Bajaj CNG Bike: ప్రపంచంలోనే ఫస్ట్ సీఎన్‌జీ బైక్.. లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్..

ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ మోటారు సైకిల్‌ త్వరలో విడుదల కాబోతోంది. బజాజ్‌ ఆటో సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ బైక్‌ను జూన్‌ 18న మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. దీని ద్వారా ప్రజలకు మరింత తక్కువ ఖర్చుతో ప్రయాణాన్ని అందిస్తామని ఆ సంస్థ చెబుతుంది. ఇటీవల పల్సర్ ఎన్ఎస్ 400 జెడ్ విడుదలైన సందర్భంలో బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

Bajaj CNG Bike: ప్రపంచంలోనే ఫస్ట్ సీఎన్‌జీ బైక్.. లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్..
Bajaj Cng Bike(Symbolic Photo)
Follow us

|

Updated on: May 07, 2024 | 5:45 PM

ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ మోటారు సైకిల్‌ త్వరలో విడుదల కాబోతోంది. బజాజ్‌ ఆటో సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ బైక్‌ను జూన్‌ 18న మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. దీని ద్వారా ప్రజలకు మరింత తక్కువ ఖర్చుతో ప్రయాణాన్ని అందిస్తామని ఆ సంస్థ చెబుతుంది. ఇటీవల పల్సర్ ఎన్ఎస్ 400 జెడ్ విడుదలైన సందర్భంలో బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ప్రపంచంలో విడుదల కానున్న మొట్టమొదటి సీఎన్ జీ మోటారు సైకిల్ ఇదే కావడం గర్వకారణం. ప్రజలకు మరింత తక్కువ ఖర్చుతో ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో దీనిని రూపొందించారు.

ప్రత్యేకతలు ఇవే..

కొత్త బజాజ్ సీఎన్ జీ మోటారుసైకిల్ లో అనేక ప్రత్యేకతలు ఉన్నట్టు తెలుస్తుంది. దీనిలో పెట్రోలు, సీఎన్జీ రెండింటితో పనిచేసే సాంకేతిక ఉంటుందని భావిస్తున్నారు. మైలేజ్ ను కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని సీఎన్ జీ బైక్ విడుదల కానుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌, వెనుకవైపు మోనోషాక్‌తో పాటు డిస్క్, డ్రమ్ బ్రేక్ సెటప్‌లు ఉన్నాయి. సింగిల్ ఛానల్ ఏబీఎస్, కాంబి బ్రేకింగ్‌లు భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. అలాగే 100 నుంచి 125 సీసీ మధ్య ఇంజిన్ సామర్థ్యంతో వచ్చే అవకాశం ఉంది.

ఇంకా పేరు పెట్టలేదు..

కొత్త సీఎన్ జీ బైక్ కు అధికారికంగా ఇంకా పేరు పెట్టలేదు. ఆ విషయంపై ఎటువంటి సమాచారం లేదు. అయితే బజాజ్ ఇటీవలే బ్రూజర్ పేరును ట్రేడ్‌మార్క్ చేసింది. ఇదే కొత్త మోటార్‌సైకిల్‌కు అధికారిక పేరు కావచ్చని భావిస్తున్నారు. ఈ బజాజ్ బైక్ భవిష్యత్తులో మరిన్ని సీఎన్ జీ మోడళ్లకు ఆవిష్కరణకు దారి తీస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

సీఎన్ జీ అంటే..

కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్ జీ) అనేది పర్యావరణ అనుకూలంగా ఇంధన వనరు. దీనిని వాహనాలలో బాగా వినియోగిస్తారు. దీని లభ్యత ఎక్కువగా ఉన్న దేశాలలో వినియోగం బాాగానే ఉంది. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించి, పర్యావరణ రక్షణకు సీఎన్ జీ వాడకం ఉపయోగపడుతుంది. పెట్రోలు, డీజిల్ లతో పోల్చితే సీఎన్ జీ చౌకగా ఉంటుంది. ఫలితం వాహనాల నిర్వహణ ఖర్చులు బాగా తగ్గుతాయి. మన దేశంలో ఇప్పటి వరకూ సీఎన్ జీతో నడిచే కార్లు, ఆటోలు, భారీ వాహనాలు మాత్రమే ఉన్నాయి. ద్విచక్ర వాహనాల విభాగంలో బజాజ్ సంస్థ త్వరలో విడుదల చేయనుంది.

పల్సన్ ఎన్ఎస్ 400 జెడ్ విడుదల..

బజాజ్ సంస్థ ఇటీవలే పల్సన్ ఎన్ఎస్ 400 జెడ్ పేరుతో దేశ మార్కెట్లో తన ఫ్లాగ్‌షిప్ పల్సర్‌ను విడుదల చేసింది. ఈ బండి రూ. 1.85 లక్షలకు (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంది. అలాగే ఆన్ లైన్ లో టోకెన్ బుక్కింగ్ లు ప్రారంభమయ్యాయి. రూ.5 వేలు చెల్లించి ఈ వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు. జూన్ నెల నుంచి డెలివరీలు మొదలవుతాయి.

ప్రత్యేకతలు..

పల్సర్ ఎన్ ఎస్ 400 జెడ్ బైక్ లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. పవర్ డొమినార్ 400లో ఏర్పాటు చేసిన లిక్విడ్ కూల్డ్ 373 సీసీ ఇంజిన్ తో కొత్త పల్సర్ వస్తుంది. ఇది 8800 ఆర్ పీఎం వద్ద గరిష్టంగా 39 బీహెచ్ పీ శక్తిని, 6500 ఆర్ పీఎం వద్ద 35 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. గేర్‌బాక్స్ స్లిప్, అసిస్ట్ క్లచ్‌తో కూడిన 6 స్పీడ్ యూనిట్ గా రూపొందించారు. రైడ్ బై వైర్, రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
వచ్చేవారం మార్కెట్లో విడుదల కానున్న మూడు స్మార్ట్‌ ఫోన్లు..
వచ్చేవారం మార్కెట్లో విడుదల కానున్న మూడు స్మార్ట్‌ ఫోన్లు..
చర్మాన్ని నవయవ్వనంగా ఉంచే ఆహారాలు ఇవే..
చర్మాన్ని నవయవ్వనంగా ఉంచే ఆహారాలు ఇవే..
ఓ మై గాడ్.! ఇలా ఉన్నావేంట్రా.. అది నూడిల్స్ కాదురా నాగుపాము..!
ఓ మై గాడ్.! ఇలా ఉన్నావేంట్రా.. అది నూడిల్స్ కాదురా నాగుపాము..!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
వాడేసిన టీ బ్యాగ్‌లు పారేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా..
వాడేసిన టీ బ్యాగ్‌లు పారేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా..
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌‌గా టీమిండియా ఫ్యూచర్ కీపర్
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌‌గా టీమిండియా ఫ్యూచర్ కీపర్
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.?
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.?
నానబెట్టిన ఎండు ద్రాక్ష నీటిని ఇలా తాగితే సగం రోగాలు పరార్!
నానబెట్టిన ఎండు ద్రాక్ష నీటిని ఇలా తాగితే సగం రోగాలు పరార్!
'అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయండి'.. జైల్ భరోకి కేజ్రీవాల్ పిలుపు..
'అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయండి'.. జైల్ భరోకి కేజ్రీవాల్ పిలుపు..
తొలి 7 మ్యాచ్‌ల్లో ఒకే విజయం.. 15 రోజుల్లో మారిన ఆర్‌సీబీ
తొలి 7 మ్యాచ్‌ల్లో ఒకే విజయం.. 15 రోజుల్లో మారిన ఆర్‌సీబీ