RBI Penalty: మరో బ్యాంకుకు షాకిచ్చిన సెంట్రల్‌ బ్యాంక్‌.. రూ.50 లక్షల జరిమానా.. ఎందుకంటే..

RBI Penalty: బ్యాంక్ కస్టమర్ల సంక్షేమం కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. ఇటీవల చాలా బ్యాంకులపై ఆర్బీఐ ఇలాంటి చర్యలు..

RBI Penalty: మరో బ్యాంకుకు షాకిచ్చిన సెంట్రల్‌ బ్యాంక్‌.. రూ.50 లక్షల జరిమానా.. ఎందుకంటే..
Reserve Bank of India
Follow us

|

Updated on: Sep 27, 2022 | 9:07 AM

RBI Penalty: బ్యాంక్ కస్టమర్ల సంక్షేమం కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. ఇటీవల చాలా బ్యాంకులపై ఆర్బీఐ ఇలాంటి చర్యలు చేపట్టింది. నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్న బ్యాంకులపై భారీ జరిమానా విధించడంతో పాటు లైసెన్స్‌లు సైతం రద్దు చేసింది ఆర్బీఐ. తాజాగా మరోసారి సెంట్రల్ బ్యాంక్ కఠిన చర్యలు తీసుకుంది. నిబంధనలను పాటించనందుకు జలగావ్ పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌పై రూ.50 లక్షల జరిమానా విధించింది.

మార్చి 31, 2020 నాటి ఆర్థిక స్థితి ఆధారంగా మహారాష్ట్రలో ఉన్న ఈ బ్యాంక్‌ ఆర్‌బీఐకి తెలియజేయకుండానే ఖాతాదారులకు జరిమానా విధించింది. నిర్దేశించిన నిబంధనల ప్రకారం సహకార బ్యాంకు నిర్దిష్ట ఖాతాలను నిరర్థక ఆస్తులుగా (NPAs) వర్గీకరించలేదు. దీంతో పాటు ఖాతాదారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సేవింగ్స్ బ్యాంకు ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయనందుకు జరిమానా విధించారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను అండమాన్ అండ్ నికోబార్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌కు రూ. 5 లక్షల జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది . అండమాన్, నికోబార్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ దాని డైరెక్టర్లకు హామీ లేని రుణాలను మంజూరు చేసింది. అందుకే దీనిపై చర్యలు తీసుకున్నారు.

కొన్ని నిబంధనలను ఉల్లంఘించినందుకు ఇతర తొమ్మిది సహకార బ్యాంకులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆప్‌ ఇండియా జరిమానా విధించింది. ఈ చర్య రెగ్యులేటరీ సమ్మతిలో లోపాలపై ఆధారపడి ఉందని, అలాగే బ్యాంక్ తన కస్టమర్లతో చేసుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం చెల్లుబాటును ప్రశ్నించడానికి ఉద్దేశించినది కాదని RBI తెలిపింది.

ఇవి కూడా చదవండి

కాగా, ఇటీవల మహారాష్ట్రకు చెందిన లక్ష్మీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్‌ను రద్దు చేసింది. షోలాపూర్‌లో ఉన్న ఈ సహకార బ్యాంకుకు తగినంత మూలధనం లేదు. సంపాదించే మార్గం లేదు. లక్ష్మీ సహకరి బ్యాంకు నిబంధనలను సరిగా పాటించలేదని ఆర్‌బీఐ పేర్కొంది. దీంతో బ్యాంకు లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సహకార బ్యాంకులో ఖాతాదారులు డిపాజిట్‌ చేసిన తమ డబ్బు ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బ్యాంకుపై చర్య అనంతరం ఆర్‌బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. మహారాష్ట్రలోని షోలాపూర్‌లో ఉన్న లక్ష్మీ సహకారి బ్యాంక్ లిమిటెడ్ బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగించకుండా నిషేధించబడింది. లక్ష్మీ సహకారి బ్యాంక్‌పై బ్యాంకింగ్ చట్టం, 1949 ప్రకారం తక్షణమే అమలులోకి వచ్చేలా చర్య తీసుకోబడింది. లక్ష్మీ సహకారి బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసిన ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ కస్టమర్ల మూలధనం ప్రభుత్వం నిర్వహించే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) కింద రక్షణ ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. ఈ పథకం కింద లక్ష్మీ సహకరి బ్యాంక్ ఖాతాదారులకు రూ.5 లక్షల వరకు తిరిగి ఇవ్వబడుతుంది. ఏదైనా ప్రైవేట్, వాణిజ్య లేదా సహకార బ్యాంకు రద్దు అయితే ఖాతాదారుల డబ్బును సురక్షితంగా ఉంచడానికి ఈ హామీ పథకం ఇటీవలి సంవత్సరంలో ప్రారంభించబడింది. అయితే ఇందులో రూ.5 లక్షల వరకు గ్యారెంటీ ఉంది. లక్ష్మీ సహకారి బ్యాంక్‌లో 90 శాతం మంది ఖాతాదారులు రూ. 5 లక్షల వరకు తిరిగి పొందనున్నారు.

కస్టమర్ల డబ్బును ఎలా లెక్కిస్తారు..?

డిఐసిజిసి చట్టం ప్రకారం.. కస్టమర్లు బ్యాంకులో డిపాజిట్‌ చేసిన డబ్బును లెక్కిస్తారు. వారి ఎలాంటి అన్యాయం జరుగకుండా వారి డబ్బును ఇచ్చేస్తుంది. అసలు, వడ్డీ మొత్తాన్ని కలిపి కస్టమర్‌కు రూ.5 లక్షల వరకు ఇవ్వబడుతుంది. ఉదాహరణకు ఒక బ్యాంకు ఖాతాదారుడు తన అకౌంట్లో రూ.4,95,000 మొత్తం ఉందనుకోండి.. అతనికి రూ. 4,000 వడ్డీని వస్తే అప్పుడు బ్యాంకు ఖాతాదారుడికి రూ. 4,99,000 చెల్లిస్తుంది. కస్టమర్ గరిష్టంగా రూ. 5 లక్షలు పొందేందుకు హామీ ఇవ్వబడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎన్నికల వేళ రిజర్వేషన్ల రగడ.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‎గా రాజకీయం
ఎన్నికల వేళ రిజర్వేషన్ల రగడ.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‎గా రాజకీయం
ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..
ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా
బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా
లోక్ సభ ఎన్నికల శంఖారావం పూరించిన బీజేపీ.. మోదీ సభలు ఎక్కడంటే..
లోక్ సభ ఎన్నికల శంఖారావం పూరించిన బీజేపీ.. మోదీ సభలు ఎక్కడంటే..
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..
టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..
ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం
ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!