Instagram: సోషల్ మీడియాలో న్యూడ్ ఫొటోలు షేర్‌చేసే వారి ఆటలు ఇక సాగవు.. కొత్త ఫీచర్ తీసుకొస్తున్న ఇన్‌స్టా..
Instagram: సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చిన తర్వాత సమాచారం మార్పిడిలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ప్రపంచంలో ఎక్కడో ఉన్న వారు మరెక్కడో ఉన్న వారితో ఆడియో, వీడియో కాల్స్...
Instagram: సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చిన తర్వాత సమాచారం మార్పిడిలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ప్రపంచంలో ఎక్కడో ఉన్న వారు మరెక్కడో ఉన్న వారితో ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడుకునే రోజులు వచ్చాయి. ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకునే వెసులుబాటు వచ్చింది. అయితే ఇదే సమయంలో సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్న వారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరిగిపోతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాను వాడుకుంటూ కొందరు పోకిరీలు మహిళలను టార్గెట్ చేస్తున్నారు. మహిళలకు అసభ్యకర మెసేజ్‌లు, ఫొటోలు పంపిస్తూ ఆన్‌లైన్ వేధింపులకు దిగుతున్నారు.
ఇందులో భాగంగానే అశ్లీల, న్యూడ్ ఫొటోలను షేర్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం.. ఇన్‌స్టాగ్రామ్ రంగంలోకి దిగింది. ఆన్‌లైన్‌లో మహిళలను వేధిస్తోన్న వారి ఆటలకు చెక్ పెట్టేలా కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. న్యూడిటీ ప్రొటెక్షన్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఫీచర్ సహాయంతో ఎవరైనా న్యూడ్ ఫొటోలను డైరెక్ట్ మెసేజ్‌ల ద్వారా పంపిస్తే.. వెంటనే ఫిల్టర్ చేసి సదరు ఫొటోలను యూజర్లకు కనిపించకుండా చేస్తుంది. ఇన్‌స్టాలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న హిడెన్ వర్డ్స్ ఫీచర్‌లాగే ఇది కూడా పనిచేస్తుంది.
#Instagram is working on nudity protection for chats ?
ℹ️ Technology on your device covers photos that may contain nudity in chats. Instagram CAN’T access photos. pic.twitter.com/iA4wO89DFd
— Alessandro Paluzzi (@alex193a) September 19, 2022
ఈ ఫీచర్‌కు సంబంధించిన అలెసాండ్రో ఫౌజీ అనే డెవలపర్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఫీచర్ ఫొటోతో పాటు.. ‘ఇన్‌స్టాగ్రామ్ న్యూడిటీ ప్రొటెక్షన్‌ను తీసుకొస్తుంది. ఇందులోని టెక్నాలజీ ఎవరైనా సెండ్ చేసే మెసేజ్‌ల్లో ఫొటోలు అభ్యంతరకరంగా ఉంటే వాటిని అవతలి వ్యక్తికి కనబడకుండా చేస్తుంది’’ అని ఫౌజీ పేర్కొన్నాడు. మరి ఈ ఫీచర్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో చూడాలి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..