AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Ideas: గోధుమ రవ్వ, చింతపండుతో ప్లేట్లు, గ్లాసులు.. రూ. లక్షల్లో టర్నోవర్.. సక్సెస్‌ఫుల్ బిజినెస్ మంత్రా ఇది..

అతను చదువులో ఫెయిల్యూర్.. కానీ బిజినెస్ లో సక్సెస్ ఫుల్. పైగా పర్యావరణ హితమైన ఉత్పత్తులే అతనికి ఆదాయ వనరు. రోజూ వారీ ఇంట్లో వచ్చే వర్థాలతోనే ఎకో ఫ్రెండ్లీ ప్లేట్లు, గ్లాసులు, టీ కప్పులు, స్పూన్లు తయారు చేస్తూ రూ. లక్షలు గడిస్తున్నారు. పైగా వీటిని మనం వినియోగించుకున్న తర్వాత పశువులకు మేతకు కూడా వాడవచ్చని ఆ యువకుడు వివరిస్తున్నాడు. ఎవరా యువకుడు? ఏంటా బిజినెస్? తెలుసుకుందాం రండి..

Business Ideas: గోధుమ రవ్వ, చింతపండుతో ప్లేట్లు, గ్లాసులు.. రూ. లక్షల్లో టర్నోవర్.. సక్సెస్‌ఫుల్ బిజినెస్ మంత్రా ఇది..
No Waste Biodegradable Plates And Cups
Madhu
|

Updated on: Aug 13, 2023 | 6:00 PM

Share

ప్రపంచాన్ని వేధిస్తున్న అతి పెద్ద సమస్య, సవాలు పర్యావరణ కాలుష్యం. ముఖ్యంగా ప్లాస్టిక్ భూతం పట్టి పీడిస్తుండటంతో మనుషులతో పాటు సర్వజీవరాశులు ప్రమాదంలో పడ్డాయి. దీంతో ప్లాస్టిక్ ను వీలైనంత వరకూ తగ్గించాలని ప్రపంచంలోని అన్ని దేశాలు తగిన కార్యాచరణతో ముందుకెళ్తున్నాయి. మన దేశంలో కూడా ప్లాస్టిక్ వినియోగం చాలా ఎక్కువ. అయితే ఈ సవాలును అధిగమించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల స్థానంలో పేపర్ గ్లాసులను వినియోగించేలా ప్రోత్సహిస్తున్నారు. అలాగే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు అందుకు పర్యావరణ హితమైన వస్తువును వినియోగించేందుకు జనాలకు కూడా మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులను దేశ వ్యాప్తంగా డిమాండ్ ఏర్పడుతోంది. ఔత్సాహిక యువత కూడా ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తుల తయారీ రంగంలో రాణించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సరిగ్గా దీనిని అర్థం చేసుకున్న ఓ యువకుడు ఎకో ఫ్రెండ్లీ బిజినెస్ ను ప్రారంభించి, విజయవంతం అయ్యాడు. ఆ యువకుడు ఎవరు? అతను చేసిన బిజినెస్ ఏమిటి? పెట్టుబడి ఎంత? లాభాలు ఎలా వచ్చాయి? తెలుసుకుందాం రండి..

లక్ష్యం దిశగా వెళ్తూ రూ. లక్షలు..

తమిళనాడులోని కోయంబత్తూర్ కు చెందిన కళ్యాణ్ కుమార్ అనే యువకుడు ప్లాస్టిక్‌ను నివారించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం వ్యర్థ పదార్థాలతోవస్తువులను తయారు చేయాలని ప్రణాళిక చేశాడు. వినియోగించిన తర్వాత కూడా వాటిని ఏదో ఒకరకంగా వాడేలా వాటిని తయారుచేయాలనుకొన్నాడు. అందుకోసం ఓ వినూత్న ఆలోచన చేశాడు. ఆ ఆలోచన ఏంటంటే .. గోధుమ రవ్వ , ధాన్యం పొట్టు, చింతపండు, పప్పులు, అరటి తొక్క, వివిధ ధాన్యం గింజలతో ఉపయోగకరమైన వస్తువులను తయారు చేయాలని తలంచాడు. అందుకోసం ఓ ప్రత్యేకమైన యంత్రాన్ని తయారు చేశాడు. ఈ యంత్రం సాయంతో టీ కప్పులు, ప్లేట్లు, స్పూన్లు, డిన్నర్ ప్లేట్లు తయారు చేశాడు. వాస్తవానికి ఇంట్లోనే లభించే ఈ వస్తువులకు మార్కెట్లో డిమాండ్ ఉంది.

ఈ ప్లేట్లతో మరో ప్రయోజనం..

పర్యావరణ హితమైన వ్యర్థాలతో తయారు చేసిన ఈ ప్లేట్లు, గ్లాసులు, టీ కప్పులు, స్పూన్లతో మరో ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది. అదేంటంటే వీటిని మనం వినియోగించిన తర్వాత ఆ ప్లేట్లను డస్ట్ బిన్ లో వేయాల్సిన అవసరం లేదు. వాటిని తీసుకెళ్లి మన ఇంట్లోనే పెంపుడు జంతువులకు తినిపించేయవచ్చు. ఆ ప్లేట్లు, గ్లాసులు వాటికి ఆహారంగా పనికి వస్తాయి. అలా ఉపయోగించని పక్షంలో వాటినన్నంటికీ ఓ చోట ఉంచితే అది ఎరువుగా కూడా మారుతుంది. దీంతో పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఇప్పుడు తమిళనాడులో ఈ ప్లేట్లు, గ్లాసులకు డిమాండ్ పెరిగింది. ప్రజలు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వాడిన కప్పులను పారేయకుండా ఆవులకు మేతగా తినిపిస్తున్నారు. లేకపోతే ఎరువుగా వినియోగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

చదువు కష్టమై.. ఉద్యోగం దూరమై..

ఈ డిఫరెంట్ వర్క్ గురించి ఆవిష్కర్త కళ్యాణ్ మాట్లాడుతూ.. తన వ్యక్తిగత కారణాల వల్ల చదువు పూర్తి చేయలేకపోయానన్నారు. బీబీఏ మధ్యలోనే ఆపేసనని చెప్పారు. ఆ తర్వాత వివిధ యంత్రాల తయారీ కంపెనీల్లో పలు ఉద్యోగాలు చేశానన్నారు. తద్వారా యంత్రాల తయారీపై కొంత అవగాహన ఏర్పడిందన్నారు. తాను తయారు చేసిన యంత్రం వివిధ పరిమాణాల్లో అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. రూ. 3 లక్షల నుంచి రూ. 35లక్షల వరకూ ఉంటుందన్నారు. రూ. 3 లక్షల విలువైన ఒక చిన్న యంత్రం కూడా రోజుకు 1000 కప్పులను తయారు చేయగలదని కళ్యాణ్ చెప్పారు. అందుకోసం కాస్త శ్రద్ధ పెట్టాలన్నారు. కానీ 35 లక్షల విలువైన పెద్ద యంత్రం పూర్తిగా ఆటోమేటిక్ అని దీనిలో శ్రమ తక్కువని వివరించారు. తానూ ప్రస్తుతం రోజూ 10 లక్షల కప్పులు అమ్ముతున్నట్లు వెల్లడించారు. ఈ వ్యాపారాన్ని తాను ప్రపంచ వ్యాప్తం చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. చాలా మంది ఈ పనికి రావాలని, విభిన్నమైన ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని కళ్యాణ్ వివరిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!