Retail Inflation: మేలో తగ్గిన రిటైల్‌ ద్రవ్యోల్బణం.. 7.79 నుంచి 7.04 శాతానికి తగ్గింపు..

ప్రపంచాన్ని ద్రవ్యోల్బణం భయాందోళనకు గురి చేస్తుంది. ఇటు భారత్‌లోనూ ద్రవ్యోల్బణం పెరుగుతోంది. మేలో రిటైల్‌ ఇన్‌ఫ్లేషన్‌ 7.04 శాతంగా నమోదు అయింది...

Retail Inflation: మేలో తగ్గిన రిటైల్‌ ద్రవ్యోల్బణం.. 7.79 నుంచి 7.04 శాతానికి తగ్గింపు..
Inflation
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jun 14, 2022 | 8:24 AM

ప్రపంచాన్ని ద్రవ్యోల్బణం భయాందోళనకు గురి చేస్తుంది. ఇటు భారత్‌లోనూ ద్రవ్యోల్బణం పెరుగుతోంది. మేలో రిటైల్‌ ఇన్‌ఫ్లేషన్‌ 7.04 శాతంగా నమోదు అయింది. ఆహార వస్తువులు, ఇంధన ధరలు కాస్త శాంతించడంతో మే నెలలో రిటైల్‌ (సీపీఐ) ద్రవ్యోల్బణం 7.04 శాతానికి నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్‌లో ఇది 7.79 శాతంగా నమోదైంది. 2021 మేలో ఇది 6.3 శాతంగా ఉంది. వరుసగా 5వ నెలా రిటైల్‌ ద్రవ్యోల్బణం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిర్దేశిత స్థాయి 2-6 శాతం కంటే అధికంగానే నమోదు కావడం గమనార్హం. అటు ఆహార ద్రవ్యోల్బణం మేలో 7.97 శాతంగా నమోదు అయింది. ఇది ఏప్రిల్‌లో 8.38 శాతంగా ఉంది. అలాగే బట్టలు, చెప్పుల ద్రవ్యోల్బణం కూడా 9.85 నుంచి 8.85కి తగ్గింది.

తృణధాన్యాలు, ఉత్పత్తుల విభాగ ద్రవ్యోల్బణం 5.96 శాతం నుంచి 5.33 శాతానికి తగ్గింది. నూనెలు, కొవ్వుల విభాగ ద్రవ్యోల్బణం 17.28 శాతం నుంచి 13.26 శాతానికి తగ్గింది. పండ్ల ధరలు 4.99 శాతం నుంచి 2.33 శాతానికి తగ్గాయి. కూరగాయల ధరలు మాత్రం 15.41 శాతం నుంచి 18.26 శాతానికి పెరిగాయి. గుడ్లు, పప్పులు, ఉత్పత్తులు -0.42 శాతం నుంచి -4.64 శాతానికి చేరాయి. ఇంధన, విద్యుత్‌ ద్రవ్యోల్బణం 10.80 శాతం నుంచి 9.54 శాతానికి దిగొచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 7.5 శాతంగా నమోదు కావొచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది.