ATM Charge: ఈ బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బులు తీస్తున్నారా..? వచ్చే నెల నుంచి బాదుడే.. బాదుడు..!
ATM Charge: బ్యాంకింగ్ రంగంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. ఆర్బీఐ నిబంధనలు కఠినతరం చేస్తోంది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు మార్గదర్శకాలను..
ATM Charge: బ్యాంకింగ్ రంగంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. ఆర్బీఐ నిబంధనలు కఠినతరం చేస్తోంది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు మార్గదర్శకాలను విడుదల చేస్తోంది. ఈ మధ్య కాలంలో బ్యాంకులు ఎన్నో మార్పులు చేస్తుండగా, తాజాగా ఐసీఐసీఐ బ్యాంకు తన కస్టమర్లకు షాకిచ్చింది. సర్వీస్ చార్జీలను సవరిస్తున్నట్లు తెలిపింది. ఈ బ్యాంకు తీసుకున్న నిర్ణయంతో వినియగదారులకు ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వస్తాయని బ్యాంకు ప్రకటించింది.
ఏటీఎం లావాదేవీలపై చార్జీల సవరణ:
ఏటీఎం లావాదేవీలపై చార్జీలను సవరించింది. నెలలో బ్యాంకు ఏటీఎం నుంచి ఐదు సార్లు క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్‌కు రూ.21 చార్జీ విధించనుంది. నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు ఉచితం. అలాగే ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మెట్రో నగరాల్లో అయితే నెలకు మూడు సార్లు, ఇతర పట్టణాల్లో ఐదు సార్లు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఇక నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు కూడా ఇందులో భాగమై ఉంటాయి. లిమిట్ దాటినట్లయితే చార్జ్ పడుతుంది. ప్రతి ట్రాన్సాక్షన్‌కు రూ.21 చార్జ్ పడుతుంది. ఇక నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లిమిట్ దాటితే ప్రతి లావాదేవీకి రూ.8.5 చార్జ్ చెల్లించుకోవాలి. యాక్సిస్ బ్యాంకు కూడా లిమిట్ దాటినట్లయితే రూ.21 చార్జ్ విధించనుంది. ఇలా జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ చార్జీలు వినియోగదారులకు మరింత భారం పడనుంది.
ఇవి కూడా చదవండి: