RBI Monetary Policy: ఆర్బీఐ గుడ్‌న్యూస్.. యూపీఐ చెల్లింపులపై తీపి కబురు
రిజర్వ్ బ్యాంక్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాను ఏకమొత్తంలో 0.5 శాతం పెంచింది. కొత్త అంచనాలో, 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశ జిడిపి వృద్ధి 7 శాతంగా ఉండవచ్చని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. దీనికి ముందు గత MPC సమావేశంలో, RBI వృద్ధిని 6.5 శాతంగా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24 మూడో త్రైమాసికానికి రిజర్వ్ బ్యాంక్ వృద్ధి అంచనాను 6 శాతం నుంచి..
దేశంలో యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. UPI చెల్లింపు ప్రక్రియను చాలా సులభతరం చేసింది. ప్రతి నెలా UPI లావాదేవీల సంఖ్య పెరుగుతూ ఉండటానికి ఇదే కారణం. రెపో రేటులో ఎలాంటి మార్పు చేయడం లేదని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ఎంపీసీ ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలల్లో యూపీఐ లావాదేవీల పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు.
యూపీఐ చెల్లింపుల్లో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుతం రూ.5 నుంచి రూ. లక్ష వరకు కూడా యూపీఐ చెల్లింపులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రుల్లో బిల్లు చెల్లింపులకు లక్ష రూపాయల వరకు పరిమితి ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో పరిమితిని పెంచుతూ ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
కాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) సమావేశంలో పాలసీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకూడదని నిర్ణయించింది. దీనివల్ల బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలు, బ్యాంకుల్లో డిపాజిట్లపై వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు వచ్చే అవకాశం లేదు. MPC నిర్ణయాలను ప్రకటిస్తూ, RBI రెపో రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచాలని నిర్ణయించినట్లు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. అలాగే, SDF రేటు 6.25 శాతం, MSF రేటు 6.75 శాతం వద్ద కొనసాగవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఈనిర్ణయం తర్వాత, రుణ EMI లేదా FD పై వడ్డీ రేటు పెరిగే అవకాశం లేదు.
రిజర్వ్ బ్యాంక్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాను ఏకమొత్తంలో 0.5 శాతం పెంచింది. కొత్త అంచనాలో, 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశ జిడిపి వృద్ధి 7 శాతంగా ఉండవచ్చని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. దీనికి ముందు గత MPC సమావేశంలో, RBI వృద్ధిని 6.5 శాతంగా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24 మూడో త్రైమాసికానికి రిజర్వ్ బ్యాంక్ వృద్ధి అంచనాను 6 శాతం నుంచి 6.5 శాతానికి పెంచింది. అలాగే నాలుగో త్రైమాసికంలో వృద్ధి అంచనాను 5.7 శాతం నుంచి 6 శాతానికి పెంచింది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2024-25 మొదటి త్రైమాసికంలో 6.7 శాతం, రెండో త్రైమాసికంలో 6.5 శాతం, మూడో త్రైమాసికంలో 6.4 శాతం వృద్ధిని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది.
ద్రవ్యోల్బణానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ తన అంచనాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉండవచ్చని ఆర్‌బీఐ పేర్కొంది. ద్రవ్యోల్బణం రేటు డిసెంబర్ త్రైమాసికంలో 5.6 శాతం, మార్చి త్రైమాసికంలో 5.2 శాతంగా అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2024-25 మొదటి త్రైమాసికంలో సగటు ద్రవ్యోల్బణం రేటు 5.2 శాతంగా, రెండో త్రైమాసికంలో 4 శాతంగా, మూడో త్రైమాసికంలో 4.7 శాతంగా ఉండవచ్చని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి