5G Services: భారత్‌లో 5జీ సేవలు ప్రారంభమవుతోన్న వేళ.. ఈ డౌట్స్‌ క్లియర్‌ చేసుకోండి..

5G Services: భారతీయులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న 5జీ సేవలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. అక్టోబర్‌ 1 నుంచి దేశంలో పలు నగరాల్లో 5జీ సేవలు ప్రారంభకానున్న విషయం తెలిసిందే...

5G Services: భారత్‌లో 5జీ సేవలు ప్రారంభమవుతోన్న వేళ.. ఈ డౌట్స్‌ క్లియర్‌ చేసుకోండి..
5g Services In India
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 26, 2022 | 7:54 PM

5G Services: భారతీయులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న 5జీ సేవలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. అక్టోబర్‌ 1 నుంచి దేశంలో పలు నగరాల్లో 5జీ సేవలు ప్రారంభకానున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 1 నుంచి ఢిల్లీలో జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 5జీ సేవలను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు కేంద్ర టెలికాం శాఖ మంత్రి ఇటీవలే ప్రకటించారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ లేదా బెంగళూరుల్లో 5జీ సేవలు రానున్నాయి.

జియో, ఎయిర్ టెల్ ఈ సేవలను వెంటనే ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వోడాఫోన్ ఐడియా (వి) కి మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. మొదట మెట్రో నగరాల్లో ఈ సేవలు ప్రారంభంకానున్నాయి. అయితే 5జీ సేవలు అందుబాటులోకి వస్తోన్న తరుణంలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 5జీ సేవలు అవసరమా.? కొత్త ఫోన్‌ కొనలా.? కొంటే ఏ అంశాలను చూడాలి.? ఇలా ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలు కావాలంటే ఈ స్టోరీపై ఓ లుక్కేయ్యాల్సిందే..

5జీ సేవలు అవసరమా.?

మారుతోన్న జీవనశైలి ఆధారంగా ప్రతీది అప్‌డేట్‌ అవుతోన్న రోజులివీ. ఈ క్రమంలో నెట్‌వర్క్‌ కూడా అప్‌డేట్‌ చేసుకోవాల్సిందే. హై స్పీడ్‌ ఇంటర్‌నెట్‌ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అందులో కొన్ని.. ఎలాంటి బఫరింగ్ లేకుండా హై-క్వాలిటీ వీడియోలను స్ట్రీమ్ చేస్తుంది. అతి తక్కువ లాటెన్సీ (స్పందించే సమయం) తో హై – గ్రాఫిక్స్ గేమ్స్ ను ప్లే చేస్తుంది. మీ కనెక్షన్ స్లో అవుతుందేమో అన్న బాధ లేకుండా పలు ఉప కరణాలను ఉపయోగించవచ్చు. హై డెఫినిషన్ వీడియో స్ట్రీమింగ్, మొబైల్ గేమింగ్, వీడియో కాల్స్ వంటి సేవలకు అంతరాయం లేని యా క్సెస్ ను పొందేందుకు అవసరమైన బ్యాండ్ విడ్త్, లాటెన్సీని 5జి అందిస్తుంది. ప్రస్తుతం 4జీ కంటే కూడా 5జీ వేగం 7 నుంచి 10 రెట్లు అధికంగా ఉండనుంది అని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

5జీ ఫోన్లలో ఉన్న ఆప్షన్లు..

దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తోన్న తరుణంలో ఇప్పటికే చాలా కంపెనీలు 5జీ ఆధారిత ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా యాపిల్ ఐఫోన్లు, సామ్ సంగ్, షావోమి, పోకో, రియల్ మి, వివో వంటి బ్రాండ్లు 5జి స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఉన్నాయి. 5జీ చిప్ సెట్ తయారీ సంస్థలైన మీడియా టెక్, క్వాల్ కమ్ వంటి వాటితో వ్యూహా త్మక ఒప్పందాలతో ఓఈఎంలు చాలా తక్కువ ధరకే అంటే రూ. 15,000లకే 5జి స్మార్ట్ ఫోన్లను అందించ గలుగుతున్నాయి. ఇక రియల్‌మీ వంటి సంస్థలు రూ. 10,000 లోపు 5జీ ఫోన్‌లను తీసుకొస్తున్నట్లు ప్రకటించాయి. వినియోగదారులు కొత్త ఫోన్‌ కొనే ముందు ర్యామ్‌, స్టోరేజీలను తమ అవసరాలను బేరీజు వేసుకొని కొనుగోలు చేస్తే బెటర్‌.

కొత్త ఫోన్‌ కొనే ముందు ఈ అంశాలు చూడాలి..

కొత్త ఫోన్ కొనేటప్పుడు 5జీ తో పాటు మరెన్నో ఇతర అంశాలకూ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. 5జీ బ్యాండ్స్‌కు మీ ఫోన్‌ సపోర్ట్‌ చేస్తుందో చెక్‌ చేసుకోవాలి. లో – బ్యాండ్, మిడ్ -బ్యాండ్, హై- బ్యాండ్. లో-బ్యాండ్ అనేది 700MHz స్పెక్ట్రమ్ ను కలిగిఉంటుంది. దీన్నే n28గా కూడా వ్యవహరిస్తారు. మిడ్ బ్యాండ్ అనేది 3500MHz ను కలిగి ఉంటుంది. దీన్నే n78 అని వ్యవహరిస్తారు. దాదాపుగా ప్రతీ 5జి ఫోన్ కూడా n78 ను సపోర్ట్ చేస్తుంది. కానీ బాగా ఖరీదైన ఫోన్లలోనే n28ను మీరు గుర్తించే అవకాశం ఉంది. ఎందుకంటే 700MHz అనేది స్టాండ్ అలోన్ 5జి సేవలకు ఉద్దేశించింది. రిలయన్స్ జియో ఒక్కటి మాత్రమే దీన్ని అందించగలదు. హై-బ్యాండ్ అనేది 26GHz స్పెక్ట్రమ్ ను కలిగిఉంటుంది.

5జీ ఫోన్‌లో 4జీ సిమ్ కార్డ్ పని చేస్తుందా.?

5జీ స్మార్ట్‌ఫోన్‌లో మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న 4జీ సిమ్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇంటర్నెట్ కనెక్టివిటీ, SMS, వాయిస్ కాలింగ్ వంటి 4జీ, 5జీ సేవలను పొందొచ్చు. భారతీయ టెలికాంలు NSA 5జీ సాంకేతికతను అవలంబించడంతో, వారి ప్రస్తుత 4జీ సిమ్ కార్డ్ Rel 99+ ప్రమాణానికి మద్దతు ఇస్తుంది.

మరిన్ని టెక్నాలజీ  వార్తల కోసం క్లిక్ చేయండి..