AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway Rules: మీరు రైలులో ప్రయాణిస్తున్నట్లయితే ఈ విషయాలను గుర్తుంచుకోండి.. మరిచిపోతే అంతే..

సామాన్యుడి జీవన చక్రం.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రయాణ వ్యవస్థ… ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులను ఒక చోటి నుంచి మరో చోటికి చేరవేస్తోంది. ప్రతిరోజూ అనేక మందిని భారతీయ రైల్వే వారి గమ్యస్థానానికి చేరవేస్తుంది.  భారతీయ రైల్వే సేవలను సద్వినియోగం చేసుకుంటారు. ఇలాంటి ప్రయాణికులు మొత్తం ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రైల్వేశాఖ కొన్ని ప్రత్యేక నిబంధనలను రూపొందించింది. వాటిలో కూడా చాలా మార్పులు చేస్తూ.. మెరుగైన సేవలను అందిస్తోంది. మీరు తరచుగా రైలులో […]

Railway Rules: మీరు రైలులో ప్రయాణిస్తున్నట్లయితే ఈ విషయాలను గుర్తుంచుకోండి.. మరిచిపోతే అంతే..
Indian Railways
Sanjay Kasula
|

Updated on: Aug 13, 2023 | 2:52 PM

Share

సామాన్యుడి జీవన చక్రం.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రయాణ వ్యవస్థ… ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులను ఒక చోటి నుంచి మరో చోటికి చేరవేస్తోంది. ప్రతిరోజూ అనేక మందిని భారతీయ రైల్వే వారి గమ్యస్థానానికి చేరవేస్తుంది.  భారతీయ రైల్వే సేవలను సద్వినియోగం చేసుకుంటారు. ఇలాంటి ప్రయాణికులు మొత్తం ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రైల్వేశాఖ కొన్ని ప్రత్యేక నిబంధనలను రూపొందించింది. వాటిలో కూడా చాలా మార్పులు చేస్తూ.. మెరుగైన సేవలను అందిస్తోంది. మీరు తరచుగా రైలులో ప్రయాణిస్తున్నట్లయితే, మీరు తప్పనిసరిగా దాని గురించి తెలుసుకోవాలి. దీంతో మీకు తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ రైల్వే నిబంధనల గురించి తెలుసుకుందాం-

ప్రయాణికులందరి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ రాత్రిపూట నిద్రించడానికి కొన్ని నిబంధనలను రూపొందించింది. ఏ ప్రయాణీకుడైనా తన బెర్త్‌లో రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మాత్రమే పడుకోవచ్చు. ఉదయం 6 గంటల తర్వాత, మిగిలిన సహ ప్రయాణీకులు లోయర్ బెర్త్‌లోని ప్రయాణికుడిని సీటు నుండి లేవమని అడగవచ్చు. దీనితో పాటు రాత్రిపూట బిగ్గరగా మాట్లాడటం, పాటలు వినడం కూడా నిషేధించబడింది. అలా చేసినందుకు మీకు జరిమానా విధించవచ్చు. ఇలా చేయడం తోటి ప్రయాణికుడికి ఇబ్బందిగా ఉంటుందని మీరు తప్పకా గుర్తుంచుకోవలి.

ఈ సమయంలో TTE టిక్కెట్‌ను చెక్ చేయరు

రైల్వే నిబంధనల ప్రకారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఏ ప్రయాణీకుల టిక్కెట్టును టీటీఈ తనిఖీ చేయకూడదు. ప్రయాణికుల సుఖవంతమైన ప్రయాణం కోసం.. ప్రజల నిద్రను పాడుచేయకుండా ఉండేందుకు రైల్వేశాఖ ఈ నిబంధనను రూపొందించింది. టీటీఈ మీకు అస్సలు అసౌకర్యాన్ని కలిగించరని గుర్తు పెట్టుకోండి.

ప్రయాణికుడు ఎన్ని కిలోలను వెంట..

భారతీయ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం, మీరు AC ఫస్ట్ క్లాస్‌లో 70 కిలోల వరకు లగేజీతో ప్రయాణించవచ్చు. అదే సమయంలో, ప్రయాణికులు ఏసీ 2 టైర్‌లో 50 కేజీలు, ఏసీ-3 టైర్‌లో 40 కేజీలు, స్లీపర్‌లో 40 కేజీలు, సెకండ్ క్లాస్‌లో 35 కేజీల వరకు లగేజీతో ప్రయాణించవచ్చు.

ప్లాట్‌ఫారమ్ టికెట్ ద్వారా కూడా ప్రయాణించవచ్చు

రైల్వే నిబంధనల ప్రకారం టికెట్ కొనుక్కోవడానికి సమయం లేకుంటే ప్లాట్ ఫాం టికెట్ తీసుకుని మాత్రమే రైలు ఎక్కవచ్చు. దీని తర్వాత, మీరు వెంటనే TTEని సంప్రదించాలి. గమ్యస్థాన స్టేషన్ వరకు టికెట్ పొందాలి. TTE మీ టిక్కెట్‌ను తక్షణమే తయారు చేస్తారు. మీరు సులభంగా ప్రయాణించగలరు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి