ఖాళీ కడుపుతో 2 ఖర్జూరాలు తింటే ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో తెలుసా..?

ఖ‌ర్జూరాలు మ‌న‌కు ఎంతో శ‌క్తిని అందిస్తాయి. వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. ఖర్జూరంలో కాల్షియం, పొటాషియం మంచి మూలం. ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ రెండు ఖర్జూరాలను తింటే మీ శరీరంలో ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Mar 22, 2024 | 7:52 PM

ఖ‌ర్జూరాల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. వీటిని రోజూ తింటే జీర్ణ స‌మ‌స్య‌ల నుంచి ఉపశమనం లభిస్తుంది. మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. ఉద‌యం ప‌ర‌గ‌డుపున ఖ‌ర్జూరాల‌ను తిన‌వ‌చ్చు. దీంతో ఉద‌యం శ‌రీరానికి వేగంగా శ‌క్తి ల‌భిస్తుంది. ఇది మ‌న‌ల్ని రోజంతా యాక్టివ్‌గా ఉంచుతుంది. బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. రోజంతా ఉత్సాహంగా ప‌నిచేస్తారు. మెద‌డు యాక్టివ్‌గా ప‌నిచేస్తుంది. చురుగ్గా ఉంటారు.

1 / 5
ఎముక ఆరోగ్యం, మెదడు ఆరోగ్యం, చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో దశాబ్దాలుగా సహజ వైద్య ప్రయోజనాల కోసం ఖర్జూరాలను వాడుతున్నారు. మలబద్ధకం, ఉదర క్యాన్సర్ ,విరేచనాలతో సహా కొన్ని ఆరోగ్య పరిస్థితులకు ఖర్జూరాలను మంచి పరిష్కారంగా చెప్పవచ్చు.

2 / 5
ఉద‌యం ప‌ర‌గ‌డుపున ఖ‌ర్జూరాలు 2 తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి త‌గినంత శ‌క్తి ల‌భిస్తుంది. వ్యాయామం చురుగ్గా ఎక్కువ సేపు వ్యాయామం చేయ‌వ‌చ్చు. దీంతో బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతారు. దీంతోపాటు ప్రేగులో పరాన్నజీవులను నాశనం చేస్తుంది. హృదయాన్ని బలోపేతం చేయడానికి, కాలేయాన్ని శుభ్రపరచడానికి, రక్తాన్ని పెంచటానికి సహాయపడుతుంది.

3 / 5
తరచూ ఖర్జూరాలు తినే మహిళల్లో రొమ్ము పరిమాణాన్ని, పురుషులకు వృషణ పరిమాణాన్ని పెంచడానికి సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధించడానికి ఖర్జూరాలు దోహదం చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఖర్జూరాలను లైంగిక బలహీనతకు పొగొట్టేందుకు వినియోగిస్తున్నారు. వీటిలో ఉండే అధిక పోషక అంశాలైన ఫ్లేవనాయిడ్ , ఎస్ట్రాడియోల్ కాంపోనెంట్స్ లు స్పెర్మ్ కౌంట్ పెరుగుతుందని కూడా చెప్పారు.

4 / 5
ఖర్జూరాలు రెగ్యూలర్‌గా తింటే హృదయనాళ వ్యవస్థ పనితీరును మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. సామర్థ్యం, శక్తిని పెంచుతుంది. శ‌రీరంలో వాపులు, నొప్పులు ఉన్న‌వారు ఉద‌యం ఖ‌ర్జూరాల‌ను తిన‌డం వ‌ల్ల ఆయా స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అయితే విరేచ‌నాలు, వాంతులు అవుతున్న వారు ఖ‌ర్జూరాల‌ను తిన‌రాదని నిపుణులు సూచిస్తున్నారు.

5 / 5
Follow us