Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూపర్‌ అక్కా..! దెబ్బకు ఫ్యాన్ క్లిన్‌ చేయాలనే టెన్షన్‌ పోయిందే..!!ఆన్‌లైన్‌ మార్కెట్లో వెరైటీ వస్తువు..

కొన్నిసార్లు సీలింగ్ ఫ్యాన్లు రోజుల వ్యవధిలోనే చాలా మురికిగా మారిపోతుంటాయి. కర్బన ధూళి మందపాటి పొర వాటిపై పేరుకుపోతుంది. సీలింగ్ ఫ్యాన్‌ను శుభ్రం చేయడం చాలా కష్టమైన పని. పైగా డస్ట్ అలర్జీ వంటి సమస్యలు తీవ్రంగా వేధిస్తాయి. అందుకే చాలా మంది సీలింగ్ ఫ్యాన్ శుభ్రపరచడాన్ని నిర్లక్ష్యం చేస్తారు.

సూపర్‌ అక్కా..! దెబ్బకు ఫ్యాన్ క్లిన్‌ చేయాలనే టెన్షన్‌ పోయిందే..!!ఆన్‌లైన్‌ మార్కెట్లో వెరైటీ వస్తువు..
Fan Cover
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 22, 2024 | 6:34 PM

నేటి ఆధునిక ప్రపంచంలో ఆన్‌లైన్ షాపింగ్ అన్ని మూలాల విస్తరించింది. ప్రస్తుతం ఇంట్లో కూర్చొని ఆర్డర్లు పెట్టి వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. అలాగే, ఈ రోజుల్లో మార్కెట్‌లో అనేక రకాల ఉత్పత్తులు వచ్చాయి. అవి చూడటానికి ఆశ్చర్యంగానూ, కొన్ని సార్లు అరుదైనవిగా కూడా ఉంటాయి. ఇప్పుడు అలాంటిదే ఒక వస్తువులు ఆన్‌లైన్‌ మార్కెట్లో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అది చూసిన నెటిజన్లు సైతం అవాక్కై చూస్తున్నారు. అదేంటంటే.. మీరు కుషన్లు, పరుపులు, ఫ్రిజ్, వాషింగ్‌ మెషీన్‌, బైకులు, కార్లకు సంబంధించిన కవర్లు చూసి ఉంటారు. దుమ్ము, దూళి, ఇతర క్రిముల బారిన పడకుండా ఉండేందుకు ఇలాంటి వస్తువులకు కవర్లు వేస్తుంటాం. అయితే మీరు ఎప్పుడైనా ఫ్యాన్ కవర్ చూసారా? అవును మీరు విన్నది నిజమే.. ఇప్పుడు ఫ్యాన్‌కి కూడా కవర్ వచ్చేసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది.

మీరు వైరల్ వీడియోలో చూడగలిగినట్లుగా ఆన్‌లైన్ షాపింగ్ యాప్ అయిన మీషోలో ఒక యువతి ఈ ఉత్పత్తి గురించి సమాచారం ఇచ్చింది. ఫ్యాన్ డస్ట్ సమస్యలు ప్రతి ఇంట్లో సర్వసాధారణం. ప్రతి సారీ ఎత్తైన టేబుల్‌పైకి ఎక్కి ఫ్యాన్‌ను శుభ్రం చేసుకోవాల్సి వస్తుంది. ఫ్యాన్ క్లిన్ చేయాలంటే.. నిజంగానే చాలా మందికి పెద్ద సమస్యే. కొన్నిసార్లు సీలింగ్ ఫ్యాన్లు రోజుల వ్యవధిలోనే చాలా మురికిగా మారిపోతుంటాయి. కర్బన ధూళి మందపాటి పొర వాటిపై పేరుకుపోతుంది. సీలింగ్ ఫ్యాన్‌ను శుభ్రం చేయడం చాలా కష్టమైన పని. పైగా డస్ట్ అలర్జీ వంటి సమస్యలు తీవ్రంగా వేధిస్తాయి. అందుకే చాలా మంది సీలింగ్ ఫ్యాన్ శుభ్రపరచడాన్ని నిర్లక్ష్యం చేస్తారు.

ఇవి కూడా చదవండి

అయితే, అలాంటివారికి ఇప్పుడు గొప్ప రిలీఫ్‌ లభించింది. ఆన్‌లైన్‌ మార్కెట్లో ఫ్యాన్‌ కు కవర్‌ అందుబాటులోకి వచ్చింది. వీడియోలో చూపిన కవర్ మీ ఫ్యాన్‌పై దుమ్ము దూళిపడకుండా చేస్తుంది. కవర్ మాసిపోయిందని భావించినప్పుడు దానిని తీసి వాష్‌ కుంటే సరిపోతుంది. ఫ్యాన్‌ కవర్ ప్రస్తుతం మీషోలో రూ.200ల లోపుగానే లభిస్తుంది. ఈ కవర్‌ని ఒకసారి ప్రయత్నించండి. దీంతో సీలింగ్ ఫ్యాన్ పై పేరుకుపోయిన మురికి తొలగిపోయి మురికి కింద పడదు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..