AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CIBIL Score: ఆర్థిక లోపాలకూ ట్రీట్‌మెంట్‌ ఉంది.. మీ క్రెడిట్ స్కోర్ అమాంతం పెంచే ఏకైక మార్గం..

మీరు గతంలో తీసుకున్న రుణాలను, ఇతర ఆర్థిక సంబంధ వ్యవహారాలను చక్కగా చెల్లిస్తే మీ సిబిల్‌ స్కోర్‌ బాగుంటుంది. లేకపోతే తక్కువగా ఉంటుంది. స్కోర్‌ తక్కువగా ఉంటే మీకు రుణాలు మంజూరు కావు. కాబట్టి దానిని పెంచుకునేందుకు ప్రయత్నించాలి. కొందరికి ఆర్థిక చెల్లింపుల విషయాలపై సరైన అవగాహన ఉండదు. సిబిల్‌ స్కోర్‌ను పెంచుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. అలాంటి వారికి క్రెడిట్‌ కౌన్సెలింగ్‌ చాలా ఉపయోగంగా ఉంటుంది.

CIBIL Score: ఆర్థిక లోపాలకూ ట్రీట్‌మెంట్‌ ఉంది.. మీ క్రెడిట్ స్కోర్ అమాంతం పెంచే ఏకైక మార్గం..
Credit Score
Madhu
| Edited By: Janardhan Veluru|

Updated on: May 08, 2024 | 5:09 PM

Share

వ్యాపారంలో రాణించడానికి, స్థిరాస్తిని కొనుగోలు చేయడానికి మనం సాధారణంగా రుణాలపై ఆధారపడతాం. ఆ రుణాలను పెట్టుబడిగా మార్చి జీవితంలో ముందుకు సాగుతాం. ముఖ్యంగా వివిధ బ్యాంకులను సం‍ప్రదించి, వాటి వడ్డీరేట్లను పరిశీలించి రుణాలు తీసుకుంటాం. ఆయా బ్యాంకులు ముందుగా మీ అర్హతలను పరిశీలిస్తాయి. మీ దగ్గర ఉన్న అన్ని పత్రాలతో పాటు మరో అంశం మీకు రుణాలు మంజూరు చేయడానికి సహాయ పడుతుంది. దానిని సిబిల్‌ స్కోర్‌ అంటారు. ఇది మీ ఆర్థిక క్రమశిక్షణను సూచిస్తుంది. మీరు రుణాన్ని తిరిగి సక్రమంగా చెల్లించగలిగే స్థాయిని తెలియజేస్తుంది.

క్రెడిట్‌ కౌన్సెలింగ్‌ అంటే..

మీరు గతంలో తీసుకున్న రుణాలను, ఇతర ఆర్థిక సంబంధ వ్యవహారాలను చక్కగా చెల్లిస్తే మీ సిబిల్‌ స్కోర్‌ బాగుంటుంది. లేకపోతే తక్కువగా ఉంటుంది. స్కోర్‌ తక్కువగా ఉంటే మీకు రుణాలు మంజూరు కావు. కాబట్టి దానిని పెంచుకునేందుకు ప్రయత్నించాలి. కొందరికి ఆర్థిక చెల్లింపుల విషయాలపై సరైన అవగాహన ఉండదు. సిబిల్‌ స్కోర్‌ను పెంచుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. అలాంటి వారికి క్రెడిట్‌ కౌన్సెలింగ్‌ చాలా ఉపయోగంగా ఉంటుంది. ఉదాహరణకు మీరు అనారోగ్యానికి గురైనప్పుడు డాక్టర్‌ దగ్గరకు వెళ్లినట్టే.. సిబిల్‌ స్కోర్‌ బాగా లేనప్పుడు క్రెడిట్ కౌన్సెలర్‌ దగ్గరకు వెళ్లాలి.

చాలా ఉపయోగం..

