RBI Fine: ఆ రెండు సంస్థలకూ ఆర్బీఐ షాక్.. భారీ జరిమానా విధించడానిక కారణాలివే..!

ప్రజలు తమ ఆర్థిక అవసరాల కోసం బ్యాంకులు, వివిధ ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయిస్తారు. వాటి నుంచి రుణాలు పొంది తమ అవసరాలను తీర్చుకుంటారు. రుణానికి వడ్డీతో కలిపి ప్రతినెలా వాయిదాలు కడతారు. అయితే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు నిబంధనలు పాటిస్తూ తమ కార్యకలాపాలను నిర్వహించాలి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్ఐబీ) నిరంతరం పర్యవేక్షణ చేస్తుంది. ఆయా సంస్థల రికార్డులను తనిఖీ చేయడం, నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకోవడం జరుగుతోంది. దీనిలో భాగంగా ఇండస్ ఇండ్ బ్యాంకు, మణప్పురం ఫైనాన్స్ సంస్థల రికార్డులను పరిశీలించింది. వాటిలో తేడాలుండడంతో జరిమానా విధించింది.

RBI Fine: ఆ రెండు సంస్థలకూ ఆర్బీఐ షాక్.. భారీ జరిమానా విధించడానిక కారణాలివే..!
Reserve Bank Of India
Follow us
Srinu

|

Updated on: Dec 21, 2024 | 4:30 PM

నిబంధనలను ఉల్లంఘించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రముఖ ప్రైవేటు బ్యాంకు అయిన ఇండస్ ఇండ్ బ్యాంకుకు రూ.27.30 లక్షలు, బ్యాంకేతర ఆర్థిక సంస్థ అయిన మణప్పురం ఫైనాన్స్ కు రూ.20 లక్షల జరిమానాను ఆర్బీఐ విధించింది. అర్హత లేని సంస్థల పేరుతో సేవింగ్స్ డిపాజిట్ ఖాతాలు తెరిచారన్నదే ఇండస్ ఇండ్ బ్యాంకుపై ప్రధాన ఆరోపణ. ఈ కారణంతోనే ఆ బ్యాంకుకు ఆర్బీఐ జరిమానా విధించింది. ఇండస్ ఇండ్ బ్యాంకు రికార్డులను గతంలో ఆర్బీఐ తనిఖీ చేసింది. వాటిలో లోటుపాట్లను గమనించి నోటీసులు జారీ చేసింది. ఆ బ్యాంకు నుంచి వివరణ వచ్చిన తర్వాత రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా డైరెక్షన్స్ 2016 నిబంధనల ప్రకారం తాజాగా రూ.27.30 లక్షల జరిమానా విధించింది. కాగా.. రిజర్వ్ బ్యాంకు చర్యలతో ఆ బ్యాంకు షేర్లు శుక్రవారం నష్టాలను చూశాయి. 3.47 శాతం నష్టంతో రూ.930.90 వద్ద స్థిరపడ్డాయి. ప్రస్తుతం ఈ బ్యాంకు మార్కెట్ విలువ రూ.72.48 వేల కోట్లుగా ఉంది.

మణప్పురం ఫైనాన్స్ సంస్థపై కూడా ఆర్బీఐ కొరడా ఝుళిపించింది. కస్టమర్ అంగీకారంతో పాన్ వెరిఫికేషన్ చేయడంలో ఆ సంస్థ విఫలమైందని గుర్తించింది. అలాగే ఖాతాదారులకు యూనిక్ కస్టమర్ ఐడెంటిఫికేషన్ కోడ్ (యూసీఐసీ) బదులుగా మల్టిపుల్ ఐడెంటిఫికేషన్ కోడ్ ఇచ్చినట్టు తెలిపింది. నిబంధనల ప్రకారం ఇది తప్పని హెచ్చరించింది. నిబంధనలను పాటించనందుకు ఆ సంస్థకు రూ.20 లక్షల జరిమానా విధించింది. ఈ చర్యల ప్రభావం మణప్పురం ఫైనాన్స్ స్టాక్ పై పడింది. ఈ సంస్థ స్టాక్ 2.69 శాతం నష్టంతో రూ.180.99 వద్ద ముగిసింది. దీని మార్కెట్ విలువ రూ.15.34 కోట్లుగా ఉంది.

దేశంలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలన్నీ రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పర్యవేక్షణలోనే పనిచేస్తాయి. వాటి కార్యకలాపాలపై ఆర్బీఐకి పూర్తి నియంత్రణ ఉంటుంది. ఖాాతాదారులకు అందించే సేవలు విషయంలో ఏమాత్రం తేడాలు ఉన్నా, ఖాాతాదారులకు నష్టం కలిగేలా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటుంది. వాటి కార్యకలాపాలకు సంబంధించి నిబంధనలను, మార్గదర్శకాలను ముందుగానే రూపొందింస్తుంది. వాటిని కచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ఆయా బ్యాంకులు, ఆర్థిక సంస్థలపై ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి