Ration Card: చిన్న పొరపాటుతో 80 వేల రేషన్‌కార్డులు రద్దు.. కారణం ఏంటంటే..
రేషన్ కార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహస్తోంది. ఎలాంటి అర్హత లేకుండా రేషన్ కార్డులు పొందుతూ ఉచితంగా రేషన్ తీసుకుంటున్నవారిపై ప్రత్యేక నిఘా పెంచింది కేంద్రం..
రేషన్ కార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహస్తోంది. ఎలాంటి అర్హత లేకుండా రేషన్ కార్డులు పొందుతూ ఉచితంగా రేషన్ తీసుకుంటున్నవారిపై ప్రత్యేక నిఘా పెంచింది కేంద్రం. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు చేపడుతున్నాయి. రేషన్‌కార్డుదారుల పొరపాటు వల్ల 80 వేల కార్డులు రద్దయ్యాయి. వాస్తవానికి కార్డుదారులు ఆరు నెలల పాటు నిరంతరం రేషన్ తీసుకోకపోతే అతని పేరును ప్రభుత్వం జాబితా నుండి తొలగిస్తుంది. దాని స్థానంలో మరో నిరుపేద వ్యక్తికి రేషన్‌కార్డు తయారు జారీ చేస్తారు.
గోవా ప్రభుత్వం ఆరు నెలలుగా రేషన్ తీసుకోని వారి రేషన్ కార్డును రద్దు చేసింది. ఈ కార్డ్ హోల్డర్లు ఆగస్టు 2022 నుండి జనవరి 2023 వరకు తమ రేషన్ తీసుకోలేదు. రేషన్ తీసుకోని కార్డుదారుల కార్డులను రద్దు చేసినట్లు పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల డైరెక్టర్ గోపాల్ పర్సేకర్ తెలిపారు. దీనితో పాటు ఇంత పెద్ద సంఖ్యలో కార్డుదారులు రేషన్ ఎందుకు తీసుకోలేదో కూడా డిపార్ట్‌మెంట్ విచారణ చేస్తోందని చెప్పారు.
రాష్ట్రంలో 13.32 లక్షల మంది రేషన్ కార్డుదారులున్నారు. వీరిలో 80 వేల మంది రేషన్ కార్డుదారులకు రేషన్ తీసుకోకపోవడం పెద్ద విషయమే అయినా.. ఇలాంటి పరిస్థితుల్లో ఇంతమంది ఎందుకు రేషన్ తీసుకోలేదని శాఖాపరంగా విచారణ జరుగుతోంది. తమ సమ్మతి ఆధారంగా కార్డును రద్దు చేయాలని అభ్యర్థించిన వారు తమ కార్డును మళ్లీ జారీ చేసుకోవచ్చని పర్సేకర్ చెప్పారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి