Business Idea: రూ. 20 వేల పెట్టుబడితో.. రోజుకు వెయ్యి ఆదాయం. సూపర్‌ బిజినెస్‌

తక్కువ బడ్జెట్‌లో బిజినెస్‌ ప్రారంభించాలనుకుంటున్నారా.? నష్టం అనేది లేకుండా ఉన్న ఊరిలోనే ప్రారంభించుకునే బెస్ట్‌ బిజినెస్‌ ప్లాన్స్‌లో ఇదీ ఒకటి. ఇంతకీ ఏంటీ వ్యాపారం. ఇందులో ఎంత పెట్టుబడి పెట్టాలి.? లాభాలు ఎలా ఉంటాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Business Idea: రూ. 20 వేల పెట్టుబడితో.. రోజుకు వెయ్యి ఆదాయం. సూపర్‌ బిజినెస్‌
Business Idea
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 15, 2024 | 11:59 AM

ప్రస్తుతం ఏదో ఒక వ్యాపారం చేయాలనే ఆలోచన చాలా మందిలో పెరుగుతోంది. ఉన్న ఊరిలోనే ఉంటూ ఆదాయా మార్గాలను అన్వేషిస్తున్నారు. ఉద్యోగం చేసే వారు కూడా సైడ్‌ ఇన్‌కమ్‌ కోసం వ్యాపారాలను మొదలు పెడుతున్నారు. అయితే సాధారణంగా వ్యాపారం అనగానే భారీగా పెట్టుబడులు అవసరం ఉంటుందనే బావనలో ఉంటాం. అయితే వినూత్నంగా ఆలోచిస్తే తక్కువ ఖర్చులో కూడా మంచి వ్యాపారాలను ప్రారంభించవచ్చు. అలాంటి ఓ బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం..

ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ అనగానే పెద్ద పెద్ద రెస్టారెంట్స్‌లో లభించేవి అనుకుంటాం. అయితే ఫ్రెంచ్‌ ఫ్రైట్‌ స్టాల్‌ ఏర్పాటు చేయడం ద్వారా చిన్న చిన్న పట్టణాల్లో కూడా మీ వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు. ఇందుకోసం మంచి లొకేషన్‌లో ఒక స్టాల్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు చాలా తక్కువ పెట్టుబడి అవుతుంది. ఈ వ్యాపారన్ని ప్రారంభించాలంటే ఫ్రెంచ్‌ ఫ్రై మిషన్‌ కావాల్సి ఉంటుంది. వీటితో పాటు పొటాటో ఫింగ్‌ చిప్స్‌, చాట్‌ మసాలా, నూనె వంటి ముడిసరుకులు కావాల్సి ఉంటుంది.

మార్కెట్లో పొటాటో ఫింగర్ చిప్స్‌ ధర.. 2.5 కిలోల ప్యాకెట్ రూ. 270 నుంచి రూ. 300 వరకు లభిస్తాయి. అయితే పొటాటో చిప్స్‌ను స్వయంగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇక చిప్స్‌ తయారీ విషయానికొస్తే.. ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ మిషిన్‌లో ఆయిల్‌ వేసి చిప్స్‌ను వేయించడమే. ఈ మిషిన్‌ ధర రూ. 3500 నుంచి ప్రారంభమవుతుంది. స్టాల్‌ ఏర్పాటుకు రూ. 5000 వరకు అవుతుంది.

అయితే స్టీల్‌ స్టాల్‌ కావాలంటే కాస్త ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. చివరిగా ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ను సర్వ్‌ చేయడానికి ప్యాకెట్స్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే ఫ్రెంచ్‌ ఫ్రైస్‌పై చల్లేందుకు మసాలాలను కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వీటిని మీ సొంత బ్రాండింగ్‌తో కూడా విక్రయించుకోవచ్చు. మొత్తం మీద ఈ బిజినెస్‌ను రూ. 20 నుంచి రూ. 30వేలలో ప్రారంభించవచ్చు.

లాభాల విషయానికొస్తే.. సాధారణంగా ఒక కప్పు ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ తయారీకి రూ. 20 ఖర్చు అవుతుంది. అయితే తక్కువలో తక్కువ ఒక్క ప్యాకెట్‌ను రూ. 50 విక్రయించిన రూ. 30 లాభం ఏటు పోవు. తక్కువలో తక్కువ రోజుకు ఒక 50 ప్యాకెట్స్‌ విక్రయించినా రూ. 1500 లాభం వస్తుంది. ఇలా నెలంతా నడిస్తే కనీసం రూ. 40 వేలు ఆర్జించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
గోవా వైన్ షాప్‌లో బన్నీ.! వీడియో చూపించి లాక్‌ చేసిన బాలయ్య..
గోవా వైన్ షాప్‌లో బన్నీ.! వీడియో చూపించి లాక్‌ చేసిన బాలయ్య..