క్రెడిట్ కౌన్సెలింగ్ అనేక సెషన్లలో ఉంటుంది. దీనిద్వారా మీరు ఆర్థిక నిర్వహణ, బడ్జెట్‌ను రూపొందించడం, రుణాన్ని తిరిగి చెల్లించడం తదితర వాటికి సంబంధించి సలహాలు పొందుతారు. వాటిని ఆచరణలో పెడితే మీరు ఆర్థిక క్రమశిక్షణ ఏర్పడి, మీ క్రెడిట్ స్కోర్‌ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఆర్థిక అక్షరాస్యతను మెరుగుపరచుకోవడానికి ఆసక్తి ఉన్న రుణగ్రహీతలకు క్రెడిట్ కౌన్సెలింగ్ చాలా ఉపయోగపడుతుంది. అందుకు ఉత్తమమైన క్రెడిట్ కౌన్సెలింగ్ ఏజెన్సీని ఎంచుకోవడంతో పాటు వారు ఇచ్చే సలహాలు, సూచనలు జాగ్రత్తగా పాటించడం చాలా ముఖ్యం.

రుణ నిర్వహణ ప్రణాళికలు..

క్రెడిట్ కౌన్సెలింగ్ ఏజెన్సీ మిమ్మల్ని డెట్ మేనేజ్‌మెంట్ ప్లాన్ (డీఎంపీ)లో నమోదు కావాలని కోరే అవకాశం ఉంటుంది. దాని ప్రకారం మీరు క్రెడిట్ కౌన్సెలింగ్ ఏజెన్సీకి నెలవారీ చెల్లింపులు చేస్తారు. అంగీకరించిన ప్లాన్ ప్రకారం ఏజెన్సీ మీ రుణదాతలకు నిధులను పంపిణీ చేస్తుంది. డీఎంపీలో నమోదవ్వడం వల్ల మీ క్రెడిట్ స్కోర్‌పై కొద్దిగా ప్రతికూల ప్రభావం చూపవచ్చు. కానీ డీఎంపీ ద్వారా స్థిరమైన చెల్లింపులు జరిగితే మీ క్రెడిట్ స్కోర్ క్రమంగా మెరుగుపడుతుంది.

ఆర్థిక క్రమశిక్షణ..

క్రెడిట్ కౌన్సెలింగ్ వివిధ సెషన్లలో ఉంటుంది. మీకు ఆర్థిక నిర్వహణ, బడ్జెట్‌ రూపొందించడం, రుణాన్ని తిరిగి చెల్లించడం తదితర వాటిపై సూచనలు అందిస్తారు. మీరు బడ్జెట్‌ ఎలా ప్లాన్‌ చేసుకోవాలో, సకాలంలో చెల్లింపులను ఎలా చేయాలో నేర్చుకుంటే, అది మీ క్రెడిట్ యోగ్యతను మంచిగా ప్రభావితం చేస్తుంది

క్రెడిట్ విచారణలు..

మీరు క్రెడిట్ కౌన్సెలింగ్‌కు వెళ్లినప్పుడు ఏజెన్సీ మీ క్రెడిట్ నివేదికను సమీక్షించవచ్చు. దీనినే సాఫ్ట్ ఎంక్వైరీ అని కూడా పిలుస్తారు. సాధారణంగా మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేయదు. అయితే మీరు రుణ నిర్వహణ ప్రణాళిక, క్రెడిట్ కౌన్సెలర్ సిఫార్సు చేసిన ఇతర ఆర్థిక ఉత్పత్తుల కోసం దరఖాస్తు చేస్తే కొంచెం హార్డ్‌ ఎంక్వైరీలకు దారితీయవచ్చు. అ‍ప్పుడు మీ క్రెడిట్ స్కోర్‌పై స్వల్ప, తాత్కాలిక ప్రభావం పడుతుంది.

ప్రతికూల అంశాల పరిష్కారం..

మీ క్రెడిట్ రిపోర్ట్‌లో ఆలస్యమైన చెల్లింపులు, సేకరణ ఖాతాల వంటి ప్రతికూల అంశాలను పరిష్కరించడంలో కౌన్సెలింగ్‌ మీకు సహాయపడుతుంది. ప్రతికూల సమాచారాన్ని తీసివేయడానికి, రుణదాతలతో వివాదాస్పద లోపాలు, చర్చలు చేయడానికి దారి చూపుతుంది. ఈ సమస్యలను పరిష్కరించడం ద్వారా మీరు మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..