Onion Price: రాబోయే రోజుల్లో ఉల్లి ధర మరింత పెరగనుందా? షాకింగ్ నివేదిక!
Onion Price: గత నెలలతో పోలిస్తే నవంబర్‌లో కూరగాయల ధరలు తగ్గినప్పటికీ ఉల్లి ధరలు మాత్రం అధికంగానే ఉన్నాయని ఐసీఐసీఐ బ్యాంక్ నివేదిక పేర్కొంది.
రాబోయే కొద్ది నెలల వరకు సామాన్యులకు ఉల్లి అందని ద్రాక్షల మారనుంది. ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉల్లి ధరలు ఇప్పటికే చాలా ఉన్నాయి. కిలో రూ.50కి పైగా ఉంది. దీనికి సంబంధించి ఓ రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో ఉల్లి మాత్రమే కాకుండా టొమాటో, క్యాబేజీ వంటి ఇతర కూరగాయల ధరలు కూడా నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి.
ఐసీఐసీఐ బ్యాంక్ నివేదిక ప్రకారం దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ లాసల్‌గావ్‌లో ఉల్లి ధర ఐదేళ్ల గరిష్టానికి చేరుకుంది. దీని ధర క్వింటాల్‌కు రూ.5500 పైనే చేరింది. ఇవి హోల్‌సేల్ మార్కెట్ ధరలు, త్వరలో రిటైల్ మార్కెట్‌లో ఉల్లి చౌకగా మారుతుందన్న ఆశ లేదు.
ఈ నెల 6న లాసల్‌గావ్‌లో ఉల్లి ధర క్వింటాల్ రూ.5,656కు చేరింది. ఈ విధంగా ఉల్లి ధరలు 2019 రికార్డును కూడా బద్దలు కొట్టాయి. ఎందుకంటే ఉల్లిపాయ ధరలు డిసెంబర్ 10, 2019 న మాత్రమే ఈ స్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు కూడా హోల్‌సేల్ మార్కెట్‌లో ఉల్లి ధర క్వింటాల్‌కు రూ.4,000 వరకు ఉంది.
ICICI బ్యాంక్ నివేదికలో ఇంకా ఏముంది?
గత నెలలతో పోలిస్తే నవంబర్‌లో కూరగాయల ధరలు తగ్గినప్పటికీ ఉల్లి ధరలు మాత్రం అధికంగానే ఉన్నాయని ఐసీఐసీఐ బ్యాంక్ నివేదిక పేర్కొంది. ఆగస్టు, సెప్టెంబరులో భారీ వర్షాల కారణంగా కూరగాయల రాక 28 శాతం తగ్గింది. గత నెలలో టమాటా ధరలు 49 శాతం పెరిగాయి. అదే సమయంలో ఉల్లి ధరలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి.
ఈ ఏడాది అక్టోబర్‌లో వార్షిక ప్రాతిపదికన కూరగాయల ధరలు 42 శాతం పెరిగాయి. కూరగాయల ధరల్లో ఇది 57 నెలల గరిష్టం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి