- Telugu News Photo Gallery Technology photos Noise tie up with Airtel payment bank for contactless payments with smart watch
Smart Watch: స్మార్ట్ వాచ్‌తోనే పేమెంట్స్… నాయిస్‌తో జతకట్టిన ఎయిర్‌టెల్
ప్రస్తుతం లావాదేవీల విధానంలో పూర్తిగా మార్పులు వచ్చాయి. ఆన్‌లైన్ పేమెంట్ విధానం అందుబాటులోకి వచ్చిన తర్వాత కాంటాక్ట్ లెస్ ట్రాన్సాక్షన్స్ భారీగా పెరిగాయి. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఎక్కడైనా పేమెంట్ చేసే వెసులుబాటు అందుబాటులోకి వచ్చేసింది. అయితే స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు, స్మార్ట్ వాచ్‌తో కూడా పేమెంట్స్ చేసే రోజులు వచ్చేశాయ్..
Updated on: Mar 22, 2024 | 8:10 PM

ఇప్పటి వరకు యూపీఐ పేమెంట్స్ అంటే కేవలం స్మార్ట్ ఫోన్‌తో చేసేవాళ్లం. కానీ ఇప్పుడు స్మార్ట్‌వాచ్‌తో చేసేరోజులు వచ్చేశాయ్. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ నాయిస్ కొత్త వాచ్‌లను లాంచ్ చేసింది.

ప్రముఖ పేమెంట్ బ్యాంక్ ఎయిర్‌టెల్, మాస్టర్ కార్డుతో కలిసి కొత్త స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేశారు. కాంటాక్ట్‌లెస్ లావాదేవీలను పెంచడమే లక్ష్యంగా ఈ కొత్త వాచ్‌ను తీసుకొచ్చినందుకు నాయిస్ తెలిపింది.

వాచ్‌తో ట్రాన్సాక్షన్స్ చేయాలనుకునే వారు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా స్మార్ట్‌వాచ్‌ను లింక్ చేసుకోవచ్చు. పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్ వద్ద వాచ్‌ను ట్యాప్ చేస్తే సరిపోతుంది.

ధర విషయానికొస్తే ఈ వాచ్‌ను రూ. 2,999గా నిర్ణయించారు. ఈ విధానంలో రోజుకు రూ. 25,000 వరకు చెల్లింపులు చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.

ఇక స్మార్ట్ వాచ్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో ఎస్‌పీఓ2, ఐపీ68 వాటర్ రెసిస్టెంట్, స్ట్రెస్ మానిటరింగ్ వంటి హెల్త్ ఫీచర్లతో పాటు మరికొన్ని స్టోర్ట్స్ మోడ్స్‌ను అందించారు. ఈ వాచ్‌ను ఒక్కసారి ఫుల్ చార్జ్ చేసే 10 రోజుల పాటు పనిచేస్తుంది.




