Smart Phone: మీరు కొనుగోలు చేసిన ఫోన్‌ నిజంగానే కొత్తదా.. లేదా రిఫర్బిష్డా .? ఇలా తెలుసుకోండి..

Smart Phone: ప్రస్తుతం పండుగ సీజన్‌ నడుస్తోంది. దసరా, దీపావళి సమీపిస్తున్న వేళ చాలా మంది కొత్త ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆన్‌లైన్‌ షాపింగ్ సైట్స్‌ కూడా...

Smart Phone: మీరు కొనుగోలు చేసిన ఫోన్‌ నిజంగానే కొత్తదా.. లేదా రిఫర్బిష్డా .? ఇలా తెలుసుకోండి..
Smart Phone Tricks
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 26, 2022 | 3:30 PM

Smart Phone: ప్రస్తుతం పండుగ సీజన్‌ నడుస్తోంది. దసరా, దీపావళి సమీపిస్తున్న వేళ చాలా మంది కొత్త ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆన్‌లైన్‌ షాపింగ్ సైట్స్‌ కూడా భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్‌లపై మునుపెన్నడూ లేని ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు మనం కొనుగోలు చేసిన ఫోన్‌ కొత్తదేనా.? లేదా పాత ఫోన్‌ను రిఫర్బిష్‌డ్‌ చేసి విక్రయించారా.? అన్న అనుమానాలు ఒక్కసారైనా వచ్చే ఉంటాయి. అయితే మీరు కొనుగోలు చేసిన ఫోన్‌ నిజంగానే కొత్తగా కాదా అన్న విషయం తెలుసుకోవడానికి కొన్ని సింపుల్‌ ట్రిక్స్‌ ఉంటాయి. వాటి ద్వారా మీ ఫోన్‌ స్టేటస్‌ ఏంటో ఇట్టే తెలుసుకోవచ్చు..

ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం..

* ఆండ్రాయిడ్‌ యూజర్ల ముందుగా తమ కొత్త ఫోన్‌ను ఆన్‌ చేసిన వెంటనే.. డైలర్‌ ప్యాడ్‌లో ‘*#06# ’ అని టైప్‌‌ చేయాలి. ఇలా చేయగానే మీ ఐఎంఇఐ నెంబర్‌, మోడల్‌ నెంబర్స్‌ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. సదరు నెంబర్‌, మీ ఫోన్‌ బాక్స్‌ మీద ఉన్న నెంబర్లు ఒకటేనే కాదా చూసుకోవాలి. ఆ రెండు నెంబర్లు ఒకేటే అయితే అది కొత్త ఫోన్‌ అని కాన్ఫామ్‌ చేసుకోవచ్చు. అలా కాకుండా వేరువేరుగా ఉంటే మాత్రం పాత ఫోన్‌ అని అర్థం.

* ఇక ఇందుకోసం మరో ట్రిక్‌ కూడా అందుబాటులో ఉంది.. ఇందుకోసం ముందుగా డైలర్‌ ప్యాడ్‌లో ‘*#*#4636#*#*’ అని, లేదా *#*#0000#*#* అని టైప్‌ చేయాలి. ఒకవేళ సిమ్‌‌ స్టేటస్‌‌ ‘నన్‌‌’ అని చూపిస్తే అది ఒరిజినల్ మొబైల్‌‌ అని గుర్తించాలి.

ఇవి కూడా చదవండి

* ఇక మూడో ట్రిక్‌.. ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అనంతరం ‘అబౌట్‌‌ ఫోన్‌‌’లోకి వెళ్లి ఫోన్‌‌ స్టేటస్ ఓపెన్‌‌ చేయాలి. అందులో సిమ్‌‌ స్టేటస్‌‌ లేదా ఐఎంఇఐ ఇన్ఫర్మేషన్‌‌ ఆప్షన్స్ ఓపెన్ చేయాలి. ఐఎంఇఐ ఇన్ఫర్మేషన్‌‌లో సిమ్‌‌ స్లాట్స్‌‌లో ‘00’ ఉంటే అది కొత్త ఫోన్. వేరే ఏవైనా నెంబర్స్‌‌ ఉంటే అది వాడిన ఫోన్ అని గుర్తించాలి.

