Reliance Jio: జియో యూజర్లకు మరో షాక్.. ఆ ప్లాన్ ధరలను కూడా పెంచేసింది..!
Reliance Jio: ప్రస్తుతం టెలికాం రంగంలో అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థలు టారిఫ్ ధరలను పెంచేశాయి..
Reliance Jio: ప్రస్తుతం టెలికాం రంగంలో అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థలు టారిఫ్ ధరలను పెంచేశాయి. ఇప్పటికే పెరిగిన రెట్లు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా జియో యూజర్లకు మరో షాక్ తగిలింది. ఇక సాధారణ ప్లాన్స్‌తో పాటు ఓటీటీ సర్వీస్ ధరలను సైతం జియో పెంచేసింది. డిస్నీ+హాట్‌స్టార్ ప్లాన్స్ ధరలను పెంచింది. ఓటీటీ ప్రేక్షుకల కోసం పలు టెలికాం కంపెనీలు ఓటీటీ రీచార్జ్ ప్లాన్స్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. గత వారం టారిఫ్ ధరలను 20 శాతం మేర పెంచిన జియో.. ఇప్పుడు డిస్నీ+హాట్‌స్టార్ మొబైల్ సర్వీస్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ధరలను పెంచింది.
అయితే రియలన్స్ జియో ఐదు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్‌పై డీస్సీ+హాట్‌స్టార్ సర్వీసులను అందిస్తోంది. ఇందులో ఏడాది పాటు డీస్నీ+హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు సాధారణ అన్‌లిమిటెడ్ డేటా పొందవచ్చు. తాజాగా రూ.499 ప్లాన్ ధర రూ.601కు పెంచేసింది జియో. అలాగే రూ.666 ప్లాన్ ధర రూ.799కు చేరింది. రూ.888 ప్లాన్ ధరను రూ.1066గా ఉండగా, రూ.2599 ధర రూ.3119కి చేరింది. అలాగే రూ.549 ప్లాన్ ధర రూ.659కి చేరింది.
ఇవి కూడా చదవండి: