AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యప్ప భక్తులు, బ్రహ్మణులు ఉల్లిపాయ, వెల్లుల్లి తినరు..! ఎందుకో కారణం తెలుసా?

ఆయుర్వేదం ప్రకారం, మనం తీసుకునే ఆహారం మొత్తం మూడు భాగాలుగా విభజించారు. అవే సాత్విక, రాజసిక, తామసిక. వీటిలో ఒక్కో కేటగిరీలోని పదార్థాలు మనిషిలోని ఓక్కో గుణాన్ని పెంచడమో, తగ్గించడమో చేస్తాయని చెబుతారు.. ఉల్లిపాయ, వెల్లుల్లి ఇంకా కొన్ని మొక్కలు రాజసిక వర్గానికి చెందినవి. వీటిని తీసుకోవడం వలన అభిరుచి, అజ్ఞానం ఎక్కువగా కలుగుతాయట. అంతే కాకుండా ఉల్లి, వెల్లుల్లి

అయ్యప్ప భక్తులు, బ్రహ్మణులు ఉల్లిపాయ, వెల్లుల్లి తినరు..! ఎందుకో కారణం తెలుసా?
Onions Garlic
Jyothi Gadda
|

Updated on: Mar 22, 2024 | 5:04 PM

Share

కొందరు హిందువులు ఉల్లిపాయలు, వెల్లుల్లి తినరు. బ్రాహ్మణులు, వైష్ణవులు జీవితాంతం వాటికి దూరంగా ఉంటారు. భగవద్గీత, ఇతర హిందూ గ్రంధాలు ఈ ఆహారాలు తినకూడదని చెబుతున్నాయి. ఈ ఆహారాలు యోగులకు, సిద్ధులకు, గురువులకు మంచివి కాదని సూచిస్తున్నాయి. ఉల్లి, వెల్లుల్లి తామస ఆహారాలు. ఇవి మనస్సులో అజ్ఞానాన్ని, అంధకారాన్ని పెంచుతాయని, అవి శృంగార కోరికను పెంచుతాయని చెబుతారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చాలా చేదు, పులుపు, లవణం, వేడి, ఘాటైన, పొడి, మండే ఆహారాన్ని తినకూడదని హెచ్చరించాడు. మితిమీరిన కోరికలతో జీవించే వారికే ఇవి ఆకర్షణీయంగా ఉంటాయని, ఈ కోరికల వల్ల బాధలు, కష్టాలు, అనారోగ్యం కలుగుతాయని శ్రీకృష్ణుడు వివరించాడని చెబుతారు.

ఆయుర్వేదం ప్రకారం, మనం తీసుకునే ఆహారం మొత్తం మూడు భాగాలుగా విభజించారు. అవే సాత్విక, రాజసిక, తామసిక. వీటిలో ఒక్కో కేటగిరీలోని పదార్థాలు మనిషిలోని ఓక్కో గుణాన్ని పెంచడమో, తగ్గించడమో చేస్తాయని చెబుతారు.. ఉల్లిపాయ, వెల్లుల్లి ఇంకా కొన్ని మొక్కలు రాజసిక వర్గానికి చెందినవి. వీటిని తీసుకోవడం వలన అభిరుచి, అజ్ఞానం ఎక్కువగా కలుగుతాయట. అంతే కాకుండా ఉల్లి, వెల్లుల్లి కామాన్ని ప్రేరేపిస్తాయట. వీటితో నీరసం, కోపం, చిరాకు వంటి ప్రతికూల భావోద్వేగాలు పెరుగుతాయంటారు. అందుకే వీటిని రజోగుణి అని కూడా పరిగణిస్తారు. అంటే విపరీతమైన కోరికలను కలిగిస్తాయని అంటారు. నిష్టతో ఉండాలనుకునే వారిని ఇవి డైవర్ట్ చేస్తాయట.. అందుకే ఆహారంలో వాటిని నిషేదించారట.

అంతేకాదు.. ఉల్లిపాయ, వెల్లుల్లిలోని లక్షణాలు మనస్సును చంచలం చేస్తాయని అంటారు. దాంతో వారి మనస్సును ఒకే చోట కేంద్రీకరించలేరు. ఉల్లిపాయ, వెల్లుల్లిని తినడం వల్ల ఇంద్రియ శక్తి మేల్కొలుపు ప్రారంభమవుతుంది. మనస్సు ఆనందం, విలాసాల వైపు పరుగులు తీస్తుందని చెబుతారు. అందుకే ఇప్పటికీ ఉపవాస సమయాల్లో చాలా మంది ఉల్లిపాయ, వెల్లుల్లి లేని వంటకాలను తింటుంటారు. అయ్యప్ప మాల ధరించేవారు కూడా ఉల్లిపాయ, వెల్లుల్లిని వాడరు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..