Crime News: ‘ఆదిలాబాద్ క్రైమ్ కథా చిత్రం’ ప్రేమ పేరిట వేధించాడని ఓ యువతి చేసిన పని.. చివరికి ఏమైందంటే.!

ప్రేమ పేరిట వేధించాడని ఓ యువకుడిని పక్కా ప్లాన్ ప్రకారం అత్యంత కిరాతకంగా హత్య చేసింది ఓ యువతి. కుటుంబ సభ్యుల సహకారంతో హత్య చేసి.. ఆ తరువాత

Crime News: 'ఆదిలాబాద్ క్రైమ్ కథా చిత్రం'  ప్రేమ పేరిట వేధించాడని ఓ యువతి చేసిన పని.. చివరికి ఏమైందంటే.!
Adilabad
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 18, 2021 | 9:51 PM

Adilabad: ప్రేమ పేరిట వేధించాడని ఓ యువకుడిని పక్కా ప్లాన్ ప్రకారం అత్యంత కిరాతకంగా హత్య చేసింది ఓ యువతి. కుటుంబ సభ్యుల సహకారంతో హత్య చేసి.. ఆ తరువాత పెట్రోల్‌ పోసి కాల్చేసి పొదల్లో పడేసింది. ఈ హత్య ఘటనను పోలీసులు వారం రోజుల్లోనే ఛేదించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు పీఎస్ పరిదిలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం మాకోడకు చెందిన బురత్కర్‌ చైతన్య (22) 2018లో పట్టణంలోని ప్రధాన మంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన పథకంలో శిక్షణ పొందుతున్న సమయంలో కృష్ణవేణి అనే యువతితో స్నేహం ఏర్పడింది. ఆ తరువాత ప్రేమించాలంటూ కృష్ణవేణి వెంటపడ్డాడు. ఇంతలోనే కృష్ణవేణికి రాంనగర్ కు చెందిన రాజశేఖర్ తో వివాహం జరిగింది. పెళ్లి అయినా తరువాత కూడా చైతన్య కృష్ణవేణిని ప్రేమ పేరుతో వేదింపులు కొనసాగించాడు. లైంగికంగా కలవాలంటూ టార్చర్ చేశాడు. సరే కలుస్తానంటూ ఈ నెల 9 న తన ఇంటికి రావాలంటూ చైతన్యను కోరింది‌.

అంతకు ముందే కుటుంబ సభ్యులు పథకం ప్రకారం సిద్దంగా ఉండటంతో.. చైతన్య రాంనగర్‌లోని నిందితురాలి ఇంటికి రాగానే అప్పటికే ఇంట్లో మాటు వేసి ఉన్న ఏడుగురు కుటుంబ సభ్యులు అతడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేశారు. ఈ విషయం బయటకి పొక్కకుండా.. పరుపులో చుట్టి ఎవరికి అనుమానం రాకుండా ఇల్లు ఖాళీ చేస్తున్నట్లు నటిస్తూ ఆటోలో వేసుకొని తలమడుగు మండలం తలమడుగు మండలం దేవాపూర్‌ శివారు ప్రాంతంలో పడేసారు. ఎవరైనా గుర్తిస్తారనే అనుమానంతో మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగుల బెట్టారు.

అదే రోజు బాధితుని కుటుంబ సభ్యులు తమ కుమారుడు కనిపించటం లేదని ఆదిలాబాద్‌ వన్ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అదృశ్యం కేసు నమోదైంది. దేవాపూర్‌ శివారు ప్రాంతంలో కాలిన శవం గుర్తించిన తలమడుగు ఎస్‌ఐ దివ్యభారతి ఈ నెల 14న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వన్ టౌన్ లో మిస్సింగ్‌ కేసు నమోదు కావటం, కాలిపోయిన యువకుని శవం దొరకటం జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ ప్రత్యేకంగా డీఎస్పీ ఎన్‌ఎస్‌వీ వెంకటేశ్వర్‌రావు నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.

కాలిన శవం చైతన్యదిగా గుర్తించిన పోలీసులు హత్యా కోణంలో విచారణ జరిపారు. ఫోన్‌ వివరాలు, సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా కూపీలాగి నిందితుల వివరాలను తెలుసుకున్నారు. హత్య చేసిన మావురపు రాజశేఖర్‌, మావరపు కృష్ణవేణి ( చైతన్య వేదింపులకు గురైన యువతి), మావురపు చంద్రశేఖర్‌, రొడ్డ సాయికిరణ్‌, మావురపు శైలజ, మరో ఇద్దరు మైనర్లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Read also: దేశ భద్రతకు ప్రమాదకరం.. విపత్తుగా మారబోతున్నాడు. సిద్ధూపై అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు