Jio Independence Day 2023 Offer: రిలయన్స్ జియో నుంచి ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కళ్లు చెదిరే ప్రయోజనాలు..
భారతదేశపు అతిపెద్ద టెలికాం ఆపరేటింగ్ కంపెనీ రిలయన్స్ జియో తన కస్టమర్లకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బంపర్ ఆఫర్స్ ప్రకటించింది. ఇండిపెండెన్స్ డే 2023 ఆఫర్‌ను జియో ప్రకటించింది. 5G కస్టమర్ల కోసం జియో రూ. 2,999 రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ వార్షిక ప్లాన్‌లో ఫ్రీ డేటా, ఫ్రీ కాల్స్ సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాకుండా, ఈ ప్లాన్ ద్వారా ఫుడ్ డెలివరీ, ప్రయాణం, ఆన్‌లైన్ షాపింగ్ మొదలైన వాటిరిపై డిస్కౌంట్స్ పొండే అవకాశాన్ని కూడా కల్పించింది జియో..
భారతదేశపు అతిపెద్ద టెలికాం ఆపరేటింగ్ కంపెనీ రిలయన్స్ జియో తన కస్టమర్లకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బంపర్ ఆఫర్స్ ప్రకటించింది. ఇండిపెండెన్స్ డే 2023 ఆఫర్‌ను జియో ప్రకటించింది. 5G కస్టమర్ల కోసం జియో రూ. 2,999 రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ వార్షిక ప్లాన్‌లో ఫ్రీ డేటా, ఫ్రీ కాల్స్ సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాకుండా, ఈ ప్లాన్ ద్వారా ఫుడ్ డెలివరీ, ప్రయాణం, ఆన్‌లైన్ షాపింగ్ మొదలైన వాటిరిపై డిస్కౌంట్స్ పొండే అవకాశాన్ని కూడా కల్పించింది జియో.
రిలియన్స్ జియో స్వాతంత్ర్య దినోత్సవం 2023 ఆఫర్స్..
ఇది ప్రీపెయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్న ప్లాన్. 5G వినియోగదారులు రూ. 2,999 రీచార్జ్ చేసుకోవడం ద్వారా ఏడాదంతా ఉచిత కాల్స్, ఫ్రీ డేటా, రోజూ 100 ఎస్ఎంఎస్‌లు పొందే అవకాశం ఉంటుంది. రోజుకు 2.5 జీబీ డేలా లభించనుంది. అలాగే, జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ సేవలను ఉచితంగా పొందవచ్చు.
జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్‌పై డిస్కౌంట్లు..
ప్రముఖ ఫుడ్ డెలివరీ పార్ట్‌నర్ స్విగ్గీ ప్లాట్‌ఫారమ్‌లో, రూ. 249 కంటే ఎక్కువ విలువైన ఆర్డర్‌లపై సుమారు రూ.100 తగ్గింపు లభిస్తుంది. అలాగే యాత్ర ప్లాట్‌ఫారమ్‌లో ఫ్లైట్ బుక్ చేసుకుంటే దాదాపు రూ.1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ యాత్ర యాప్ ద్వారా భారతదేశంలోని ఏదైనా హోటల్‌ను బుక్ చేసుకుంటే మీకు 15% లేదా రూ. 4,000 వరకు తగ్గింపు లభిస్తుంది.
అలాగే, Ajio లో రూ. 999 పైన కొనుగోలు చేసిన డ్రెస్సులపై రూ. 200 వరకు తగ్గింపు. అయితే, ఈ ఆఫర్ ఎంపిక చేసిన ఉత్పత్తులపై మాత్రమే వర్తిస్తుంది. నెట్‌మెడ్స్‌లో అదనపు NMS సూపర్‌క్యాష్ కూడా అందుబాటులో ఉంది. అలాగే, రిలయన్స్ డిజిటల్ కొన్ని ఆడియో ఉత్పత్తులు, గృహోపకరణాలపై 10% తగ్గింపును అందిస్తుంది.
ఆగస్టు 28న కొత్త జియో 5జీ ప్లాన్స్..
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ ఏడాది ఆగస్టు 28న రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనుంది. కొత్త Jio 5G ప్లాన్‌లను అప్పటి RIL AGMలో ప్రకటించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం 4జీ ప్లాన్‌లలో 5జీ సేవలు అందిస్తోంది. ఆగస్టు 28 నుంచి 5జీకి ప్రత్యేక ప్లాన్‌లు అందుబాటులోకి రానున్నాయి.
జియో 5జీ స్మార్ట్‌ఫోన్..
రిలయన్స్ జియో నుంచి మొదటి 5G స్మార్ట్‌ఫోన్ ఆగస్ట్ 28 న విడుదల చేసే అవకాశం ఉంది. దీని ధర రూ.10-12 వేలు ఉండవచ్చని అంచనా. ఆండ్రాయిడ్ 12 సాఫ్ట్‌వేర్‌తో కూడిన ఈ మొబైల్ Qualcomm Snapdragon 480+ చిప్‌సెట్, 4GB RAM ద్వారా అందించబడుతుంది. దీని బ్యాటరీ బ్యాకప్ 5,000 mAh. అలాగే, రిలయన్స్ కూడా AGMలో ఎయిర్ ఫైబర్ 5Gని ప్రారంభించాలని భావిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..