యాపిల్‌ యూజర్లు ఇలా తెలుసుకోవచ్చు..

యాపిల్‌ యూజర్లు తమ ఫోన్‌ కొత్తతో కాదో తెలుసుకోవాలంటే ముందుగా సెట్టింగ్స్‌‌ ఓపెన్‌‌ చేసి జనరల్‌‌లోకి వెళ్లాలి. అనంతరం అబౌట్‌‌ఫోన్​ క్లిక్ చేస్తే ఫోన్‌ వివరాలు వస్తాయి. అందులో మోడల్‌ నెంబర్‌ ‘M’ అనే లెటర్‌తో మొదలైతే అది ఒరిజినల్‌ ఫోణ్‌ అయిన, ‘ఎఫ్‌’తో మొదలైతే రిఫర్బిష్డ్‌ అని, ‘N’ ఉంటే ఫోన్‌ను సాఫ్ట్‌వేర్‌ ప్రాబ్లమ్స్‌తో రిటర్న్‌ చేశారని, ‘P’ తో మొదలైతే డ్యామేజ్డ్‌ ఫోన్‌ అర్థం. మరెందుకు ఆలస్యం ఈ పండగ వేళ మీరు కొనుగోలు చేసిన ఫోన్‌ నిజంగా కొత్తదేనా ఇలా సింపుల్‌ ట్రిక్స్‌తో తెలుసుకోండి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఓరుగల్లు గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శపథం..!
ఓరుగల్లు గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శపథం..!
కుంభకర్ణుడిది అతి నిద్ర కాదట! పురాణ కథపై కొత్త ట్విస్ట్!
కుంభకర్ణుడిది అతి నిద్ర కాదట! పురాణ కథపై కొత్త ట్విస్ట్!
ఓట్లు వేయమని ఎంపీ ముఖం మీదే చెప్పిన మహిళ ..!
ఓట్లు వేయమని ఎంపీ ముఖం మీదే చెప్పిన మహిళ ..!
కాలరెగరేస్తున్న డాలర్.. మరి రూపాయి పరిస్థితి ఏంటి.?
కాలరెగరేస్తున్న డాలర్.. మరి రూపాయి పరిస్థితి ఏంటి.?
ఆమె మళ్లీ వచ్చింది .. పార్లమెంట్‌ దద్దరిల్లింది.! ఎంపీ డాన్స్
ఆమె మళ్లీ వచ్చింది .. పార్లమెంట్‌ దద్దరిల్లింది.! ఎంపీ డాన్స్
నిద్ర లేవగానే సెల్‌ఫోన్‌ చూస్తున్నారా.? నిపుణులు చెప్పినవి వింటే
నిద్ర లేవగానే సెల్‌ఫోన్‌ చూస్తున్నారా.? నిపుణులు చెప్పినవి వింటే
ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా.? మూసిన బంగారు గనిలో చిక్కు
ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా.? మూసిన బంగారు గనిలో చిక్కు
శివుడు కనిపిస్తాడని వెళ్తే.. ఎలుగుబంట్లు భయపెట్టాయి.! వీడియో..
శివుడు కనిపిస్తాడని వెళ్తే.. ఎలుగుబంట్లు భయపెట్టాయి.! వీడియో..
ఆ పులి.. ఈ పులేనా.? వైరల్‌ అవుతున్న పెద్దపులి వీడియో..
ఆ పులి.. ఈ పులేనా.? వైరల్‌ అవుతున్న పెద్దపులి వీడియో..
మంచుకొండపై మండుతున్న లావా.! ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్లాస్ట్!
మంచుకొండపై మండుతున్న లావా.! ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్లాస్ట్!