Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Loan Interest Rates: కస్టమర్లకు ఆ బ్యాంకు శుభవార్త.. ఆ రెండు రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు

ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న ఖర్చులు అవసరాల నేపథ్యంలో అప్పు తీసుకోవడం అనేది పరిపాటిగా మారింది. అయితే బ్యాంకులు తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు తక్కువ వడ్డీ రేట్లతో రుణాలన అందిస్తున్నాయి. తాజాగా ప్రముఖ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంకు ఆర్‌బీఐ రెపో రేటుపై నిర్ణయం తీసుకున్న తర్వాత కార్లు, హోమ్ లోన్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పీఎన్‌బీ వడ్డీ రేట్ల గురించి కీలక విషయాలను తెలుసుకుందాం.

Loan Interest Rates: కస్టమర్లకు ఆ బ్యాంకు శుభవార్త.. ఆ రెండు రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు
Money
Follow us
Srinu

|

Updated on: Jun 08, 2025 | 4:30 PM

భారతదేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ రుణగ్రహీతలకు ఉపశమనం కల్పిస్తూ కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తన రుణ రేట్లలో గణనీయమైన తగ్గింపును ప్రకటించింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇటీవల రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన తర్వాత బ్యాంక్ తన రెపో లింక్డ్ లెండింగ్ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్)ను 50 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) తగ్గించింది. ఈ ఇటీవల తగ్గింపుతో రెపో రేటు ఆర్‌బీఐ బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటు ఇప్పుడు 5.50 శాతంగా ఉంది. గతంలో ఇది 6 శాతంగా ఉండేది. కరోనా మహమ్మారి తర్వాత ఆర్‌బీఐ సవరించిన మూడో వడ్డీ రేటు ఇది. మే 2020, ఏప్రిల్ 2022 మధ్య ఆర్‌బీఐ రెపో రేటును 4 శాతం వద్ద స్థిరంగా ఉంచింది. పీఎన్‌బీ ప్రకటించిన తగ్గింపు వడ్డీ రేట్లు జూన్ 9, 2025 నుంచి అమల్లోకి వస్తాయి. పీఎన్‌బీ తీసుకున్న నిర్ణయం కారణంగా ఈఎంఐలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. 

వడ్డీ రేట్ల తగ్గింపు పీఎన్‌బీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. సంవత్సరానికి 7.45 శాతం నుండి ప్రారంభమయ్యే గృహ రుణాలు, సంవత్సరానికి 7.80 శాతం నుంచి ప్రారంభమయ్యే వాహన రుణాలు వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. తక్కువ రుణ రేట్లు అంటే క్రెడిట్‌కు చౌకైన ప్రాప్యత, వినియోగదారులు రుణ వ్యవధిలో వడ్డీ చెల్లింపులపై ఎక్కువ ఆదా చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఆర్ఎల్ఎల్ఆర్‌తో అనుసంధానించిన ఇప్పటికే ఉన్న రుణాలు ఉన్న రుణగ్రహీతలు రాబోయే బిల్లింగ్ సైకిల్‌లో వారి ఈఎంఐలను ఆటోమెటిక్‌గా తగ్గుతాయి. అయితే కొత్త రుణగ్రహీతలు ఇప్పుడు గణనీయంగా తక్కువ రేటుకు రుణాలు పొందవచ్చు. ఈ రేటు తగ్గింపు ముఖ్యంగా గృహ కొనుగోలుదారులు, కారు లోన్ల దరఖాస్తుదారులు, సంస్థాగత ఫైనాన్స్‌పై ఆధారపడే చిన్న వ్యాపార యజమానులకు ప్రయోజనకరంగా ఉంటుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి