RBI Monetary Policy: ఆర్బీఐలో ద్రవ్య విధానం, రెపో రేటు, రివర్స్ రెపో రేటు అంటే ఏమిటి?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మానిటరీ పాలసీ కమిటీ 3 రోజుల కొనసాగుతున్న సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ సమావేశంలో రెపోరేటును యథాతథంగా ఉంచారు. ఎన్నికలకు ముందు రిజర్వ్ బ్యాంక్ ప్రజలకు గొప్ప ఊరటనిచ్చింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ వివరిస్తూ, ఈసారి కూడా రెపో..

RBI Monetary Policy: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మానిటరీ పాలసీ కమిటీ 3 రోజుల కొనసాగుతున్న సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ సమావేశంలో రెపోరేటును యథాతథంగా ఉంచారు. ఎన్నికలకు ముందు రిజర్వ్ బ్యాంక్ ప్రజలకు గొప్ప ఊరటనిచ్చింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ వివరిస్తూ, ఈసారి కూడా రెపో రేటులో ఎటువంటి మార్పు చేయలేదని, ఈ రేట్లను 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచామని చెప్పారు.
మూడు రోజులుగా జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మానిటరీ పాలసీ కమిటి సమావేశం (ద్రవ్య విధాన సమావేశం) మూడు రోజులుగా కొనసాగింది. సమావేశాల అనంతరం ఆర్బీఐ తన నిర్ణయాన్ని ప్రకటించింది. దేశంలో రెపోరేటును యథాతథంగా ఉంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. అంతే వినియోగదారులు బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలపై చెల్లించే ఈఎంఐలలో ఎలాంటి పెరుగుదల ఉండదు. 2024-25 కొత్త ఆర్థిక సంవత్సరానికి మొదటి ద్రవ్య విధానం వచ్చింది. దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతి రెండు నెలలకోసారి ద్రవ్య విధానాన్ని అందజేస్తుంది. ఇందులో ప్రధానంగా రెపో రేటు, రివర్స్ రెపో రేటుపై నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ ద్రవ్య విధానం, రెపో రేటు లేదా రివర్స్ రెపో రేటు ఏమిటో మీకు తెలుసా? ఇక్కడ మీరు సులభమైన భాషలో అర్థం చేసుకోవచ్చు.
ద్రవ్య విధానం అంటే ఏమిటి?
ద్రవ్య విధానం గురించి అర్థం చేసుకుంటే.. సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ దాని ద్వారా మార్కెట్లో నగదు ప్రవాహాన్ని నిర్వహిస్తుంది. మార్కెట్‌లో నగదు ప్రవాహం ఎంత తక్కువగా ఉంటే, ప్రజల కొనుగోలు శక్తిని నియంత్రించడంలో ఇది ఎంతగానో దోహదపడుతుంది. ఇది అంతిమంగా డిమాండ్‌ను తగ్గిస్తుంది. అలాగే ద్రవ్యోల్బణం తగ్గుతుంది. అయితే ఇందులో కొంత రిస్క్ కూడా ఉంది. దీని కోసం ఆర్‌బిఐ బ్యాలెన్స్‌ను పాటించాలి. ద్రవ్య విధానంలో దేశ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి ఆగిపోయేంతగా డిమాండ్ తగ్గకుండా నగదు ప్రవాహాన్ని కొనసాగించాలి. అందువల్ల భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రతి రెండు నెలలకోసారి ఇలా చేస్తుంది. అలాగే రెపో రేటు – రివర్స్ రెపో రేటును సమీక్షిస్తుంది. ద్రవ్య విధానాన్ని సమీక్షించేందుకు ఆర్‌బీఐలో ‘మానిటరీ పాలసీ కమిటీ’ ఏర్పాటు చేసింది. ఆరుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీ 3 రోజుల పాటు సమావేశమై ద్రవ్య విధానంపై నిర్ణయాలు తీసుకుంటుంది.
రెపో రేటు అంటే ఏమిటి?
ఇప్పుడు రెపో రేటు అంటే ఏమిటో తెలుసుకుందాం.. ఆర్‌బీఐ వద్ద వాణిజ్య బ్యాంకులు రుణాలు తీసుకుంటాయి. అలా వాణిజ్య బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద రుణాలు తీసుకున్నపుడు వసూలు చేసే రేటును రెపో రేటు అంటారు. ఆర్బీఐ తనంతట తానుగా మార్కెట్‌లో నగదు ప్రవాహాన్ని నిర్వహించదు. అందుకోసం బ్యాంకుల సహాయం తీసుకుంటుంది. భారతదేశంలోని బ్యాంకులు కరెన్సీ నోట్ల కోసం ఆర్‌బిఐపై ఆధారపడతాయి. ప్రస్తుతం రెపో రేటు 6.50 శాతంగా ఉంది.
రివర్స్ రెపో రేటు అంటే ఏమిటి?
ఇక రివర్స్ రేపోరేటు అంటే.. బ్యాంకులో అవసరమైన దానికంటే ఎక్కువ డబ్బు జమ ఉన్నట్లయితే ఆ డబ్బును ఆర్బీఐకి ఇస్తుంది. ఆర్‌బీఐ ఈ డబ్బును బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకుని వాటికి వడ్డీని చెల్లిస్తుంది. ఈ వడ్డీని రివర్స్ రెపో రేటు అంటారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








