Crispy corn: రెస్టారంట్ స్టైల్ క్రిస్పీ కార్న్.. ఇంట్లోనే ఇలా చేసుకోండి..
ఇందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోయాలి వేడి చేయాలి. అనంతరం స్వీట్ కార్న్‌ను ఒలిచి ఒక కప్పు మరుగుతోన్న నీటిలో వేయాలి. అయితే కార్న్ మరీ మెత్తగా అవ్వకుండా 80 శాతం మేర మాత్రమే ఉడికేలా చూడాలి. అనంతరం వెంటనే పక్కకు తీసి చల్లటి నీటిలో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కార్న్ మరింత మెత్తగా అవ్వకుండా...
రెస్టారంట్‌లో లభించే క్రిస్పీ కార్న్ భలే ఉంటుంది. ఆరోగ్యంతో పాటు మంచి రుచిని అందించే ఈ స్నాక్ ప్రతీ ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే రెస్టారంట్‌లో తయారు చేసే క్రిస్పీ కార్న్ ఇంట్లో చేసుకునే దాంతో పోల్చితే రుచిగా ఉండదు. అయితే అచ్చంగా రెస్టారంట్‌ను తలిపించేలా క్రిస్పీ కార్న్‌ను ఎలా తయారు చేసుకోవాలి.? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటి.? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు తెలుసుకుందాం..
ఇందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోయాలి వేడి చేయాలి. అనంతరం స్వీట్ కార్న్‌ను ఒలిచి ఒక కప్పు మరుగుతోన్న నీటిలో వేయాలి. అయితే కార్న్ మరీ మెత్తగా అవ్వకుండా 80 శాతం మేర మాత్రమే ఉడికేలా చూడాలి. అనంతరం వెంటనే పక్కకు తీసి చల్లటి నీటిలో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కార్న్ మరింత మెత్తగా అవ్వకుండా ఆగిపోతుంది. అనంతరం కార్న్‌ను ఒక బౌల్‌లో వేసుకొని అందులో కార్న్ ఫ్లోర్, ఉప్పు, బ్లాక్ పెప్పర్‌ను వేసుకొని కలపాలి. అనంతరం కొంత నీరు యాడ్ చేసి బాగా కలుపుకోవాలి.
ఇక చివరిగా ఒక బాండీలో నూనె వేసుకొని వేడి చేయాలి. నూనె వేడెక్కగానే అందులో అంతకు ముందు కలిపి పెట్టుకున్న కార్న్‌ను వేసి గోలించుకొని పక్కన పెట్టాలి. తర్వాత మరో బౌల్‌ను తీసుకొని కొంత నూనె వేసుకోవాలి, నూనె వేడెక్కగానే కొంత అల్లం ముక్కలు, చిన్నచిన్నగా తరిమిన పచ్చి మిర్చి, తురిమిన ఉల్లిపాయ వేసుకొని కలుపుకోవాలి. అనంతరం అంతకు ముందు పక్కన పెట్టిన కార్న్‌ను వేసుకోవాలి. ఇక చివరిగా బ్లాక్ పెప్పర్ పౌడర్, చిల్లి ఫ్లేక్స్, వైట్ పెప్పర్ పౌడర్, సరిపడ ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే ఎంతో క్రిస్పిగా, రుచిగా ఉండే స్వీట్ కార్న్ రడీ అయినట్లే.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..