Savings Account Close: ఖాతాదారులకు ఆ బ్యాంకు హెచ్చరిక.. ఆ పని చేయకపోతే పది రోజుల్లో అకౌంట్ క్లోజ్..!

ఏదో ఓ అవసరంతో కొన్ని బ్యాంకుల్లో ఖాతాలు తీసుకుని అవసరం తీరిపోయాక ఖాతాను వాడని వాళ్లు చాలా మంది ఉంటారు. అయితే ఇలాంటి ప్రముఖ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ షాకింగ్ వార్త చెప్పింది. వినియోగంలో లేని ఖాతాలు ఈ నెలాఖరులోపు కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోతే జూన్ 30వ తేదీన ఖాతాలన్నీ క్లోజ్ చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో మీకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఖాతా ఉంటే ఆ ఖాతా క్లోజ్ అవ్వకుండా ఉండేందుకు కేవైసీ ప్రక్రియ ఎలా చేపట్టాలో? ఓసారి తెలుసుకుందాం.

Savings Account Close: ఖాతాదారులకు ఆ బ్యాంకు హెచ్చరిక.. ఆ పని చేయకపోతే పది రోజుల్లో అకౌంట్ క్లోజ్..!
Bank Account
Follow us
Srinu

|

Updated on: Jun 20, 2024 | 4:15 PM

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికీ బ్యాంకు అకౌంట్ అనేది తప్పనిసరి అవసరంగా మారింది. భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ వృద్ధికి బ్యాంకు అకౌంట్లే కారణమని నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే ఏదో ఓ అవసరంతో కొన్ని బ్యాంకుల్లో ఖాతాలు తీసుకుని అవసరం తీరిపోయాక ఖాతాను వాడని వాళ్లు చాలా మంది ఉంటారు. అయితే ఇలాంటి ప్రముఖ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ షాకింగ్ వార్త చెప్పింది. వినియోగంలో లేని ఖాతాలు ఈ నెలాఖరులోపు కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోతే జూన్ 30వ తేదీన ఖాతాలన్నీ క్లోజ్ చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో మీకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఖాతా ఉంటే ఆ ఖాతా క్లోజ్ అవ్వకుండా ఉండేందుకు కేవైసీ ప్రక్రియ ఎలా చేపట్టాలో? ఓసారి తెలుసుకుందాం.

ఖాతా స్థితి

మీకు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో సేవింగ్స్ ఖాతా ఉంటే ముందుగా దాని స్థితిని తనిఖీ చేయాలి. ఇలాంటి ఖాతాలను ఈ నెలాఖరులోగా పీఎన్‌బీ మూసివేయనుంది. గత 3 సంవత్సరాలుగా ఎలాంటి లావాదేవీలు జరగని ఖాతాలపై బ్యాంక్ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. అలాగే గత మూడేళ్లుగా ఖాతా బ్యాలెన్స్ జీరో ఉన్న వారి ఖాతాలను కూడా బ్యాంకు మూసేనుంది. అలాంటి వినియోగదారులకు ఇప్పటికే బ్యాంకు నోటీసులు పంపింది. నోటీసు పంపిన ఒక నెల తర్వాత ఆ ఖాతాలు మూసివేస్తారు. మీరు ఆ ఖాతాలను యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకుంటే, వెంటనే బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లి కేవైసీని పూర్తి చేయాలి. 

దుర్వినియోగాన్ని నిరోధించేందుకే..

చాలా మంది స్కామర్‌లు చాలా కాలంగా కస్టమర్‌లు ఉపయోగించని ఖాతాలను దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాంటి కేసులను ఎదుర్కోవడానికి బ్యాంక్ ఈ పెద్ద అడుగు వేసింది. బ్యాంక్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 30, 2024 నాటికి ఏయే ఖాతాలు ఇన్‌యాక్టివ్ ఉన్నాయో? గుర్తించింది. ఆ మేరకు వారికి నోటిసులు పంపి జూన్ 30నాటికి ఖాతాలను క్లోజ్ చేయనున్నారు. 

ఇవి కూడా చదవండి

కేవైసీ ఇలా

బ్యాంక్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం,  ఖాతా నిష్క్రియంగా మారితే, ఖాతాదారుడు ఖాతాను తిరిగి యాక్టివేట్ చేయాలనుకుంటే అటువంటి ఖాతాదారులు సంబంధిత శాఖకు వెళ్లి కేవైసీ ఫారమ్‌ను పూరించాలి. కేవైసీ ఫారమ్‌తో పాటు కస్టమర్ అవసరమైన పత్రాలను కూడా జతచేయాలి. దీని తర్వాత వారి ఖాతా యాక్టివేట్ అవుతుంది. కస్టమర్లు మరింత సమాచారం కోసం బ్యాంకుకు వెళ్లవచ్చు.

ఆ ఖాతాలకు ప్రత్యేక మినహాయింపు

పంజాబ్ నేషనల్ బ్యాంకు డీమ్యాట్ ఖాతాలను మూసివేయదు. అంటే డీమ్యాట్ ఖాతాకు ఈ నిబంధన వర్తించదు. సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్‌వై), ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన, అటల్ పింఛన్ యోజన వంటి పథకాల కోసం తెరిచిన ఖాతాలను పీఎన్‌బీ మూసివేయదని సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్‌లో బ్యాంక్ తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి