AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Renault Symboiz: మరో సూపర్ కారు రిలీజ్ చేసిన రెనాల్ట్.. ఫీచర్స్ విషయంలో ఈ కారుకు లేదేది సాటి..!

ప్రముఖ ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ రెనాల్ట్ తన తాజా ఎస్‌యూవీ రెనాల్ట్ సింబియోజ్ రిలీజ్ చేసింది. ముఖ్యంగా ఈ కారు ఇంటీరియర్ ప్రత్యేక నిలుస్తుంది. రెనాల్ట్ 16, ఈ-స్పేస్, సైనిక్ వంటి రెనాల్ట్ కార్ల లెజెండరీ వారసత్వాన్ని సింబియోజ్ ద్వారా కంపెనీ నిలబెట్టింది. ఈ కారు రెనాల్ట్ కంపెనీకు సంబంధించిన సీఎంఎఫ్-బి ప్లాట్‌ఫారమ్ పై ఆధారపడి పని చేస్తుంది. అలాగే ఈ కారు పొడవు 4.41 మీటర్లుగా ఉంటుంది. ఈ కొత్త సింబియోజ్ ఎస్‌యూవీ పోర్ట్ఫోలియోలో క్యాప్చర్, ఆస్ట్రల్ మధ్య ఉంటుందని కంపెనీ పేర్కొంది.

Renault Symboiz: మరో సూపర్ కారు రిలీజ్ చేసిన రెనాల్ట్.. ఫీచర్స్ విషయంలో ఈ కారుకు లేదేది సాటి..!
Renault Symbioz
Nikhil
|

Updated on: May 08, 2024 | 8:30 AM

Share

ప్రముఖ ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ రెనాల్ట్ తన తాజా ఎస్‌యూవీ రెనాల్ట్ సింబియోజ్ రిలీజ్ చేసింది. ముఖ్యంగా ఈ కారు ఇంటీరియర్ ప్రత్యేక నిలుస్తుంది. రెనాల్ట్ 16, ఈ-స్పేస్, సైనిక్ వంటి రెనాల్ట్ కార్ల లెజెండరీ వారసత్వాన్ని సింబియోజ్ ద్వారా కంపెనీ నిలబెట్టింది. ఈ కారు రెనాల్ట్ కంపెనీకు సంబంధించిన సీఎంఎఫ్-బి ప్లాట్‌ఫారమ్ పై ఆధారపడి పని చేస్తుంది. అలాగే ఈ కారు పొడవు 4.41 మీటర్లుగా ఉంటుంది. ఈ కొత్త సింబియోజ్ ఎస్‌యూవీ పోర్ట్ఫోలియోలో క్యాప్చర్, ఆస్ట్రల్ మధ్య ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ నేపథ్యంలో రెనాల్ట్ సింబియోజ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

రెనాల్ట్ సింబియోజ్‌ థండర్ బోల్ట్ డిజైన్‌తో ప్రత్యేక బానెట్ లైన్లు, ఎల్ఈడీ హెడ్‌లైట్లు, 19 అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్‌తో ప్రత్యేకంగా ఉంటుంది. వెనుక భాగంలో త్రిభుజాకార టెయిల్ ల్యాంప్లు, వెనుక స్పాయిలర్, వెనుక వైపర్, ఎలక్ట్రానిక్‌గా పనిచేసే స్కల్ఫ్రెడ్ టెయిల్ గేట్, రియర్ స్కిడ్ ప్లేట్లతో సరికొత్త డిజైన్‌తో ఆకట్టుకునేలా ఈ కారు ఉంటుంది. ముఖ్యంగా ఈ కారు 169 ఎంఎం భారీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. రెనాల్ట్ సింబోయోజ్‌‌ను ఏడు రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. మెర్క్యురీ బ్లూ, ఫ్లేమ్ రెడ్, పెరల్ వైట్, స్టార్రీ బ్లాక్, రాఫెల్ గ్రే, ఐరన్ బ్లూ, కాసియోపీ గ్రే కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా ఈ కారు ఇంటీరియర్ విషయానికి వస్తే 16 సెంటీ మీటర్ల స్లైడింగ్ రెండవ వరుస సీట్లు, సరికొత్త ఎలక్ట్రానిక్ సన్రూఫ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 10.4 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.3 అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 4-స్పీకర్లతో కూడిన హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, 4  ట్వీటర్లు, సబ్ వూఫర్, ఇంటీరియర్ మూడ్ లైటింగ్‌తో వినియోగదారులను అమితంగా ఆకర్షిస్తుంది. 

రెనాల్ట్ సింబియోజ్ కంపెనీకు సంబంధించిన ఈ-టెక్ హైబ్రిడ్ పవర్ ట్రెయిన్‌తో వస్తుంది. ముఖ్యంగా 1.6 ఎల్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్, రెండు ఎలక్ట్రిక్ మోటార్లు 143 బీహెచ్‌పీకు సంబంధించిన మిళిత పవర్ అవుట్‌పుటల్‌ను అందించడానికి పని చేస్తాయి. ఇది ఐసీఈ కోసం 4 గేర్లు, ఎలక్ట్రిక్ మోటార్ల కోసం రెండు గేర్లతో కూడిన మల్టీ-మోడ్ క్లబ్లెస్ డాగ్ బాక్స్‌తో వస్తుంది. అలాగే  భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్లు, లెవెల్ 2 ఏడీఏఎస్‌తో ఆకర్షిస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us