AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UBI FD rates: సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. భారీగా పెరిగిన ఎఫ్‌డీ వడ్డీరేట్లు..

యూనియన్ బ్యాంకు అధికారులు ఎఫ్డీలపై వడ్డీరేటు పెంపు నిర్ణయాన్ని ఆగస్టు 27వ తేదీన తీసుకున్నారు. దీని ప్రకారం రూ.5 కోట్ల వరకూ చేసిన టర్మ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 0.50, సూపర్ సీనియర్లకు 0.75 శాతం వడ్డీరేటును అందించనున్నారు. ఇది అన్ని దేశీయ టర్మ్ డిపాజిట్ పథకాలకు ఇది వర్తిస్తుంది.

UBI FD rates: సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. భారీగా పెరిగిన ఎఫ్‌డీ వడ్డీరేట్లు..
Senior Citizen Fd Rates
Madhu
|

Updated on: Aug 31, 2024 | 6:28 PM

Share

బ్యాంకులు అమలు చేస్తున్న ఫిక్స్ డ్ డిపాజిట్ (ఎఫ్ డీ) పథకాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంటుంది. డబ్బులను పెట్టుబడి పెట్టడానికి అత్యంత సురక్షితమైన మార్గంగా భావిస్తారు. నిర్ణీత సమాయానికి అసలు, వడ్డీతో కలిసి పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అనేక మంది ఎఫ్ డీలలో తమ సొమ్ములను ఇన్వెస్ట్ చేస్తారు. ముఖ్యంగా సీనియర్లు సీటిజన్ల వీటిపై ఆసక్తి చూపుతారు. వీరికి సాధారణ ఖాతాదారుల కంటే ఎక్కువ వడ్డీరేట్లు అమలవుతాయి. అయితే ఎఫ్ డీలపై వడ్డీరేట్లు వివిధ బ్యాంకులలో వివిధ రకాలుగా ఉంటాయి. బ్యాంకులు కూడా ఖాతాదారులను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమై రేట్లు ప్రకటిస్తాయి. దీనిలో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. సీనియర్, సూపర్ సీనియర్ సిటిజన్ల ఎఫ్ డీలపై ఇప్పుడు ఇస్తున్న వడ్డీ రేటును 0.50 నుంచి 0.75 శాతం పెంచుతున్నట్టు తెలిపింది.

నిబంధనలు ఇవీ..

ఎఫ్ డీలపై వడ్డీరేటు పెంపు నిర్ణయాన్ని ఆగస్టు 27వ తేదీన యూనియన్ బ్యాంకు అధికారులు తీసుకున్నారు. దీని ప్రకారం రూ.5 కోట్ల వరకూ చేసిన టర్మ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 0.50, సూపర్ సీనియర్లకు 0.75 శాతం వడ్డీరేటును అందించనున్నారు. ఇది అన్ని దేశీయ టర్మ్ డిపాజిట్ పథకాలకు ఇది వర్తిస్తుంది. 2022 డిసెంబర్ ఒకటి తర్వాత చేసిన డిపాజిట్లు, లేదా పునరుద్ధరించిన డిజిపాట్లకు కొత్త వడ్డీరేటు వర్తిస్తుంది. రోజు వారీ ప్రాతిపదిక వడ్డీని లెక్కిస్తారు. ఏటా ఏప్రిల్, జూలై, అక్టోబర్, జనవరి త్రైమాసికాల్లో వడ్డీని జమ చేస్తారు. కొత్తగా ప్రకటించిన వడ్డీరేట్టు ఆగస్టు రెండో తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. యూనియన్ బ్యాంక్ ఎఫ్ డీలపై కొత్త వడ్డీరేట్లు ఇలా ఉన్నాయి.

వడ్డీరేట్ల వివరాలు..

  • 7 నుంచి 14 రోజుల డిపాజిట్లపై 3.5 శాతం
  • 15 నుంచి 30 రోజులకు 3.5 శాతం
  • 31 నుంచి 45 రోజులకు 3.5 శాతం
  • 46 నుంచి 90 రోజులకు 4.5 శాతం
  • 91 నుంచి 120 రోజులకు 4.8 శాతం
  • 121 నుంచి 180 రోజులకు 5 శాతం
  • 181 నుంచి 332 రోజులకు 6.35 శాతం
  • 333 రోజులకు 7.4 శాతం
  • 334 నుంచి ఒక ఏడాదికి 6.35 శాతం
  • ఏడాది పాటు చేసిన డిపాజిట్లపై 6.8 శాతం
  • ఒక ఏడాది నుంచి 398 రోజుకు 6.8 శాతం
  • 399 రోజుల కు 7.25 శాతం
  • 400 నుంచి రెండేళ్ల వరకూ 6.6 శాతం
  • రెండేళ్ల నుంచి 996 రోజులకు 6.6 శాతం
  • 998 రోజుల నుంచి మూడేళ్ల లోపు 6.6 శాతం
  • మూడేళ్ల డిపాజిట్లకు 6.7 శాతం
  • మూడేళ్ల నుంచి ఐదేళ్లకు 6.5 శాతం
  • ఐదేళ్ల నుంచి పదేళ్లకు 6.5 శాతం

ఖాతా తెరవాలనుకుంటే..

60 ఏళ్ల నుంచి 80 ఏళ్లు వయసు నిండిన వారందరూ ఎఫ్ డీలపై అదనపు వడ్డీరేటు పొందేందుకు అర్హులు. వీరిని సీనియర్, సూపర్ సీనియర్లు గా పరిగణిస్తారు. వీరు కొత్తగా డిపాజిట్ ఖాతా తెరవాలనుకుంటే తమ వయస్సును ధ్రువీకరించడానికి ఈ కింది తెలిపిన ప్రతాలలో దేనినైనా సమర్పించాలి.

  • పుట్టిన తేదీని సూచించే సీనియర్ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్
  • ఎల్ఐసీ పాలసీ
  • ఓటు గుర్తింపు కార్డు
  • పెన్షన్ చెల్లింపు ఆర్డర్
  •  అధికారి జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రం
  • పాస్ పోర్టు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us