Mukesh Ambani: ఇన్వెస్టర్లకు అంబానీ అదిరిపోయే శుభవార్త.. 1:1 బోనస్ షేర్‌ స్కీమ్‌

దేశంలో అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) తన పెట్టుబడిదారులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. షేర్‌హోల్డర్లకు బోనస్‌ షేర్ల బొనాంజా ప్రకటించింది. అయితే కంపెనీ షేర్‌హోల్డర్ల వద్ద ఉన్న ప్రతి షేరుకు బోన్‌సగా మరో షేరును అంటే 1:1 నిష్పత్తిలో జారీ చేయనున్నట్లు రిలయన్స్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ ప్రకటించారు. దాదాపు 7 సంవత్సరాల..

Mukesh Ambani: ఇన్వెస్టర్లకు అంబానీ అదిరిపోయే శుభవార్త.. 1:1 బోనస్ షేర్‌ స్కీమ్‌
Reliance
Follow us
Subhash Goud

|

Updated on: Aug 31, 2024 | 5:59 PM

దేశంలో అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) తన పెట్టుబడిదారులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. షేర్‌హోల్డర్లకు బోనస్‌ షేర్ల బొనాంజా ప్రకటించింది. అయితే కంపెనీ షేర్‌హోల్డర్ల వద్ద ఉన్న ప్రతి షేరుకు బోన్‌సగా మరో షేరును అంటే 1:1 నిష్పత్తిలో జారీ చేయనున్నట్లు రిలయన్స్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ ప్రకటించారు. దాదాపు 7 సంవత్సరాల విరామం తర్వాత మరోసారి బోనస్ షేర్లను జారీ చేయనుంది.

కంపెనీ వాటాదారుల 47వ వార్షిక సాధారణ సమావేశంలో (ఏజీఎం) అంబానీ మాట్లాడుతూ.. వచ్చేనెల 5న సమావేశం కానున్న ఆర్‌ఐఎల్‌ బోర్డు ఈ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు వాటాదారుల నుంచి ఆమోదం కోరనుందన్నారు. 2000 సంవత్సరం నుంచి ఆర్‌ఐఎల్‌ ఇప్పటికే రెండు సార్లు వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్లను జారీ చేసిందని, కంపెనీ స్వల్పకాలిక లాభార్జనను కోరుకోవడం లేదు. సంపదను కూడబెట్టాలనుకోవడం లేదు. దేశం కోసం సంపదను సృష్టించాలనుకుంటోందని అంబానీ అన్నారు. బోనస్‌ షేర్ల జారీ ప్రకటనతో బీఎ్‌సఈలో కంపెనీ షేరు 1.51 శాతం పెరిగి రూ.3,040.85కు చేరుకుంది. దాంతో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఒక్కరోజే రూ.30వేల కోట్లకు పైగా పెరిగి మొత్తం రూ.20.57 లక్షల కోట్లు దాటింది.

1:1 బోనస్ షేర్ అంటే ఏమిటి?

ఇవి కూడా చదవండి

ప్రతి షేరుకు, దాని విలువలో సగం విలువ కలిగిన రెండు షేర్లు జారీ చేయబడతాయి. ఒక రిలయన్స్ షేర్ హోల్డర్లు ఒక అదనపు షేర్ పొందుతారు. మొత్తం విలువ ఒకే విధంగా ఉంటుంది. గురువారం రిలయన్స్ స్టాక్ ధర రూ. 3,042.90. ఈ ధర ఆధారంగా రిలయన్స్ బోనస్ షేర్లు ఇస్తే ఒక షేరు ధర రూ.1,521.45 అవుతుంది. అయితే, ఒక అదనపు వాటా అందుబాటులో ఉంటుందన్నట్లు.

ఇది కూడా చదవండి: Flight Travel Rules: విమానంలో ఈ వస్తువులు తీసుకెళ్లలేరు.. మొదటిసారి జర్నీ చేస్తే తెలుసుకోవాల్సిన విషయాలు!

100 షేర్లు ఉన్నవారు మరో 100 షేర్లను పొందుతారు. కానీ, మొత్తం విలువ ఒకటే. దీన్ని బోనస్ షేర్ కేటాయింపు అంటారు. ఈ లెక్కన 100 షేర్లు ఉంటే.. ఆ సంఖ్య 200 షేర్లకు చేరుతుంది. ఎలాంటి అదనపు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు.

బోనస్ షేర్లపై ప్రకటన తర్వాత రిలయన్స్ స్టాక్ ఒక్కసారిగా దూసుకెళ్లింది. దాదాపు 2 శాతానికిపైగా పెరిగి రూ. 3074 వద్ద గరిష్ట విలువను నమోదు చేసింది. ప్రస్తుతం 1.70 శాతం లాభంతో రూ. 3048 వద్ద ఉంది. అయితే ఈ స్టాక్ ఆల్ టైమ్ గరిష్ట విలువ రూ. 3217.60 కాగా.. కనిష్ట విలువ రూ. 2220.30 గా ఉంది. మార్కెట్ విలువ రూ. 20.63 లక్షల కోట్లుగా ఉంది. కొద్ది నెలల కిందట ఈ రిలయన్స్ ఎం క్యాప్ రూ. 21 లక్షల కోట్ల మార్కు కూడా దాటిన విషయం తెలిసిందే. బోనస్ షేర్ల ప్రకటనకు తోడు.. రిలయన్స్ ఏజీఎం నేపథ్యంలో పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇది కూడా చదవండి: New Rules: సెప్టెంబర్‌ నుంచి మారనున్న కీలక మార్పులు ఇవే.. కొత్త నిబంధనలు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి