AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hydrogen Rail: హైడ్రోజన్ రైల్ వచ్చేస్తుందోచ్..! ఆ రూట్‌లోనే ట్రయల్ రన్

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వేగవంతమైన ప్రయాణ అనుభవాన్ని పొందాలని కోరుకుంటున్నారు. వేగంగా ప్రయాణించాలంటే ప్రస్తుతం మన దేశంలో విమాన ప్రయాణమే అందుబాటులో ఉంది. అయితే ఇతర దేశాల్లో బుల్లెట్ రైళ్లు విమాన ప్రయాణ వేగంతో సరిసమానంగా దూసుకుపోతున్నాయి. భారత్‌లో త్వరలో బుల్లెట్ రైలు ప్రవేశపెడతారనే ఊహాగానాల మధ్య తాజాగా హైడ్రోజన్ రైలు ప్రాచుర్యంలోకి వచ్చింది. కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో లాంచ్ చేస్తున్న ఈ హైడ్రోజన్ రైలును లాంచ్ చేస్తున్నారు. ఈ హైడ్రోజన్ రైలు గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Hydrogen Rail: హైడ్రోజన్ రైల్ వచ్చేస్తుందోచ్..! ఆ రూట్‌లోనే ట్రయల్ రన్
Hydrogen Rail
Nikhil
|

Updated on: Nov 15, 2024 | 3:20 PM

Share

భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు త్వరలోనే మన ముందుకు రాబోతోంది. హైడ్రోజన్‌తో నడిచే రైలు ట్రయల్ డిసెంబర్ 2024లో జరగనుంది. ఈ రైలు డీజిల్ లేదా విద్యుత్‌తో కాకుండా హైడ్రోజన్ ఇంధనంగా ఉపయోగించి నడుస్తుంది. 2030 నాటికి భారతదేశంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించాలనే దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ హైడ్రోజన్ రైలును లాంచ్ చేశారు. శక్తిని ఉత్పత్తి చేయడానికి నీటిని ఉపయోగించే భారతదేశపు మొదటి రైలు ఇది. డీజిల్ లేదా ఎలక్ట్రిక్ ఇంజిన్లకు బదులుగా, ఈ రైలు హైడ్రోజన్ నుండి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. 

ఇండియన్ రైల్వేస్ కార్బన్ ఉద్గారాలను తగ్గించడంతో పాటు డీజిల్ ఇంజిన్‌ల వల్ల కలిగే వాయు కాలుష్యాన్ని తొలగించడం కోసం హైడ్రోజన్ రైలును లాంచ్ చేస్తుంది. హైడ్రోజన్‌ని ఉపయోగించడం ద్వారా ఈ రైలు కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ మొదలైన కాలుష్యాన్ని విడుదల చేయదు. ఈ రైళ్లు డీజిల్ ఇంజిన్‌ల కంటే 60 శాతం తక్కువ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి. భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా 35 హైడ్రోజన్ రైళ్లను లాంచ్ చేయాలని ప్రయత్నాలు చేస్తుంది. 

హైడ్రోజన్ రైలుకు సంబంధించిన మొదటి ట్రయల్ రన్ హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గంలో ఉంటుంది. ఇది దాదాపు 90 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది కాకుండా, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, నీలగిరి మౌంటైన్ రైల్వే, కల్కా-సిమ్లా రైల్వే వంటి వారసత్వ పర్వత రైలు మార్గాలు కూడా ఉన్నాయి. ఈ రైలు గరిష్ట వేగం గంటకు 140 కిలోమీటర్లు ఉంటుంది. అందువల్ల ప్రయాణికులు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించగలరని నిపుణులు చెబుతున్నారు. ఒకసారి ఇంధనం నింపితే రైలు 1,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ రైలుకు ప్రతి గంటకు దాదాపు 40,000 లీటర్ల నీరు అవసరమవుతుంది. దీని కోసం ప్రత్యేక నీటి నిల్వ సౌకర్యాలు నిర్మిస్తారు. అలాగే  ఒక్కో హైడ్రోజన్ రైలు ఖరీదు దాదాపు రూ.80 కోట్లుగా ఉంటుందని అంచనా.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!