Royal Enfield Goan 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానులకు ఇక పండగే.. త్వరలో గోవాన్ 350 విడుదల

ద్విచక్ర వాహనాలలో కొన్ని బ్రాండ్లకు ఎంతో గుర్తింపు ఉంటుంది. ఏళ్లు గడుస్తున్నా, తరాలు మారుతున్నా వాటికి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గదు. ఒకరి నుంచి మరొకరి ఆ బ్రాండ్ పై ఆసక్తి పెరుగుతూనే ఉంటుంది. అలాంటి వాటిలో రాయల్ ఎన్ ఫీల్డ్ ఒకటి. పాత కాలం నుంచి నేటి వరకూ ఈ బండి వాహన ప్రియులను అలరిస్తూనే ఉంది.

Royal Enfield Goan 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానులకు ఇక పండగే.. త్వరలో గోవాన్ 350 విడుదల
Royal Enfield Goan 350
Follow us
Srinu

|

Updated on: Nov 15, 2024 | 4:45 PM

రాయల్ ఎన్ ఫీల్డ్ ను ఒక్కసారైనా నడపాలని యువత కోరుకుంటారు. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ ఒక శుభవార్త చెప్పింది. గోవాన్ 350 పేరుతో కొత్త బైక్ ను నవంబర్ 23న విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. రాయన్ ఎన్ ఫీల్డ్ గోవాన్ 350 మోటారు సైకిల్ ను క్లాసిక్ 350 ఆధారంగా రూపొందించారు. రాయన్ ఎన్ ఫీల్డ్ మోటోవర్స్ 2024లో దీన్ని ప్రారంభించనున్నారు. క్లాసిక్, హంటర్, బుల్లెట్ తర్వాత జె సిరీస్ 350 సీసీ ఇంజిన్ ప్లాట్ ఫాం ఆధారంగా దీన్ని తయారు చేశారు. ఈ బాబర్ స్లైల్ ఫంకియర్ మోటారు సైకిల్ లో సింగిల్ సీట్ లే అవుట్ ఉంది. అయినప్పటికీ పిలియన్ సీటు కోసం ఏర్పాట్లు ఉంటాయి. వాల్ టైర్లు, యు ఆకారపు హ్యాండిల్ బార్, పొడవైన విండో స్క్రీన్, స్పోక్ట్ రిమ్ములు ఆకట్టుకుంటున్నాయి.

రాయల్ ఎన్ ఫీల్డ్ కు చెందిన జె సిరీస్ ఇంజిన్ ప్లాట్ ఫాంపై ఆధారపడి గోవాన్ 350 పనిచేస్తుంది. దీనిలో 349 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిల్ కూల్డ్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. దాని నుంచి 20.2 హెచ్ పీ, 27 ఎన్ఎం గరిష్ట టార్క్ విడుదల అవుతుంది. అలాగే ఐదు స్పీడ్ ట్రాన్స్ మెషీన్ జత చేశారు. అయితే క్లాసిక్ 350 మోటారు సైకిల్ ధర రూ.1.93 లక్షల నుంచి రూ.2.30 లక్షల మధ్య ఉంటాయి. కాబట్టి గోవాన్ ధర ఇంకొంచెం ఎక్కువగా ఉంటే అవకాశం ఉంది. రాయల్ ఎన్ ఫీల్డ్ గోవాన్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, డ్యూయల్ రియర్ షాక్ లతో రానుంది. దీని బ్రేకింగ్ హార్డ్ వేర్ లో మల్టీ స్పోక్ వీల్స్ పై మౌంట్ చేసిన ముందు, వెనుక బ్రేకులు ఉంటాయి. కానీ దీనిలోని బేస్ వేరియంట్ కు వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ ఉంటే అవకాశం ఉందని భావిస్తున్నారు.

క్లాసిక్ 350 మాదిరిగా కనిపించినప్పటికీ గోవాన్ లో రైడింగ్ పోజిషన్ బెటర్ గా ఉంటుంది. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, సింగిల్ పాడ్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, ట్రిప్పర్ నావిగేషన్ తదితర ఫీచర్లు ఉన్నాయి. సింగిల్, డ్యూయల్ చానల్ ఏబీఎస్ వేరియంట్ లలో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. రాయల్ ఎన్ ఫీల్డ్ 2024లో అనేక కొత్త మోటారు సైకిళ్లను ఆవిష్కరించింది. బేర్ 650, క్లాసిక్ 650, ఫ్లయింగ్ ఫ్లీ సీ6 వంటివి వాటిలో ఉన్నాయి. బేర్ అనేది ఇంటర్ సెప్టర్ 650 ప్లాట్ ఫాంపై ఆధారపడిన బైక్. ఇది రూ.3.39 లక్షల ధరకు అందుబాటులోకి వచ్చింది. క్లాసిక్ 650 త్వరలో విడుదల కానుంది. ఇక ఫ్లయింగ్ ఫ్లీ సీ6 రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి విడుదలైన మొదటి ఎలక్ట్రిక్ మోటారు సైకిల్‌గా ఈ బైక్‌ను లాంచ్ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!