Black Tea For Hair: అందమైన, ఆరోగ్యకరమైన హెయిర్ కోసం బ్లాక్ టీ..! ఇలా వాడితే తెల్ల జుట్టు నల్లగా మారడం గ్యారెంటీ..!!
ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా గ్రే హెయిర్‌ని నల్లగా మార్చుకోవాలంటే సహజసిద్ధమైన పదార్థాలనే వాడాలి. తెల్ల జుట్టును నేచురల్ గా డార్క్ చేయడానికి టీ పొడిని ఇలా వాడుకోవచ్చు. తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చేందుకు టీ ఆకుల వాడకం చాలా మేలు చేస్తుంది. బ్లాక్ టీతో మీ జుట్టు అందంగా, ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. ఇంతకీ ఈ బ్లాక్ టీని హెయిర్‌కు ఎలా ఉపయోగించాలి? దాని ద్వారా జుట్టుకు కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ఈ రోజుల్లో నెరిసిన జుట్టు సమస్య సర్వసాధారణం. చెడు ఆహారపు అలవాట్లు, కాలుష్యం, అస్తవ్యస్థ జీవనశైలి కారణంగా చిన్న వయస్సులోనే జుట్టు తెల్లగా మారుతుంది. తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చేందుకు చాలా మంది డై, హెయిర్ కలర్ లాంటివి వాడుతుంటారు. అయితే, వాటిలో హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఇది జుట్టును పాడు చేస్తుంది. జుట్టు రాలిపోయే సమస్య కూడా మరింత తీవ్రం అవుతుంది. అయితే బ్లాక్ టీతో హెయిర్ ప్రాబ్లమ్స్కుఈజీగా చెక్ పెట్టొచ్చని మీకు తెలుసా? బ్లాక్ టీతో మీ జుట్టు అందంగా, ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. ఇంతకీ ఈ బ్లాక్ టీని హెయిర్‌కు ఎలా ఉపయోగించాలి? దాని ద్వారా జుట్టుకు కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా గ్రే హెయిర్‌ని నల్లగా మార్చుకోవాలంటే సహజసిద్ధమైన పదార్థాలనే వాడాలి. తెల్ల జుట్టును నేచురల్ గా డార్క్ చేయడానికి టీ పొడిని ఇలా వాడుకోవచ్చు. టానిక్ యాసిడ్ టీ ఆకులలో కనిపిస్తుంది. తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చేందుకు ఇది పనిచేస్తుంది. దీనిని ఉపయోగించడం వల్ల జుట్టు మృదువుగా, మెరిసేలా చేస్తుంది. తెల్ల జుట్టు నల్లగా మారాలంటే బ్లాక్ టీ మీ హెయిర్ కి బాగా అప్లై చేయండి.. దీని కోసం, 2 కప్పుల నీటిని తీసుకొని అందులో 4-5 స్పూన్ల టీ పొడిని కలపండి. ఇప్పుడు ఈ నీటిని బాగా మరిగించాలి. ఈ నీటిని మీ జుట్టుకు పట్టించి 30 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత, సాధారణ నీటితో జుట్టును శుభ్రం చేయండి.
తెల్ల జుట్టు నల్లగా మారాలంటే బ్లాక్ టీని కాఫీతో కలిపి ఉపయోగించవచ్చు. ఇందుకోసం 2 కప్పుల నీళ్లు తీసుకుని అందులో 4 చెంచాల టీ పొడి, 2-3 చెంచాల కాఫీ పొడి వేసి బాగా మరిగించాలి. ఈ నీరు చల్లబడిన తర్వాత, బ్రష్ సహాయంతో మీ జుట్టుకు అప్లై చేయండి. సుమారు 1 గంట పాటు జుట్టు మీద ఉంచండి. తర్వాత జుట్టును నీటితో కడగాలి. తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చడానికి, బ్లాక్ టీ, ఓమ గింజలను ఉపయోగించవచ్చు. దీని కోసం, 2 గ్లాసుల నీటిని వేడి చేయండి. దానికి 2 చెంచాల టీ పొడి, 2 చెంచాల ఓమక్కలు వేసి బాగా మరిగించాలి. ఈ నీళ్లలో 2 చెంచాల హెన్నా పౌడర్ వేసి బాగా కలపాలి.ఇప్పుడు దీన్ని మీ జుట్టుకు అప్లై చేసి సుమారు గంటసేపు అలాగే ఉంచాలి.తర్వాత మీ జుట్టును నీళ్లతో కడగాలి. తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చేందుకు టీ ఆకుల వాడకం చాలా మేలు చేస్తుంది. కానీ మీకు దీనితో ఏదైనా సమస్య ఉంటే, నిపుణుడిని సంప్రదించండి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..