మార్చి 31 ఆదివారం కూడా బ్యాంకులు తెరిచే ఉంటాయ్..! పూర్తి వివరాలు ఇలా..
అంతేకాదు.. మార్చి నెలాఖరున గుడ్ ఫ్రైడేతో పాటు శని, ఆదివారాల సెలవులను ఐటీ శాఖ రద్దు చేసింది. ఆయా రోజులలో బ్యాంకులతో పాటు, ఆదాయపు పన్ను శాఖ అన్ని కార్యాలయాలు కూడా మార్చి 31న తెరిచి ఉంటాయి. ఐటీ శాఖ మార్చి 29, 30 , 31 మూడు రోజులూ పని చేస్తుంది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఆ శాఖ ఈ కీలక నిర్ణయం ప్రకటించింది.
ప్రతి ఆదివారం ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలు, బ్యాంకులకు హాలీడే అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ నెల 31వ తేదీన(ఆదివారం) బ్యాంకులు తెరిచే ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) వెల్లడించింది. దానికి కారణం ఏంటంటే.. మార్చి 31న ఈ ఏడాది ఫైనాన్షియల్ ఇయర్‌లో ఆఖరు రోజు. అందుకే అన్ని బ్యాంకు శాఖలను ఈ నెల 31 ఆదివారం నాడు తెరిచే ఉంచాలని ఆర్‌బీఐ ఆదేశించింది. ఆర్బీఐ ఆదేశాల మేరకు మార్చి 31న బ్యాంకులు తెరిచే ఉంటాయి. ఇది కాకుండా అన్ని ఏజెన్సీ బ్యాంకులు కూడా ఖాతాదారులకు, ప్రజలకు అందుబాటులో ఉంటాయి. తద్వారా రసీదులు, చెల్లింపులకు సంబంధించిన అన్ని ప్రభుత్వ లావాదేవీలు FY24లో నిర్వహించబడతాయని సమాచారం. ఈ నోటిఫికేషన్‌ను ఆర్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ సునీల్ టీఎస్ నాయర్ విడుదల చేశారు.
ఈ ముఖ్యమైన తేదీలో పనిచేయడానికి RBI 33 ఏజెన్సీ బ్యాంకులను నియమించింది. ఈ జాబితాలో 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) వంటి ప్రముఖ పేర్లతో పాటు 20 ప్రైవేట్ రంగ బ్యాంకులు ఉన్నాయి, వాటిలో HDFC బ్యాంక్ లిమిటెడ్, ICICI బ్యాంక్ లిమిటెడ్ ఉన్నాయి. అదనంగా, DBS బ్యాంక్ ఇండియా లిమిటెడ్ ఈ ఏర్పాటులో ఏకైక విదేశీ బ్యాంకుకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ బ్యాంకులు మార్చి 31న పూర్తి సేవలను అందించనున్నాయి.
All Agency Banks to remain open for public on March 31, 2024 (Sunday)https://t.co/7eI5CZtlh0
— ReserveBankOfIndia (@RBI) March 20, 2024
అంతేకాదు.. మార్చి నెలాఖరున గుడ్ ఫ్రైడేతో పాటు శని, ఆదివారాల సెలవులను ఐటీ శాఖ రద్దు చేసింది. ఆయా రోజులలో బ్యాంకులతో పాటు, ఆదాయపు పన్ను శాఖ అన్ని కార్యాలయాలు కూడా మార్చి 31న తెరిచి ఉంటాయి. ఐటీ శాఖ మార్చి 29, 30 , 31 మూడు రోజులూ పని చేస్తుంది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఆ శాఖ ఈ కీలక నిర్ణయం ప్రకటించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి