AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆనంద్‌ మహీంద్రా ఐడియా అదుర్స్‌..! ఏసీ నుండి వచ్చే నీటిని ఎలా పొదుపు చేయాలో చూపించారు..

ఇటీవల దేశం మొత్తం బెంగళూరులో నీటి సంక్షోభాన్ని చూసింది. బెంగళూరులో ఎక్కడ చూసినా నీటి కొరత ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. అటువంటి పరిస్థితిలో భారతదేశపు ప్రసిద్ధ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన X ఖాతా ద్వారా ఒక అమూల్యమైన వీడియోను పంచుకున్నారు. ఆ వీడియో AC నీటిని ఆదా చేయడానికి ఒక మార్గాన్ని సూచించారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.

ఆనంద్‌ మహీంద్రా ఐడియా అదుర్స్‌..! ఏసీ నుండి వచ్చే నీటిని ఎలా పొదుపు చేయాలో చూపించారు..
Save Water Of Air Condition
Jyothi Gadda
|

Updated on: Mar 22, 2024 | 8:38 PM

Share

నీళ్లే జీవానికి ఆధారం. నీరే ప్రాణం, నీరు వృథా చేస్తే భవిష్యత్తులో చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ మీరు మీ నగరాల గోడలపై తరచుగా చదివే నినాదాలు. నిజానికి, మన జీవితానికి నీరు చాలా ముఖ్యమైనది. ఇటీవల దేశం మొత్తం బెంగళూరులో నీటి సంక్షోభాన్ని చూసింది. బెంగళూరులో ఎక్కడ చూసినా నీటి కొరత ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. అటువంటి పరిస్థితిలో భారతదేశపు ప్రసిద్ధ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన X ఖాతా ద్వారా ఒక అమూల్యమైన వీడియోను పంచుకున్నారు. ఆ వీడియో AC నీటిని ఆదా చేయడానికి ఒక మార్గాన్ని సూచించారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.

భారతీయ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్‌ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక స్పూర్తిదాయకమైన సందేశాన్ని ప్రజలకు షేర్‌ చేస్తుంటారు. ఇప్పుడు కూడా @anandmahindra నుండి ఒక వీడియోను షేర్‌ చేసారు. ఎయిర్ కండీషనర్ నుండి వచ్చే నీరు మళ్లీ ఎలా నిల్వ చేయవచ్చు ఇక్కడ చూపించారు. గోడకు అమర్చిన ఏసీ ఎక్స్‌పాన్షన్‌ వాల్వ్‌ నుంచి బయటకు వచ్చే నీటిని పైపు సహాయంతో ఎలా స్టోర్‌ చేశారో వీడియోలో చూడవచ్చు. ఈ పైపు గోడకు సపోర్ట్‌గా ఉన్న వాటర్ అవుట్‌లెట్ పైపులోకి చొప్పించబడింది. కుళాయికి కనెక్ట్ చేయబడింది. ఇప్పుడు ఏసీ నుంచి నీరు రాగానే పైపు సహాయంతో ఆ కుళాయికి అనుసంధానించబడిన పైపులో నిల్వ ఉంటుంది. తద్వారా అవసరమైతే, ఇక్కడ స్టోర్‌ అయిన నీటిని తర్వాత కుళాయి నుండి తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ విధంగా ఏసీ నీటిని ఆదా చేయడం ద్వారా నగరంలో నీటి ఎద్దడిని కొంతమేరకైనా నివారించవచ్చని బెంగళూరు వాసులకు ఈ వీడియో ద్వారా చెప్పబడింది. ఈ వీడియోను ఇప్పటివరకు 1 మిలియన్ కంటే ఎక్కువ సార్లు వీక్షించారు. అలా 21 వేల మంది కూడా వీడియోను లైక్ చేసారు. ప్రజలు కూడా దీనిపై తమదైన రియాక్షన్స్ ఇవ్వడం కనిపిస్తుంది. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు… ఎయిర్ కండీషనర్ నుండి విడుదలయ్యే నీరు తాగడానికి సురక్షితం కాదు, కానీ దానిని తోటపని, శుభ్రపరిచే ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. మరొక వినియోగదారు రాశారు… ప్రతిచోటా నీటి సంరక్షణ ముఖ్యం, మంచి భవిష్యత్తు కోసం అవగాహన కలిగి ఉండటం అవసరం అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..