Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI New Rules: డెబిట్, క్రెడిట్ కార్డ్ ఉపయోగంపై అక్టోబర్‌ 1 నుంచి ఆర్బీఐ కొత్త నిబంధనలు..

RBI New Rules: బ్యాంకింగ్‌ రంగంలోగానీ, ఇతర ఆన్‌లైన్‌ లావాదేవీల విషయంలోగానీ కొత్త కొత్త నిబంధనలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోవడంతో..

RBI New Rules: డెబిట్, క్రెడిట్ కార్డ్ ఉపయోగంపై అక్టోబర్‌ 1 నుంచి ఆర్బీఐ కొత్త నిబంధనలు..
Reserve Bank Of India
Follow us
Subhash Goud

|

Updated on: Sep 27, 2022 | 8:19 AM

RBI New Rules: బ్యాంకింగ్‌ రంగంలోగానీ, ఇతర ఆన్‌లైన్‌ లావాదేవీల విషయంలోగానీ కొత్త కొత్త నిబంధనలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోవడంతో ఆన్‌లైన్‌ షాపింగ్స్‌, వివిధ రకాల యాప్స్‌ ద్వారా లావాదేవీలు భారీగా పెరిగిపోయాయి. ఏ చిన్న పని కోసం కూడా ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లింపులు జరుపుతున్నారు. ఇందులో భాగంగా మోసాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆన్‌లైన్‌ చెల్లింపుల వల్లే ఎంతో మంది మోసాలకు గురవుతున్నారు. ఇలాంటి మోసాలను గురించిన, ఆర్బీఐ నిబంధనలలో మార్పులు తీసుకువస్తోంది. తాజగా అక్టోబర్‌ 1 నుంచి కొత్త నిబంధనలను అందుబాటులోకి తీసుకురాబోతోంది.

ఈ పండుగ సీజన్‌లో మీరు ఆన్‌లైన్ షాపింగ్ కోసం ప్లాన్ చేస్తుంటే, అలాగే చెల్లింపు కోసం డెబిట్ లేదా క్రెడిట్‌ని ఉపయోగించబోతున్నట్లయితే అక్టోబర్ 1 నుండి కొత్త విధానం అందుబాటులోకి రాబోతోంది. డెబిట్/క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే విధానం మారబోతోందని గుర్తుంచుకోండి. వీటిని గమనించకుంటే మీ చెల్లింపు నిలిచిపోవచ్చు. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి ఆన్‌లైన్, పిఓఎస్, యాప్ లావాదేవీలలో క్రెడిట్, డెబిట్ కార్డ్ డేటా మొత్తాన్ని టోకెన్‌లుగా మార్చడాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (RBI) తప్పనిసరి చేసింది. ఇంతకుముందు ఈ గడువు జూలై అయితే దానిని 3 నెలలు పొడిగించారు. ఇప్పుడు అక్టోబర్ 1 నుంచి నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

ఇంతకీ కార్డ్ టోకనైజేషన్ అంటే ఏమిటి?

ఇవి కూడా చదవండి

ఇంతకు ముందు కస్టమర్ తన క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్ వివరాలను చెల్లింపు కోసం ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌తో పంచుకోవాలసి ఉండేది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు ఈ సమాచారాన్ని తమ వద్ద సురక్షితంగా ఉంచడానికి, తదుపరి ఏదైనా లావాదేవీ కోసం ఈ సమాచారాన్ని ఉపయోగించేందుకు ఉపయోగించబడతాయి. దీంతో సమాచారం చోరీకి గురయ్యే ప్రమాదం ఉంది. దీన్ని నివారించేందుకు రిజర్వ్ బ్యాంక్ టోకనైజేషన్ నిబంధనను రూపొందించింది. వాస్తవానికి మీ క్రెడిట్, డెబిట్ కార్డ్ వివరాలకు బదులుగా టోకెన్ జారీ చేయబడుతుంది. మీరు ఆన్‌లైన్ చెల్లింపు చేసినప్పుడు వ్యాపారి ఈ టోకెన్ నంబర్‌ను మాత్రమే పొందుతారు. క్రెడిట్, డెబిట్ కార్డ్ సమాచారాన్ని పొందలేరు. నిబంధనల ప్రకారం.. ప్రతి లావాదేవీకి కోడ్ లేదా టోకెన్ నంబర్ భిన్నంగా ఉంటుంది. చెల్లింపు కోసం మీరు ఈ కోడ్ లేదా టోకెన్ నంబర్‌ను ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌తో షేర్ చేయాలి. టోకనైజేషన్ కస్టమర్ల సమాచారాన్ని మరింత సురక్షితంగా చేస్తుంది. వారితో జరిగే మోసాల సంఘటనలు అరికట్టబడతాయి.

క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను టోకెన్‌లుగా మార్చడం ఎలా?

☛ ముందుగా ఏదైనా ఇ-కామర్స్ వెబ్‌సైట్ లేదా యాప్‌లో షాపింగ్ చేసి చెల్లింపు ప్రక్రియను ప్రారంభించండి.

☛ చెల్లింపు చేయడానికి మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ సమాచారాన్ని నమోదు చేయండి.

☛ చెల్లింపు చేయడానికి ముందు ‘RBI గైడ్‌లైన్స్ ఆన్ టోకనైజ్ యువర్ కార్డ్ ఎడ్జ్’ ఆప్షన్‌ను ఎంచుకోండి.

☛ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి.

☛ మీరు OTPని నమోదు చేసిన వెంటనే మీ టోకెన్ జనరేట్ చేయబడుతుంది. ఇప్పుడు మీ కార్డ్‌కు బదులుగా ఈ టోకెన్ ఈ ప్లాట్‌ఫారమ్‌లో సేవ్ చేయబడుతుంది.

ఇలా రకరకాల కొత్త నిబంధనలు అందుబాటులోకి తీసుకువస్తోంది రిజర్వ్‌ బ్యాంక్‌. ఖాతాదారుల వివరాలను హ్యాక్‌ చేసి పూర్తి వివరాలను తెలుసుకుంటున్నారు హ్యాకర్లు. దీంతో సైబర్‌ నేరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టేందుకు ఆర్బీఐ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనలు ఇప్పటికే అమల్లోకి వచ్చే అవకాశం ఉండగా, దానిని ఆర్బీఐ పొడిగిస్తూ వచ్చింది. ఇప్పుడు అక్టోబర్‌ 1 తర్వాత ఎలాంటి పొడిగింపులు ఉండకపోవచ్చని బ్యాంకు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి