Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Report: వడ్డీ రేట్లు మరోసారి పెరగొచ్చు.. నివేదిక విడుదల చేసిన ఎస్‌బీఐ..

ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకురావడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆగస్టు, అక్టోబర్‌లలో జరిగే ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షలో పాలసీ రేటు మరింత పెరగవచ్చని ఎస్‌బీఐ రీసెర్చ్ సోమవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది...

SBI Report: వడ్డీ రేట్లు మరోసారి పెరగొచ్చు.. నివేదిక విడుదల చేసిన ఎస్‌బీఐ..
Interest Rates
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jun 14, 2022 | 8:34 AM

ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకురావడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆగస్టు, అక్టోబర్‌లలో జరిగే ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షలో పాలసీ రేటు మరింత పెరగవచ్చని ఎస్‌బీఐ రీసెర్చ్ సోమవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుందని కూడా నివేదికలో పేర్కొంది. ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం దాదాపు ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతానికి చేరుకుంది. మేలో కాస్త మెత్తబడి 7.04 శాతానికి దిగజారింది. SBI రీసెర్చ్ నివేదిక Ecowrap ప్రకారం ప్రధాన ద్రవ్యోల్బణం కూడా ఏప్రిల్‌లో 6.97 శాతం నుంచి మేలో 6.09 శాతానికి తగ్గింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో ఆర్‌బిఐ చాలా ముందుందని నివేదిక విశ్లేషించింది. అటు యుఎస్‌లో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతోంది. అమెరికాలో ద్రవ్యోల్బణం మే నెలలో నాలుగు దశాబ్దాల గరిష్ఠ స్థాయి 8.6 శాతానికి చేరుకుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ ఈ నివేదికను విడుదల రూపొందించారు. నివేదిక ప్రకారం ఆగస్టులో ద్రవ్య విధాన సమీక్షలో ఆర్‌బిఐ పాలసీ రేటు పెంపును పరిశీలించే అవకాశం ఉంది. జూన్‌లో ద్రవ్యోల్బణం 7 శాతానికి మించి ఉండడమే ఇందుకు కారణం. అక్టోబర్ ద్రవ్య విధాన సమీక్షలో దీనిని పెంచవచ్చు. ఇది పాలసీ రేటును అంటువ్యాధికి ముందు ఉన్న 5.5 శాతం కంటే ఎక్కువగా పెంచవచ్చు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలోకి తీసుకురావడానికి RBI పాలసీ రేటు రెపో రేటును మేలో 0.40 శాతం మరియు జూన్‌లో 0.50 శాతం పెంచింది. దీంతో రెపో రేటు 4.9 శాతానికి చేరింది.