Investments: అధిక రాబడినిచ్చే పథకం ఇదే.. ఎన్‌పీఎస్, పీపీఎఫ్‌లలో ఏది బెస్ట్ అంటే..
భవిష్యత్తులో ఆర్థిక భద్రతకు, జీవిత భరోసాకు ప్రతి ఒక్కరికీ పొదుపు అవసరం. ఆ పొదుపును పెట్టుబడిగా మార్చడం వల్ల అధిక రాబడి పొందటానికి అవకాశం ఉంటుంది. తద్వారా రిటైర్మెంట్ తర్వాత జీవితాన్ని ప్రశాంతంగా గడపవచ్చు. ఈ నేపథ్యంలో డబ్బులను పెట్టుబడి పెట్టటానికి ఎన్‌పీఎస్, పీపీఎఫ్ పథకాలు ఎంత వరకూ బాగుంటాయో తెలుసుకుందాం.
భవిష్యత్తులో ఆర్థిక భద్రతకు, జీవిత భరోసాకు ప్రతి ఒక్కరికీ పొదుపు అవసరం. ఆ పొదుపును పెట్టుబడిగా మార్చడం వల్ల అధిక రాబడి పొందటానికి అవకాశం ఉంటుంది. తద్వారా రిటైర్మెంట్ తర్వాత జీవితాన్ని ప్రశాంతంగా గడపవచ్చు. ఈ నేపథ్యంలో డబ్బులను పెట్టుబడి పెట్టటానికి ఎన్‌పీఎస్, పీపీఎఫ్ పథకాలు ఎంత వరకూ బాగుంటాయో తెలుసుకుందాం. వీటిలో నెలకు రూ.12,500 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే 15 ఏళ్ల తర్వాత ఎంత మొత్తం లభిస్తుందో లెక్కిద్దాం.
నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్‌పీఎస్)..
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) అనేది మార్కెట్-లింక్డ్ రిటైర్మెంట్ స్కీమ్. ఇది పోస్టాఫీసు, బ్యాంకులు అమలు చేసే చిన్న పొదుపు పథకం. అలాగే పదవీ విరమణ పథకంగా కూడా భావించవచ్చు. ఇక పీపీఎఫ్ పథకంలో ఏడాదికి 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ పథకానికి 15 ఏళ్ల లాక్-ఇన్ వ్యవధి ఉంది. మెచ్యూరిటీ సమయంలో మరో ఐదేళ్ల పొడిగింపు చేసుకోవచ్చు.
ప్రయోజనాలు.. పాత పన్ను విధానంలో ఉన్న పన్ను చెల్లింపుదారులు ఆదాయపుపన్ను చట్టంలోని 80 సెక్షన్ లోని వివిధ కేటగిరీల కింద మినహాయింపులు లభిస్తాయి.
వాయిదా/ఉపసంహరణ.. 60 ఏళ్ల ఎన్ పీఎస్ ఖాతాదారులు యాన్యుటీ ఉపసంహరణను మూడేళ్ల వరకూ వాయిదా వేయవచ్చు. లేకపోతే పదేళ్లకు ఏకమొత్తం ఉపసంహరణను వాయిదా వేయవచ్చు, వారు తమ ఖాతాను పొడిగించినప్పటికీ, ఏ సమయంలోనైనా దాన్ని ఆపివేసి, డబ్బును విత్‌డ్రా చేసుకునే హక్కు వారికి ఉంటుంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)..
పోస్టాఫీసు, బ్యాంకులు నిర్వహించబడే చిన్న పొదుపు పథకం ఇది. దీనిపై ఏడాదికి 7.1 శాతం వడ్డీ వస్తుంది. ఈ పథకం 15 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధిని కలిగి ఉంది. మెచ్యూరిటీ సమయంలో ఐదేళ్ల పొడిగింపులను పొందవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు డిపాజిట్లకు పన్ను ప్రయోజనాలు అందుతాయి. దానిపై వచ్చే వడ్డీతో పాటు మెచ్యూరిటీ మొత్తం కూడా పన్ను రహితంగా ఉంటుంది. దీర్ఘకాలంలో విభిన్నపోర్ట్‌ఫోలియోలో పీపీఎఫ్ బలమైన రుణ ఎంపికగా ఉంటుంది.
15 ఏళ్లలో వచ్చే ఆదాయం..
ఈ రెండు పథకాల ద్వారా 15 ఏళ్లలో వచ్చే ఆదాయం వివరాలు తెలుసుకుందాం. మీరు నెలకు రూ.12,500 చొప్పున పెట్టుబడి పెడితే చివరకు మీకు అందే ఆదాయం ఇలా ఉంటుంది.
- ఎన్పీఎస్ పథకానికి సంబంధించి ఈక్విటీ ఎక్స్‌పోజర్ 75 శాతం ఉన్న అగ్రెసివ్ లైఫ్ సైకిల్ ఫండ్‌లో నెలకు రూ.12,500 ఇన్వెస్ట్ చేశారనుకోండి. దాని నుంచి 12 శాతం రాబడి వచ్చినట్టయితే మీ పెట్టుబడి రూ. 22,50,000, అంచనా కార్పస్ రూ. 63,07,200 అవుతుంది.
- ఈక్విటీ ఎక్స్‌పోజర్ 50 శాతం ఉన్న బ్యాలెన్స్‌డ్ లైఫ్ సైకిల్ ఫండ్‌లో మీరు నెలకు రూ.12,500 ఇన్వెస్ట్ చేసి, మీకు 10 శాతం రాబడి వచ్చిందనుకోండి. మీ అంచనా కార్పస్ రూ. 52,24,054 అవుతుంది.
- ఈక్విటీ ఎక్స్‌పోజర్ 25 శాతం ఉన్న కన్జర్వేటివ్ లైఫ్ సైకిల్ ఫండ్‌లో నెలకు రూ.12,500 ఇన్వెస్ట్ చేసి, 8 శాతం రాబడిని పొందితే మీ అంచనా కార్పస్ రూ. 43,54,315 కు చేరుతుంది.
పీపీఎఫ్ పథకంలో.. దీనిలో ప్రతినెలా రూ.12,500 చొప్పున కట్టారనుకోండి. దానిపై 7.1 శాతం వార్షిక రాబడిని అంచనా వేసుకుందాం. 15 సంవత్సరాల తర్వాత అంచనా వేయబడిన కార్పస్ రూ. 40,68,209 అవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..