీలు, పాలసీ వ్యవధిని పూర్తి చేయని పాలసీలను ఇందులో భాగంగా పునరుద్దరించుకోవచ్చని ఎల్‌ఐసీ తెలిపింది. వెంటనే దగ్గరలోని ఎల్‌ఐసీ ఆఫీస్‌ని సంప్రదించండి.
పునరుద్ధరణ ప్రీమియంపై రాయితీ ఎల్ఐసి విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. పునరుద్ధరణ ప్రీమియం మొత్తంపై రాయితీ ప్రకటించింది. ఐదు సంవత్సరాలుగా ఒక పాలసీని మూసివేస్తే దానిని ఈ క్యాంపెయిన్ ద్వారా పునరుద్ధరించవచ్చు. దీనికి సంబంధించి అనేక ఇతర నిబంధనలు, షరతులు ఉన్నాయి. మొత్తం పునరుద్ధరణ ప్రీమియం రూ.లక్ష వరకు ఉంటే రాయితీ 20 శాతం అంటే గరిష్టంగా రూ.2000 వరకు ఉంటుంది. 1-3 లక్షల వరకు ప్రీమియం మొత్తానికి రాయితీ 25% అంటే గరిష్ట డిస్కౌంట్ రూ. 2500. ప్రీమియం మొత్తం 3 లక్షల కంటే ఎక్కువ ఉంటే రాయితీ 30 శాతం అంటే మినహాయింపు గరిష్ట మొత్తం రూ.3000 వరకు ఉంటుంది.
ఆరోగ్య బీమా పాలసీ ఆరోగ్య రక్షక్ కూడా ప్రారంభం.. ఇది కాకుండా జీవిత బీమా LIC ఆరోగ్య రక్షక్ పాలసీని కూడా ప్రారంభించింది. ఇది ఆరోగ్య బీమా పథకం. ఇది రెగ్యులర్ ప్రీమియం నాన్-లింక్డ్ పాలసీ. ఈ పాలసీ కింద స్థిర ప్రయోజనం లభిస్తుంది. ఒక వ్యక్తి తన కోసం, జీవిత భాగస్వామి కోసం, పిల్లల కోసం ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు.